Social News XYZ     

Naa Peru Surya Teaser: Full Of Patriotism

Naa Peru Surya Teaser: Full Of Patriotism

Stylish Star Allu Arjun is a dedicated actor who gives his best to perform any kind of role.

Allu Arjun exhibited his acting prowess once again with Naa Peru Surya. The film's intriguing teaser unveiled today on the eve of New Year is full of patriotism.

 

You will only see Allu Arjun in the teaser which is high on action. The teaser starts with someone asking Allu Arjun 'who are you?' The reply from Bunny is 'I'm a soldier.'

The dialogue 'Neeku Surya Ante Soldier. Kaani Prapanchaniki Surya Ante Anger' hints that Bunny will be seen as an angry soldier who can't control his an
guish. The visuals also focused to display Allu Arjun’s agony. Last frames showed Allu Arjun facing punishment from his higher authorities.

At the end, Allu Arjun says 'I will go and die at the border'.

Besides Allu Arjun’s performance, cinematography and BGM are highlights in the teaser.

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ,  “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” ఫస్ట్ ఇంపాక్ట్ కి ప్రశంశ‌ల జ‌ల్లు 

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ  తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”.  కె. నాగబాబు  సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో   యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.ఈ చిత్రానికి సంబందించిన ఫ‌స్ట్ ఇంపాక్ట్ జ‌న‌వ‌రి 1న విడ‌దుల చేశారు. ఈ టీజ‌ర్ చూసిన వారంతా అల్లు అర్జున్ డెడికేష‌న్ గురించి, మేక్ ఓవ‌ర్ గురించి మాట్లాడుకుంటున్నారు. నీకు సూర్య సోల్జ‌ర్‌.. కాని  ప్ర‌పంచానికి సూర్య అంటే యాంగర్‌..... అనే ఇంట్రో తో స్టార్ట‌యిన ఈ ఇంపాక్ట్ నిజంగానే అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఇంపాక్ట్ క‌లిగించింది. టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా అల్లు అర్జున్ పాత్ర ని పాత్ర లో లీన‌మైపోయిన న‌టించిన న‌ట‌న టీజ‌ర్ లో ఆక‌ట్టుకుంది. ఏ ముహుర్తాన మెట్ట‌మెద‌టి సారిగా ఫ‌స్ట్ ఇంపాక్ట్ అన్నారో గాని ఈ విజువ‌ల్స్ అంత‌లా ఇంపాక్ట్ క‌లిగించాయి.  ఈ ఇంపాక్ట్ చూస్తే అల్లు అర్జున్ డెడికేష‌న్ , ద‌ర్శ‌కుడు ప‌నితీరు, కెమెరా మెన్ విజువ‌ల్స్ తో పాటు డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. చ‌చ్చిపోతాను కాని ఇక్క‌డ కాదు బోర్డ‌ర్ లో చ‌చ్చిపోతాను అనే డైలాగ్ రోమాలు నిక్క‌బోడుచుకునేలా వుందంటున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత శిరీషా శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా.  అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణుల‌తో చిత్రాన్ని ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించామ‌నేది మా ఫ‌స్ట్ ఇంపాక్ట్ చూసిన వారంతా చెబుతున్నారు. బ‌న్ని గారు డెడికెష‌న్‌, ద‌ర్శ‌కుడు విజ‌న్ క‌లిస్తే మా ఫ‌స్ట్ ఇంపాక్ట్.. ఇదే రేంజి లో చిత్రం వుండ‌బోతుంది.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం స‌మ్మ‌ర్ కానుక‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా ఫ‌స్ట్ ఇంపాక్ట్ లో డైలాగ్స్ గురించి మాట్లాడుకోవ‌టం ఆనందంగా వుంది. అని అన్నారు

చిత్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ... బన్నీ కెరీర్ లో హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా  దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథ కథనం తో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడ‌నేదానికి ఉదాహర‌ణ మా ఫ‌స్ట్ ఇంపాక్ట్‌.  హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 27, 2018 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.  ఫస్ట్ ఇంపాక్ట్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తప్పకుండా అద్బుతమైన స‌మ్మ‌ర్ గిఫ్ట్ అవుతుంది. అని అన్నారు.

సహ  నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ కి ఏప్రిల్ 27, 2018 పెద్ద పండగ చేసుకునే రోజు. ఆ రోజు అత్యధిక థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుదల చేస్తున్నాం. దానికంటే ఈరోజు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌ ఇంపాక్ట్  న్యూ ఇయర్ గిఫ్ట్ తో డబుల్ బొనాంజా ఫ‌న్స్ భావిస్తున్నారు. వక్కంతం వంశీ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. మరో కీలక మైన షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్  యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - k.నాగబాబు
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ

Facebook Comments
Naa Peru Surya Teaser: Full Of Patriotism

About uma