Social News XYZ     

Amma Ku Prematho movie poster launched by Central Minister Ramdas Athawale

అమ్మ‌ను మ‌ర‌వ‌ద్దుః `అమ్మ‌కు ప్రేమ‌తో`పోస్ట‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలో సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రాందాస్ అత్వాల‌

Amma Ku Prematho movie poster launched by Central Minister Ramdas Athawale

ఆర్.కె.ఫిలింస్ ప‌తాకంపై ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ నిర్మాత‌గా పి.ఉద‌య‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం అమ్మ‌కు ప్రేమ‌తో. కృష్ణుడు, స‌న ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో జ‌రిగింది.  ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  స్టేట్ సోష‌ల్ జ‌స్టిస్ మ‌రియు ఎంప‌వ‌ర్ మెంట్ మినిస్ట‌ర్ రాందాస్ అత్వాల పోస్ట‌ర్ లాంచ్ చేశారు. అనంత‌రం తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్  అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మ‌రియు మిగ‌తా కమిటీ స‌భ్యులు సెంట్ర‌ల్ మినిస్ట‌ర్  రాందాస్ అత్వాల‌ను  ఘ‌నంగా స‌న్మానించారు.

 

ఈ సంద‌ర్భంగా  సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రాందాస్ అత్వాల మాట్లాడుతూ...తెలుగు గానా, తెలంగాణా అంటే నాకు చాలా ఇష్టం.  హైద‌రాబాద్ ,  అమ‌రావ‌తిల‌న్నా కూడా చాలా  ఇష్టం. నా చిన్న‌త‌నంలో న‌టులు, గొప్ప రాజ‌కీయ‌నాయ‌కులైన‌  ఎన్టీఆర్ గారి గురించి చాలా విన్నాను. నాకు సినిమా ఇండస్ర్టీ అన్నా, సినిమా వాళ్ల‌న్నా చాలా అభిమానం. తెలుగు సినిమాలంటే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తాను. మా `ఆర్‌పిఐ ` పార్టీ  సినిమా ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా ఉంటుంది. తెలంగాణ ఉద్యమం స‌మ‌యంలో నేను కేసీఆర్ గారికి మ‌ద్ద‌త కూడా ప్ర‌క‌టించాను. ఇక రామ‌కృష్ణ గౌడ్ గారు నిర్మించిన‌ `అమ్మ‌కు ప్రేమ‌తో` చిత్రం పోస్ట‌ర్ నా చేతుల మీదుగా ఆవిష్క‌ర‌ణ కావ‌డం చాలా ఆనందంగా ఉంది. మంచి టైటిల్ పెట్టారు. అమ్మ‌లేనిదే మ‌నం లేము. మ‌న‌ల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఇంత వాళ్ల‌ను చేసింది వాళ్లే.  అలాంటి వాళ్ల‌ను మ‌నం ఎప్ప‌టికీ మ‌ర‌వ‌ద్దు. అలాగే మ‌హిళా సాధికార‌త కోసం మా `ఆర్ పిఐ` పార్టీ ఎప్పుడూ పాటుప‌డుతుంది. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటూ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నా అన్నారు.

తెలుగు రాష్ట్రాల ఆర్ పి ఐ పార్టీ క‌న్వీన‌ర్ పి.నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ...అమ్మ‌కు ప్రేమ‌తో` చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నా. ప్ర‌స్తుతం సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని తెలిస్తోంది. మా ఆర్ పి ఐ పార్టీ ఆ  స‌మ‌స్య‌ల‌న్నీ తీర్చ‌డానికి సిద్దంగా ఉంది అన్నారు.

తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...అమ్మకు ప్రేమ‌తో చిత్రం పోస్ట‌ర్ సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రాందాస్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. ఎంతో మంచి మ‌నిషి, నిరంత‌రం ప్ర‌జా సేవ‌కై పాటుప‌డే వ్య‌క్తి తెలంగాణ ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి త‌న మంచి మ‌న‌సును రుజువు చేసుకున్న రాందాస్ అత్వాల గారిని మా టిఎఫ్‌సిసి త‌ర‌పున స‌త్క‌రించ‌డం ప్రౌడ్ గా ఫీల‌వుతున్నాం. ఇప్ప‌టికే టిఎఫ్‌ సిసి చాలా మందికి హెల్త్ కార్డ్స్ అందించింది. ఇంకా భ‌విష్య‌త్ లో మ‌రిన్ని స్కీమ్స్ సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ గారైన రాందాస్ గారి ద్వారా సాధిస్తాం. చిత్ర పరిశ్ర‌మ‌లో ఉన్న స‌మ‌స్య‌లు కూడా సాల్వ్ అయ్యేలా కృషి చేస్తాం అన్నారు.

సాయి వెంక‌ట్ మాట్లాడుతూ...``అమ్మ‌కు ప్రేమ‌తో చిత్రం పోస్ట‌ర్ లాంచ్ కి విచ్చేసిన సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రాందాస్ గారికి ధ‌న్య‌వాదాలు, వారిని టిఎఫ్ సిసి త‌ర‌పున స‌న్మానించ‌డం ఆంనందంగా ఉంద‌న్నారు.

న‌టి క‌విత మాట్లాడుతూ...``సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ రాందాస్ గారు ఇక్క‌డ‌కు రావ‌డం నిజంగా విశేషం. వారి గురించి చాలా విన్నాము. మ‌హిళా సాధికార‌త కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఇలా ఈ కార్య‌క్ర‌మంలో వారిని స‌త్క‌రించుకోవ‌డం గొప్ప విష‌యం అన్నారు.

 సీనియ‌ర్ న‌టి గీతాంజ‌లి మాట్లాడుతూ...అమ్మ‌కు ప్రేమ‌తో టైటిల్ చాలా బావుంది. రామ‌కృష్ణ గౌడ్ గారు ఏది చేసిన ప‌ది మందికి మంచి జ‌రిగేలా చేస్తారు. ఈ సినిమా స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు

Facebook Comments
Amma Ku Prematho movie poster launched by Central Minister Ramdas Athawale

About uma