మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ `తొలిప్రేమ` ఆడియో ఆవిష్కరణ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం తొలిప్రేమ
. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నారు.. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా... బిగ్ సీడీని, ఆడియో సీడీలను అల్లు అరవింద్ విడుదల చేయగా.. తొలి సీడీని దిల్‌రాజు అందుకున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ - ఈ సినిమా చేసే క్రమంలో ఆరు నెలల వరకు ఏ టైటిల్ పెడదామని ఆలోచించాం. దర్శకుడు వెంకీ ముందుగా తొలిప్రేమ అనే టైటిల్ పెడదామని అనడంతో.. నాకు ఇష్టమున్నా కూడా కాస్త భయపడ్డాను. ఆ టైటిల్ పెట్టుకుని ఏమైనా తేడా వస్తే... మనకు పగిలిపోద్ది అని అన్నాను. ఎందుకంటే అది బాబాయ్‌కి ఐ కాంటాక్ట్ మూవీ. డెఫనెట్‌గా అప్పటి తొలిప్రేమను ప్రేక్షకులు ఎంత ఆదరించారో తెలుసు. కాబట్టి ఆ సినిమా టైటిల్ పెట్టినందుకు జస్టిఫై చేసేలా మా సినిమా ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. సినిమా చూశాం. రేపు ప్రేక్షకులు , అభిమానులు ఎవ్వరూ కూడా డిసప్పాయింట్ కారు. లోఫర్, ఫిదా ముందు ఈ కథను విన్నాను. కథ నచ్చంది. నా మనసుకు దగ్గరైన కథ. తనను కొన్ని రోజులు వెయిట్ చేయమని అన్నాను. తను నా కోసం వెయిట్ చేశాడు. మా నిర్మాతలు బాబీ, భోగవల్లి ప్రసాద్‌గారికి థాంక్స్. మా బాబాయ్, బన్ని అన్నతో ఆయన సినిమాలు చేశారు. నాకు కూడా మంచి సినిమా ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. ప్రియదర్శి, హైపర్ ఆది సహా నా పర్సనల్ ప్రెండ్స్ కూడా ఈ సినిమాలో నటించారు. మంచి ప్రేమకథకు మంచి సంగీతం, మంచి కెమెరా వర్క్ ఉండాలి. తమన్ మంచి మ్యూజిక్,. జార్జ్ మంచి విజువల్స్ అందించారు. నాకు హీరోయిన్స్ వెతకడం అంటే చాలా కష్టం. నా హైట్‌కు సరిపోరు. కానీ తొలిసారి నా హైట్‌కు సరిపోయేలా రాశిఖన్నా దొరికింది. వర్ష అనే క్యారెక్టర్‌కు రాశి తన నటనతో న్యాయం చేసింది. మా పెద్దనాన్న, బాబాయ్ వేసిన ఈ ఫౌండేషన్‌ను పాడు చేయకుండా మంచి సినిమాలు చేస్తాం
అన్నారు.
చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ - నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నన్ను నమ్మిన వ్యక్తి... ఇండస్ట్రీని నన్ను నమ్మేలా చేసిన వ్యక్తి దిల్‌రాజుగారు. ఇక వరుణ్ విషయానికి వస్తే.. నేను ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న తరుణంలో ఆరు అడుగల నాలుగు అంగులాల ధైర్యాన్నిచ్చాడు. తర్వాత నా నమ్మకానికి ఊపిరి పోసిన వ్యక్తి బాపినీడు. తమన్‌ని, శ్రీమణిని మంచి సాంగ్స్ కోసం ఇబ్బంది పెట్టాను. ఇక కెమెరా మెన్ జార్జ్ నేను కన్న కలను తెరపై అందంగా చూపించిన వ్యక్తి. అలాగే ఎడిటర్ నవీన్ నేను తీసిన సినిమాను అందంగా ఎడిట్ చేశారు. ఇక సీనియర్ నరేష్, ఆది, ప్రియదర్శి, అపూర్వ సహా అందరికీ థాంక్స్. ఇప్పటి వరకు రాశిని గ్లామర్ క్వీన్‌గా చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాలో పెర్ఫామెన్స్ తో ఆకట్టుకునే రాశి ఖన్నా కనపడుతుంది. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్
అన్నారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ - బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారికి, నాకు చాలా మంచి అనుబంధం ఉంది. `మగధీర` సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా నాకు సినిమా చేశారు. పవర్‌స్టార్ పవన్‌తో అత్తారింటికి దారేది చేసిన ప్రసాద్‌గారు ఇప్పుడు ఆయన సినిమా టైటిల్‌తోనే వరుణ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. అప్పుడు పవన్‌కల్యాణ్‌గారికి తొలిప్రేమ సమయంలో ఎంత మంచి పేరొచ్చిందో ఈ తొలిప్రేమ సినిమాలో వరుణ్ తేజ్‌కు అంతే మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను. తమన్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ డైరెక్టర్. వరుణ్ రెండో సినిమా నుండి తనకు నచ్చిన సినిమా చేయాలని నిర్ణయించుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తనకు ఆల్ ది బెస్ట్. ఈ తొలి ప్రేమ తప్పకుండా తనకు పెద్ద హిట్ అవుతుంది
అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ - ఇంత మంచి మెలోడీ ఆల్బమ్ చేసే అవకాశం కలిగించిన నిర్మాతలకు థాంక్స్. దర్శకుడు వెంకీ అట్లూరి నా నుండి మంచి మ్యూజిక్‌ను రాబట్టుకున్నారు. జార్జ్ అద్భుతమైన సినిమాలు చేసిన సినిమాటో్గ్రాఫర్ .. ఈ సినిమాకు తను రెండో హీరో. తన కారణంగా అవుట్‌పుట్ అద్భుతంగా ఉంది. వెంకీ ఎక్స్‌ట్రార్డినరీ స్క్రిప్ట్‌తో సినిమా చేశాడు
అన్నారు.
