'హలో...' వంటి ఫీల్‌గుడ్ మూవీ నా యాభైవ చిత్రం కావడం చాలా హ్యాపీగా వుంది
- యువ సంగీత కెరటం అనూప్ రూబెన్స్
'జై' చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అయి అనతికాలంలోనే 50 చిత్రాలకు మ్యూజిక్ చేసిన అనూప్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. 'ప్రేమకావాలి', 'లవ్‌లీ', 'పూలరంగడు', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే' 'హార్ట్ ఎటాక్', 'టెంపర్', 'గోపాల గోపాల','సోగ్గాడే చిన్నినాయనా' 'మనం', 'పిల్లా నువ్వులేని జీవితం' 'నేనే రాజు నేనే మంత్రి' వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందించిన అనూప్ లేటెస్ట్‌గా 'హలో'తో మరో మ్యూజికల్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. యూత్‌కింగ్ అఖిల్ హీరోగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ మనం ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించిన యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హలో'. ఈ చిత్రం డిసెంబర్ 23న వరల్డ్‌వైడ్‌గా రిలీజై యునానిమస్ హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ డిసెంబర్ 29న హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
'హలో'కి మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తోంది?
- ప్యూర్ లవ్‌స్టోరితో రూపొందిన 'హలో'కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫ్రెష్ అండ్ క్లీన్ ఫిలిం. చాలా బాగుంది అని కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. ఇంతమంచి హిట్ సినిమా నా 50వ సినిమా కావడం చాలా హ్యాపీగా వుంది. అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్‌కి, నాగార్జునగారికి, అఖిల్, విక్రమ్‌గారికి నా థాంక్స్. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు నా కృతజ్ఞతలు.
మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?
- అసలు నేను ఇండస్ట్రీకి వస్తాననుకోలేదు. నాకు మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. కీబోర్డ్ ప్లేయర్‌గా వర్క్ చేశాను. ఇండస్ట్రీలో అందరూ నన్ను ఓ ఫ్రెండ్‌లా, బ్రదర్‌లా ట్రీట్ చేశారు. అందరి సపోర్ట్‌తో 50 సినిమాలు కంప్లీట్ చేయగలిగాను. నా ఫస్ట్ సినిమా 'జై'. ఈ అవకాశం ఇచ్చిన తేజగారికి నా ధన్యవాదాలు.
ఇన్నేళ్ల మీ జర్నీలో ఏం నేర్చుకున్నారు?
- ఇన్నేళ్ల నా జర్నీలో డిఫరెంట్ ఫిలింస్, హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్‌తో వర్క్ చేశాను. నేను చేసిన ప్రతి ఫిల్మ్ నాకొక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. మ్యూజిక్ అనేది ఓషల్‌లాంటిది. ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే వుంటాను. 50 అనేది ఒక నెంబర్. ఇంకా చేసేవి చాలా వున్నాయి. నా వరకూ ది బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
కాంపిటీషన్‌గా ఏమైనా ఫీలవుతున్నారా?
- ఏ ఫీల్డ్‌లో అయినా కాంపిటీషన్ అనేది వుంటుంది. అది వున్నప్పుడే బెస్ట్ ఔట్‌పుట్ ఇవ్వడానికి ఇన్‌స్పిరేషన్‌గా వుంటుంది. కాంపిటీషన్ అనేది నా దృష్టిలో ఇన్‌స్పిరేషన్. హార్డ్‌వర్క్‌తో కొత్త పద్ధతిలో కంపోజింగ్ చేయాలి. అలా చేస్తే నేను అందరికంటే బెటర్‌గా చేయడానికి ఇన్‌స్పైరింగ్‌గా వుంటుంది. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్‌కి కంపోజింగ్‌లో ఓన్ స్టైల్ వుంది. నా స్టైల్‌లో నేను చేసుకుంటూ వెళ్తున్నాను.
ఈ 50 సినిమాలలో మీకు శాటిస్‌ఫ్యాక్షన్ కల్గించిన సినిమాలు ఏంటి?
