పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లొ "కొత్త కుర్రోడు"
శ్రీరామ్, శ్రీ ప్రియ జంటగా లైట్ ఆఫ్ లవ్ క్రియేషన్స్ పతాకంపై పదిలం లచ్చన్న దొర (లక్ష్మణ్) నిర్మిస్తొన్న చిత్రం కొత్త కుర్రోడు. రాజా నాయుడు ఈ చిత్రానికి దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చెసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం పొస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఈ సందర్బంగా దర్శకుడు రాజా నాయుడు మాట్లాడుతూ.. నైతికవిలువలతో కూడిన కుటుంబకథా చిత్రమిది. శ్రీరామ్ ,శ్రీ ప్రియ కొత్త వారయినా పొటీ పడి నటించారు. ప్రతి నాయకుడిగా చెబ్రొలు శ్రీను నటన ఆకట్టుకుటుంది. ఉభయ గొదావరి , అరకు, విశాఖ, భీమిలీ లొకెషన్స్ లొ చిత్రీకరణ జరిపాము. సాయి ఎలెందర్ సంగీతం ఆకట్టుకుంటుంది. త్వరలొనె పాటలను విడుదల చెస్తామన్నారు.
నిర్మాత లచ్చన దొర మాట్లాడుతూ. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసెలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరిలొ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు.
శ్రీరామ్ ,శ్రీ ప్రియ, చెబ్రొలు శ్రీను, జె.వి.రావు, యోగి,అంజలి, మాధవీలత, శ్రావణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటొగ్రఫి: సతీష్ మదిరాజ్, సంగీతం: సాయి ఎలెందర్, నిర్మాత: పదిలం లచ్చన్న దొర( లక్ష్మణ్) , దర్శకత్వం : రాజా నాయుడు.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.