రాశిఖన్నా మాట్లాడుతూ - తొలి ప్రేమ నా హృదయానికి దగ్గరైన సినిమా ఇది. నేను గర్వపడే సినిమా అవుతుంది. వెంకీ అట్లూరి అద్భుతమైన స్క్రిప్ట్‌తో నా క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలన్నీ అందరికీ నచ్చుతుంది. సినిమాటోగ్రాఫర్ జార్జ్‌గారు ప్రతి సీన్‌ను అద్భుతంగా చూపించారు. వరుణ్ చాలా కష్టపడి, ప్యాషన్‌తో సినిమా చేశారు
అన్నారు.
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - తమన్ చేసిన ఆల్బమ్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్. మాకు, ప్రసాద్‌గారికి దగ్గర రిలేషన్ ఉంది. ఈ తొలిప్రేమ ఆడియో వేడుకలో ఆ తొలిప్రేమను గుర్తు చేసుకోవాల్సిందే. 20 సంవత్సరాలు క్రితం పవన్ తొలిప్రేమ విడుదలైంది. ఆ తొలి ప్రేమ ప్రేక్షకులను ఎలా ఊర్రుతలూగించిందో... ఈ తొలి ప్రేమ కూడా అలాగే ఊర్రుతలూగిస్తుంది. పిదాకు ముందు వెంకీ ఈ సినిమాను మా బ్యానర్‌లో చేయాల్సింది. కానీ ఫిదా కారణంగా తను బాపినీడుకి కథ వినిపించాడు. తనకు నచ్చడంతో సినిమా ఓకే అయ్యింది. మా బ్యానర్‌లో చేయాల్సిన సినిమాను వారి బ్యానర్‌లో చేశారనే కారణంతో... బాపినీడు ఈ సినిమా టోటల్ రైట్స్‌ను నాకు ఇచ్చేశాడు. ఇలాంటి విషయాలు అరుదుగా జరుగుతుంటాయి. 1998లో ఆ తొలిప్రేమ ఎలాంటి సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో 2018లో ఈ తొలి ప్రేమ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ. వరుణ్, రాశిఖన్నా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది
అన్నారు.
సీనియర్ నరేష్ మాట్లాడుతూ - భోగవల్లి ప్రసాద్ బ్యానర్‌లో నేను తొలిసారి పనిచేస్తున్నాను. చాలా మంచి నిర్మాత. బాపినీడు ముందుండి సినిమాను చక్కగా నిర్మించాడు. వెంకీ అట్లూరి సినిమాను చక్కగా, అందంగా తీశాడు. వరుణ్, బన్ని, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్, మా అబ్బాయి నవీన్ సహా అందరినీ మూడు అడుగుల బుల్లెట్స్‌లా చూశాను. ఇప్పుడు వరుణ్ విషయానికి వస్తే తను ఆరడుగుల నాలుగంగుల బుల్లెట్‌లా తయారయ్యాడు. తను ఇంకా మంచి సినిమాలు చేసి ముందుకెళ్లాలి. రాశిఖన్నా అద్భుతమైన పెర్ఫార్మర్. తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. తను అందించిన బెస్ట్ ఆల్బమ్స్‌లో ఇదొకటి. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ మంచి నటుడే కాదు.. ప్రజల మనిషి. ఆయన భవిష్యత్ బావుండాలని కోరుకుంటున్నాను
అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ - నాకు పదేళ్ల వయసున్నప్పుడు పవర్‌స్టార్‌గారి తొలిప్రేమ సినిమా చూశాను. సినిమా చాలా బావుంటుంది. వరుణ్ చక్కగా నటించాడు. ఆ తొలిప్రేమ చూసినప్పుడు ఎంత మంచి ఫీలింగ్ కలిగిందో.. ఈ తొలిప్రేమ చూసినప్పుడు కూడా అంతే మంచి ఫీలింగ్ కలుగుతుందని నా నమ్మకం. కెప్టెన్ బాపి యూనిట్‌ను ముందుండి నడిపించాడు. వెంకీ అట్లూరి, తమన్, జార్జ్ విలియమ్స్ నవీన్ ఇలా మంచి టీంతో కలిసి పనిచేశాను. అందరికీ థాంక్స్
అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
వరుణ్ తేజ్, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రానికి సంగీతంః ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్. నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, దర్శకత్వం : వెంకీ అట్లూరి.