Social News XYZ     

Mumbai item girl Shantabai to star in Bangari Balaraju

"బంగారి బాలరాజు" మూవీ లో ముంబై ఐటంగర్ల్ శాంతాబాయ్ 

Mumbai item girl Shantabai to star in Bangari Balaraju

నంది క్రియేషన్స్ బ్యానర్ పై  కె. ఎండి. రఫీ మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా, కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... మొదటి షెడ్యూల్ అహో బిలం లో 15 రోజుల పాటు షూటింగ్ చేసుకుని, ఇప్పుడు సారథి స్టూడియోస్ లో స్పెషల్ సాంగ్ జరుపుకుంది. ఈ సాంగ్ లో శాంతాబాయ్ పాటతో ఒక్కసారిగా యూత్ ను తనవైపు లాగేసుకున్న లేటెస్ట్ హాట్ బాంబ్ రాధికా పాటిల్ ను మా ఈ బంగారి బాలరాజు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాము. ప్రముఖ సింగర్ గీతామాధురి పాడిన ఈ పాటకి రాధిక తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో చిత్రానికి మరింత గ్లామర్ తీసుకొచ్చింది.

 

ఈ చిత్రం విషయానికి వస్తే... పరువు, ప్రతిష్టల మధ్య సాగే సున్నితమైన ప్రేమకధతో తెరకెక్కుతోంది. రాయలసీమలో జరిగిన ఓ యదార్ధ కథ ఆధారంగా అల్లుకున్న అందమైన ప్రేమ కథ మా ఈ "బంగారి బాలరాజు". ఈ జనవరి చివరి వారం లో టీజర్ ని విడుదల చేయబోతున్నాము. అలాగే ఈ టీజర్ తో మా హీరో, హీరోయిన్ లను కూడా పరిచయం చేయబోతున్నాము అని దర్శకుడు తెలిపారు. ప్రొడ్యూసర్ రఫీ మాట్లాడుతూ... మా డైరెక్టర్ కోటేంద్ర గారు తను ఏం చెప్పారో అది చేయడమే కాకుండా, అనుకున్నదానికంటే తక్కువ టైంలోనే చిత్రాన్ని పూర్తి చేస్తుండడం మరింత ఆనందాన్ని ఇచ్చింది.  ఔట్ పుట్ చూసాము చాలా హ్యాపీ గా ఉంది. శాంతాబాయ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది అని తెలిపారు.

నటీనటులు – రాఘవ్, కరాణ్య కత్రీన్, మీనాకుమారి, దూకుడు శ్రవణ్, ఎన్.వి. చౌదరి, సారిక రామచంద్రరావు, కిరాక్ ఆర్.పి, జబర్దస్త్ బాబి, బి.వి. చౌదరి, సుదర్శన్ దోర్నాల్, జయభారత్ రెడ్డి.  సాంకేతిక వర్గం – సంగీతం : చిన్నికృష్ణ - చిట్టిబాబు రెడ్డిపోగు,  కెమెరా : జి.ఎల్. బాబు, ఆర్ట్ : కృష్ణమాయ, కో డైరెక్టర్ : హేమంత్ కుమార్,  పి. ఆర్. ఓ : కడలి రాంబాబు,  నిర్మాతలు : కె.ఎండి. రఫి మరియు రెడ్డం రాఘవేంద్రరెడ్డి,  కథ,మాటలు,స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : కోటేంద్ర దుద్యాల.

Facebook Comments
Mumbai item girl Shantabai to star in Bangari Balaraju

About uma