Social News XYZ     

Mandaara song from Bhaagamathie gets good response, Grand release on January 26th

భాగమతి చిత్రంలోని మందారా సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్  ... జనవరి 26న గ్రాండ్ రిలీజ్

Mandaara song from Bhaagamathie gets good response, Grand release on January 26th

అనుష్క ముఖ్య పాత్రలో తెరకెక్కించిన భాగమతి చిత్రం ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.  ఎవ్వడు పడితే వాడు రావడానికి ... ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల గొడ్డా...భాగమతి అడ్డా.... లెక్కలు తేలాలి... ఒక్కడ్ని పోనివ్వను.... అంటూ అనుష్క భాగమతి ట్రైలర్ లో చెప్పిన  హై పిచ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.  ఇక ఇప్పుడు సినిమాలోని మంచి మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు. మందారా మందారా...కరిగే తెల్లారేలా అంటూ సాగే ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అనుష్క, ఉన్ని ముకుందన్ మీద చిత్రీకరించిన ఈ ప్లెజెంట్ సాంగ్ కు యూత్ ఫిదా అవుతున్నారు. ఈ అద్భుతమైన మెలోడీ సాంగ్ ను స్వరపరిచింది ఎస్.ఎస్.తమన్. శ్రీజో సాహిత్యం అందించారు. శ్రీయా ఘోషల్ తన మధురమైన గొంతుతో పాటకు ప్రాణం పోశారు. పిల్ల జమిందార్ వంటి సూపర్ చిత్రం అందించిన అశోక్ భాగమతి చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో ప్రమోద్, వంశీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ వండర్ బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న అనుష్క నటించిన భాగమతిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.  భాగమతి ట్రైలర్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.  అనుష్క నటన, దర్శకుడు అశోక్ టేకింగ్, మథి కెమెరా వర్క్, అబ్బుర పరిచే రవీందర్ ఆర్ట్ వర్క్, తమన్ రీ రికార్డింగ్, యువి క్రియేషన్స్ నిర్మాణాత్మక విలువలు హై స్టాండర్డ్స్ లో ఉంటాయి. అనుష్క గెటప్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా సినిమాలోని మందారా మందారా అంటూ సాగే మంచి మెలోడి సాంగ్ రిలీజ్ చేశాం. తమన్ సంగీతం, శ్రీజో సాహిత్యం, శ్రీయా ఘోషల్ గానం మ్యూజిక్ లవర్స్ ని మెస్మరైజ్ చేసింది.  భాగమతికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.  అని అన్నారు.

నటీనటులు - అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్
సంగీతం - ఎస్.ఎస్.తమన్
సినిమాటోగ్రాఫర్ - మథి
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావ్
ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్
నిర్మాతలు - వంశీ - ప్రమోద్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ - అశోక్

 

 

Facebook Comments
Mandaara song from Bhaagamathie gets good response, Grand release on January 26th

About uma