సెన్సార్ పూర్తి చేసుకున్న 'తారామణి' - ఫిబ్రవరిలో విడుదల
డి.వి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై యస్వంత్ మూవీస్ ప్రెసెంట్స్ సగర్వంగా సమర్పించు చిత్రం 'తారామణి' ఈ చిత్రం తమిళంలో చిన్న సినిమా గా విడుదలయ్యి బిగ్గెస్ట్ హిట్ సాధించి భారీ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం నిర్మాత డి. వెంకటేష్ అందించనున్నారు. హీరోయిన్స్ ఆండ్రియా, అంజలి ప్రధాన పాత్రధారులుగా వసంత్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పూర్తి చేసుకొని 'ఎ' సర్టిఫికెట్ పొంది ఫిబ్రవరి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది..
ఈ సందర్బంగా నిర్మాత డి వెంకటేష్ మాట్లాడుతూ తమిళంలో తారామణి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా నిలిచింది. నేటి యువత ప్రవర్తనకు అద్దం పట్టేలా ఈ చిత్ర కథాంశం ఉండడం తో ప్రేక్షకులు బాగా ఆదరించారు. అందుకే ఇంతమంచి మెసేజ్ ఉన్న తారామణి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నం చేయడం జరుగుతోంది... ఈ చిత్రాన్ని అందిస్తున్నందుకు గర్వాంగాను సంతోషంగానూ ఫీల్ అవుతున్నా... తమిళం లో కంటే తెలుగులో ఇంకా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను... ఈ చిత్రం పేరుకే డబ్బింగ్ అయినా తెలుగు యువతను ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'ఎ' సర్టిఫికెట్ పొందింది.. ఫిబ్రవరి నెలాఖరులో తారామణి చిత్రాన్ని విడుదల చేయనున్నాము, మిగతా వివరాలు అతి త్వరలో తెలియ పరుస్తామని చెప్పారు.
ఆండ్రియా, అంజలి, వసంత్ కుమార్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: యువన్ శంకర్ రాజా, డిఒపి: తేని ఈశ్వర్, కథ- దర్శకత్వం: రామ్.
This website uses cookies.