- ఫీల్‌గుడ్ మూవీస్ చేశాను. కొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలింస్ చేశాను. 'మనం', 'ఇష్క్' 'గుండెజారి గల్లంతయ్యిందే' మంచి ఫీల్‌గుడ్ మూవీస్. 'గోపాల గోపాల' మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్. పవన్‌కళ్యాణ్‌గారితో ఫస్ట్‌టైమ్ వర్క్ చేశాను. అలాగే అమితాబ్ బచ్చన్‌గారి 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమాకి మ్యూజిక్ చేయడం ప్రౌడ్‌గా వుంది.
'మనం' తర్వాత మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌లో 'హలో'కి వర్క్ చేయడం ఎలా అన్పించింది?
- 'మనం' అనేది ఓ క్లాసిక్ ఫిల్మ్. త్రీ జనరేషన్ హీరోస్‌తో కలిసి పని చేయడం గొప్ప అవకాశం. ఆ చిత్రం సంగీత దర్శకుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చింది. 'మనం' తర్వాత 'హలో'కి ఎక్స్‌పెక్టేషన్స్ బాగా వున్నాయి. 'హలో' చిత్రానికి హై స్టాండర్డ్స్‌తో వర్క్ చేశాం. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్లుగానే మ్యూజికల్‌గా ఈ చిత్రం బిగ్ హిట్ అయ్యింది. 'హలో' టైటిల్ సాంగ్, మెరిసే మెరిసే, తలచి తలచి పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్‌తో వర్క్ చేయడం ఎలా అన్పించింది?
- విక్రమ్ కుమార్‌తో ఇది నా థర్డ్ ఫిల్మ్. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్‌లో విక్రమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్. ఆయన స్టోరి చెప్తుంటేనే ఇన్‌స్పైరింగ్‌గా అన్పిస్తుంది. స్టోరి నేరేషన్ అప్పుడే సినిమా చూపిస్తాడు. చాలా క్లారిటీతో కాన్ఫిడెంట్‌గా వుంటాడు. అప్పుడే నేను ట్యూన్ కంపోజింగ్ చేస్తాను. అరగంట కన్నా ఎక్కువ టైమ్ తీసుకోరు. అంత ఈజీగా మ్యూజిక్ చేయించుకుంటారు. నేను ఎప్పుడన్నా స్ట్రెస్‌గా వుంటే గిటార్ ప్లే తీసుకుని ప్లే చెయ్ అని చెప్పేవారు. ఆయనతో నా అసోసియేషన్ చాలా కంఫర్టబుల్‌గా వుంటుంది.
అఖిల్‌తో పాట పాడించడానికి రీజన్?
- బేసిగ్గా అఖిల్‌కి మంచి వాయిస్ వుంది. అప్పుడప్పుడు పార్టీస్‌లో, బాత్రూమ్‌లో పాటలు హమ్ చేస్తుంటాడు. మ్యూజిక్‌లో మంచి టేస్ట్ వుంది. సింగింగ్ అంటే చాలా ఇష్టం అఖిల్‌కి. హైపిచ్, బ్రీతింగ్, టెంపో ఫాలో అవ్వాలి అని కొన్ని బేసిక్స్ చెప్పాను. కీబోర్డ్ ఇచ్చి సరిగమలు నేర్పించాను. నోట్‌కి, పిచ్‌కి మ్యాచ్ అయ్యేటట్లు ప్రాక్టీస్ చేశాడు. అఖిల్‌లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏ పనైనా మనస్ఫూర్తిగా డెడికేషన్‌తో చేస్తాడు. రీ-రికార్డింగ్ ఇద్దరం కూర్చుని చేశాం. ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడినట్లుగా ఈ చిత్రంలో సాంగ్ పాడారు.
అన్నపూర్ణ స్టూడియోస్‌లో మీ జర్నీ ఎలా వుంది?
- నాగచైతన్యతో 'ఆటోనగర్ సూర్య'కి వర్క్ చేశాను. ఆర్.ఆర్. వెంకట్‌గారు, అచ్చిరెడ్డిగారు, బి.ఎ.రాజుగారి సపోర్ట్‌తో ఆ సినిమా చేశాను. అప్పుడే చైతన్యకి పరిచయం చేశారు. అప్పట్నుంచీ చైతన్యతో మంచి ర్యాపో ఏర్పడింది. అలా 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' ఇప్పుడు 'హలో'కి వర్క్ చేశాను.
ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్‌తో మీ అసోసియేషన్ ఎలా వుంటుంది?
- థమన్ మంచి ఫ్రెండ్. ఇద్దరం చాలా ప్రోగ్రామ్స్ చేశాం. అతను రిథమ్ ప్లేయర్. నేను గిటారిస్ట్‌ని. దేవితో కూడా మంచి రిలేషన్ వుంది. అప్పుడప్పుడు ఫంక్షన్స్, పార్టీస్‌లో కలుస్తుంటాం. సాంగ్స్ బాగుంటే చాలా బాగా చేశావ్‌రా అని మణిశర్మగారు చెప్తారు. ఇలా అందరితో ఫ్రెండ్లీగా వుంటాను.
మీ 50 చిత్రాల్లో మీకు బాగా నచ్చిన పాటలు ఏంటి?
- నా పాటల్ని నేను ఎప్పుడూ పాడుకోను. ఒకసారి కంపోజింగ్ అయి రిలీజ్ అయ్యాక అసలు వినను. అప్పుడప్పుడు ఎఫ్.ఎం రేడియోస్‌లో వస్తే వింటాను. పాట ఇలా చేస్తే బాగుండాలి. అలా చేస్తే బాగుండాలి అని ఎనాలిస్ చేసుకుంటాను.
పూరి జగన్నాథ్‌తో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?
- పూరి సార్‌తో బాగా క్లోజ్‌గా వుంటాను. నాకు బాగా నచ్చిన వ్యక్తి. వెరీ కూల్ అండ్ వెరీ నాలెడ్జ్‌బుల్ పర్సన్. ఆయనతో నేను 'హార్ట్ ఎటాక్', 'టెంపర్' 'పైసా వసూల్' చిత్రాలకు వర్క్ చేశాను. అలాగే 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమా రీరికార్డింగ్ చేశాను. ఆయనకి నా థాంక్స్.
ఇతర భాషల్లో సినిమాలకి మ్యూజిక్ చేస్తారా?
- ఆఫర్స్ వస్తున్నాయి. ఇక్కడ హిట్ అయిన సినిమాలు రీమేక్ అయినప్పుడు ఆ సినిమాలకు మాత్రమే మ్యూజిక్ చేశాను.
ఫైనల్‌గా 'హలో'లో మీకు కష్టంగా అన్పించింది ఏంటి?
- పాటలు కంపోజ్ చేయడం ఒక ఎత్తు అయితే దానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడం చాలా కష్టం అని నా ఫీలింగ్. ఆ సినిమాకి జస్టిఫికేషన్ ఇవ్వాలి. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్‌ని రీ-రికార్డింగ్‌తో ఎలివేట్ చేయాలి. అప్పుడే సినిమాకి ఒక ఫీల్ వస్తుంది. రీ-రికార్డింగ్ చేయడం చాలా టఫ్ జాబ్.
సంగీత దర్శకుడిగా ఇప్పటివరకు మీకు బాగా పేరు తెచ్చిన సినిమాలు ఏంటి?
- 'ప్రేమకావాలి', 'లవ్‌లీ', 'పూలరంగడు', 'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'హార్ట్ ఎటాక్', 'గోపాల గోపాల', 'టెంపర్', 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా', 'పిల్లా నువ్వులేని జీవితం', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలు నాకు చాలా మంచి పేరు తెచ్చాయి.
నెక్స్‌ట్ కమిట్ అయిన సినిమాలు?
- వెంకటేష్, తేజగారి కాంబినేషన్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఆఫర్స్‌లో వున్నాయి. డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏది కమిట్ అవ్వలేదు.
ఫైనల్‌గా మీరు ఏం చెప్తారు?
- నాతో పాటు వర్క్ చేసిన నా మ్యూజిషియన్స్‌కి, సింగర్స్‌కి, టెక్నీషియన్స్‌కి నా థాంక్స్. అలాగే నా ఎదుగుదలకు కారణమైన హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు నా కృతజ్ఞతలు.
అనంతరం 50 చిత్రాలు కంప్లీట్ అయిన సందర్భంగా భారీ కేక్‌ని కట్ చేసి అనూప్ మీడియా మిత్రులతో తన ఆనందాన్ని పంచుకున్నారు.
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.