ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతున్న "చల్తే చల్తే"
"పిట్టగోడ" ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ, ప్రియాంక జైన్ జంటగా అమేజింగ్ ఆర్ట్స్ పతాకంపై శ్రీనివాసరావు పొట్లూరి, ప్రదీప్ కుమార్ కోనేరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "చల్తే చల్తే". ప్రదీప్ కెకె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు-సంగీత దర్శకుడు ప్రదీప్ కెకె మాట్లాడుతూ.. "ఒక క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రం "చల్తే చల్తే". విశ్వదేవ్ రాచకొండకు హీరోగా మంచి గుర్తింపునిచ్చే చిత్రమిది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి ప్రశంసలు లభించాయి. త్వరలోనే టీజర్ ను విడుదల చేసి, అతి త్వరలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాం. క్యూట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన మా చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.
రావురమేష్, షాయాజీ షిండే, వి.కె.నరేష్, రాజశ్రీ నాయర్, ప్రగతి, ఉత్తేజ్, దువ్వాసి మోహన్, సూర్య, గౌతమ్ రాజు తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: వై.నాగు, కొరియోగ్రఫీ: భాను, స్టంట్స్: స్టంట్స్ శ్రీ, సినిమాటోగ్రఫీ: డి.ఆర్.వెంకట్, ఎడిటింగ్: ఉపేంద్ర, నిర్మాణం: అమేజింగ్ ఆర్ట్స్, నిర్మాతలు: శ్రీనివాసరావు పొట్లూరి, ప్రదీప్ కుమార్ కోనేరు, సంగీతం-దర్శకత్వం: ప్రదీప్ కెకె.