Raviteja’s Touch Chesi Chudu movie censored, releasing on February 2nd

`ట‌చ్ చేసి చూడు` సినిమా సెన్సార్ పూర్తి ...ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌ల‌

మాస్ మహారాజా రవితేజ హీరోగా న‌టించిన చిత్రం  'టచ్ చేసి చూడు`. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన  చిత్ర‌మిది.   విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ నాయిక‌లు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఫిబ్ర‌వ‌రి 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా... నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ  `ట‌చ్ చేసి చూడు` చిత్రం సెన్సార్ పూర్త‌య్యింది. సినిమాకు `యు/ఎ` స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. ఈ వారంలో  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాం.  ఇటీవ‌ల సోషల్ మీడియా ద్వారా విడుద‌ల చేసిన పాటలకు , టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ర‌వితేజ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నార‌ని సర్వ‌త్రా అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. ఫిబ్ర‌వ‌రి 2న సినిమా విడుద‌ల‌వుతుంది. చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ,  ఛాయాగ్రహణం :  చోటా.కె.నాయుడు,  నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%