Anushka, UV Creations Bhaagamathie movie team are in Kerala for movie promotions

కేర‌ళ ప్రమెష‌న్ లో అనుష్క‌, యు.వి.క్రియెష‌న్స్ భాగ‌మ‌తి టీం

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్ తొ స‌హ అన్ని ప్ర‌మెష‌న‌ల్ మెటిరియ‌ల్స్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి అనూహ్యమైన స్పంద‌న వ‌చ్చింది.  ముఖ్యంగా ట్రైల‌ర్ లొ అనుష్క న‌ట‌విశ్వ‌రూపం చూపించే డైలాగ్ ఎవ‌డు పడితే వాడు రావడానికి ... ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల గొడ్డా...భాగమతి అడ్డా.... లెక్కలు తేలాలి... ఒక్కడ్ని పోనివ్వను... విప‌రీతంగా వైర‌ల్ కావ‌టం విశేషం. అలాగే మందారా మందారా...కరిగే తెల్లారేలా అంటూ సాగే పాటకు మ్యూజిక్ లవర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.  అనుష్క, ఉన్ని ముకుందన్ మీద చిత్రీకరించిన ఈ ప్లెజెంట్ సాంగ్ కు యూత్ ఫిదా అవుతున్నారు.  అశోక్  దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశి, ప్ర‌మెద్‌, విక్ర‌మ్ లు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సౌత్ ఇండియాలో మెత్తం గా అన్ని భాష‌ల్లో జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా చెన్నైలో ఆడియో రిలీజ్, హైద‌రాబాద్ లొ ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ చేసిన విష‌యం తెలిసిందే.. ఇప్పుడు కేర‌ళ లో కూడా ప్ర‌మెష‌న్ ని ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశారు. కేర‌ళ ప్ర‌మెష‌న్స్ కి నిర్మాత‌లు ప్ర‌మెద్‌, విక్ర‌మ్ లు, ద‌ర్శ‌కుడు అశోక్‌, హీరోయిన్ అనుష్క‌, ఉన్ని ముకుంద‌న్ లు హ‌జ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రం త‌రువాత అనుష్క గారు న‌టించిన చిత్రం మా భాగ‌మ‌తి. ఇప్ప‌టికే విప‌రీతమైన క్రేజ్ వున్న ఈ చిత్రం అంద‌రి అంచ‌నాల‌కు అందుకునేలా వుంటుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దేవ‌సేన గా అభిమాన ధ‌నాన్ని సంపాయించుకున్న అనుష్క న‌టించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో 10 మిలియ‌న్ వ్యూస్ రావ‌టం ఈచిత్రం పై ప్రేక్ష‌కుల అంచ‌నాలు తెలుస్తుంది.  అనుష్క నటన, దర్శకుడు అశోక్ టేకింగ్, మథి కెమెరా వర్క్, అబ్బుర పరిచే రవీందర్ ఆర్ట్ వర్క్, తమన్ రీ రికార్డింగ్, నిర్మాణాత్మక విలువలు హై స్టాండర్డ్స్ లో ఉంటాయి. ఇది ఏ ఓక్క భాష‌కి సంభందించిన క‌థ కాదు. యూనివ‌ర్స‌ల్ స‌బ్జ‌క్ట్‌. త‌ప్ప‌కుండా ఏ భాష‌లో అయినా హ్య‌మ‌న్‌ ఎమెష‌న్ ఒక్క‌టే కాబ‌ట్టి ఈ చిత్రాన్ని సౌత్ ఇండియా మెత్తం అన్ని భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌మెష‌న్ లో భాగంగా కేర‌ళ కి వ‌చ్చాము. కేర‌ళ లో అనుష్క గారికి చాలా పెద్ద ఫ్యాన్ బ్యాంక్ వుంది. అదేవిధంగా ఉన్ని ముకుంద‌న్ లాంటి మ‌ళ‌యాల స్టార్ కూడా న‌టించారు. ఇంకా చాలా మంది మ‌ళ‌యాల న‌టీన‌టులు న‌టించ‌టంతో కేర‌ళ సినిమా ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని హ్రుద‌యానికి ద‌గ్గ‌ర‌గా తీసుకున్నారు. త‌ప్ప‌కుండు ఈ చిత్రం అన్ని భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని మా న‌మ్మ‌కం. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు అశోక్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఇంత పెద్ద అవ‌కాశాన్ని అందించిన నిర్మాత‌లు వంశి, ప్ర‌మెద్‌, విక్ర‌మ్ ల‌కి నా హ్రుద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు.. వీరిని నేను త్రీమూర్తులు అంటుంటాను. అయితే నాకు ఇంత శ‌క్తిని అందించింది మాత్రం అనుష్క గారు. ఈ చిత్రానికి ప్రాంతం, భాష లేదు..హ్య‌మ‌న్‌ ఎమెష‌న్ మాత్ర‌మే వుంది. ప్ర‌తిఒక్క‌రు అన్ని భాష‌ల్లో ఈ చిత్రాన్ని చూసి ఆనందిస్తారు. త‌ప్ప‌కుండా స‌ర్‌ప్రైజ్ అవుతారు. భాగ‌మ‌తి చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ మ‌రియు సాంకేతికి నిపుణులు అంద‌రూ ఈ చిత్రంలో పాత్ర‌ల్లా చేశారు. మెము వేసిన బంగ్లా సెట్ చిత్రం లో కీల‌క పాత్ర పోషిస్తుంది. అలాగే థ‌మ‌న్ గారి రీ-రికార్డింగ్, మాట‌లు, ఎఫెక్ట్స్ , ప్రోడ‌క్ష‌న్ వాల్యూస్ ఇలా ప్ర‌తి ఓక్క‌రి క‌ష్టం చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడ్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు

హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ.. నాకు ఇలాంటి ఓ మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన యు వి క్రియెష‌న్స్ వంశి, ప్ర‌మెద్‌, విక్ర‌మ్ లు నా థ్యాంక్స్‌. నా పెయిర్ గా న‌టించిన ఉన్ని ముకుంద‌న్ గారికి నా థ్యాంక్స్‌. న‌న్ను ఇంత బాగా చూపించిన సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ధి గారికి థ్యాంక్స్‌. కేర‌ళ కి ప్ర‌మెష‌న్ కి రావ‌టం చాలా హ్య‌పి గా వుంది. అందరికి ఈ చిత్రం న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను. అలాగే ద‌ర్శ‌కుడు అశోక్ చాలా బాగా నేరేట్ చేశారు, అదే రేంజి లో తీసారు. ఆర్ట్ ర‌వింద‌ర్ గారు వ‌ర్క్ ఈచిత్రంలో చాలా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది. జ‌న‌వరి 26న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. అని అన్నారు

నటీనటులు - అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్
సంగీతం - ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రాఫర్ - మథి
పి ఆర్ ఓ- ఏలూరు శ్రీను
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్
ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్
నిర్మాతలు - వంశీ - ప్రమోద్-విక్ర‌మ్‌
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%