Inthalo Ennenni Vinthalo movie theatrical trailer launched by VV Vinayak

స్టార్ డైరెక్టర్ వి. వి వినాయక్ చేతులమీదుగా శిష్యుడి చిత్రం
"ఇంతలో ఎన్నెన్ని వింతలో " మూవీ ధియేటరికల్ ట్రైలర్ విడుదల

నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో. హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మాతలు. వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహిస్తున్నారు.

నందు హీరోగా సౌమ్య వేణుగోపాల్ నాయికగా పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో వస్తున్న చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో ఈ చిత్రం ధియేటరికల్ ట్రైలర్ ని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వి వి వినాయక్ తన మూవీ ఇంటిలిజెంట్ క్లైమాక్స్  లో బిజీ  షూటింగ్ జరుగుతున్నా, ఆ సెట్  లో ఇంతలో ఎన్నెన్ని వింతలో మూవీ ధియేటరికల్ ట్రైలర్ ని విడుదల చేసారు, ఈ సందర్బంగా వి వి వినాయక్ మాట్లాడుతూ నేను సాయి ధరమ్ మూవీ ఇంటిలిజెంట్ క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్నా ఈ మూవీ కి టైమ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఈ చిత్ర దర్శకుడు నా  శిష్యుడు వర ప్రసాద్ దర్శకుడిగా మారి ఓ చిత్రం చేస్తున్నాడని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వర ప్రసాద్ మూవీ "ఇంతలో ఎన్నెన్ని వింతలో" మూవీ టాక్ కూడా తెలిసింది చాలా బాగుంది అని విన్నాను. ఇప్పుడు ధియేటరికల్  ట్రైలర్ చూసాను చాలా బాగుంది నా శిష్యుడు వరప్రసాద్ కి మంచి హిట్ వచ్చి పెద్ద హీరోలతో తీసేంతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నిర్మాత ఇప్పిలి రామమోహన రావు మాట్లాడుతూ...మా ''ఇంతలో ఎన్నెన్ని వింతలో " చిత్ర ధియేటరికల్ ట్రైలర్ ను .వి.వి వినాయక్ గారు మేం అడగ్గానే విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా ఉత్కంఠభరితమైన కథనంతో విభిన్నంగా ఉంటుంది. ఫిబ్రవరిలో  సినిమాను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు.

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజా రామచంద్రన్, నల్లవేణు, దువ్వాసి మోహన్, నరసింహా, కృష్ణ తేజ, త్రిశూల్, గగన్ విహారి, రమేష్, భార్గవ్, కిషోర్ దాస్, సత్తన్న, దుర్గారావు, మీనా వాసుదేవ్, కౌశిక్, పద్మ జయంతి, సోనక్షీ వర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత - డి.శ్రీనివాస్ ఓంకార్, కెమెరామెన్ - ఎస్ మురళీ మోహన్ రెడ్డి, ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్, సంగీతం - యాజమాన్య, ఆర్ట్ - జిల్ల మోహన్, స్టంట్స్ - మర్సాల్ రమణ, కొరియోగ్రఫీ - విఘ్నేశ్వర్, సాహిత్యం - సురేష్ గంగుల, కో డైరక్టర్ - రామ్ ప్రసాద్ గొల్ల, రచనా సహకారం, శివ యుద్ధనపూడి

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%