నవీన్ విజయ్ కృష్ణ హీరోగా "ఊరంతా అనుకుంటున్నారు"
రోవస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్-యు&ఐ ఎంటర్ టైన్మెంట్స్
సంస్థల సంయుక్త నిర్మాణంలో
"నందిని నర్సింగ్ హోమ్" చిత్రంతో కథానాయకుడిగానే కాక ఒక నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని నేడు నవీన్ నటించబోయే మూడో చిత్రాన్నిఎనౌన్స్ చేశారు. ప్రస్తుతం తండ్రి నరేష్ తో కలిసి "విఠలాచార్య" చిత్రంలో నటిస్తున్న నవీన్ విజయ్ కృష్ణ నటించబోయే ఈ మూడో చిత్రానికి బాలాజీ సనాల దర్శకత్వం వహించనుండగా.. రోవస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్-యు&ఐ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై శ్రీహరి మంగళంపల్లి-ఎ.పద్మనాభరెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.
"ఊరంతా అనుకుంటున్నారు" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి 22 నుంచి మొదలవుతుండగా.. ఈ చిత్రంలో ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ కీలకపాత్ర పోషించనున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను చిత్ర కథానాయకుడు నవీన్ విజయ్ కృష్ణ ఆప్త మిత్రుడైన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నేడు ట్విట్టర్ లో రిలీజ్ చేశారు.
నవీన్ విజయ్ కృష్ణ, శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌదరి, సోఫియా సింగ్, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి కథ: శ్రీరమ్య-శ్రీ మంగలం, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణ, సినిమాటోగ్రఫీ: జి.లింగబాబు, లైన్ ప్రొడ్యూసర్: శ్రీరమ్య గోగుల, రచన-దర్శకత్వం: బాలాజీ సనాల.
This website uses cookies.