'సప్తగిరి ఎల్.ఎల్.బి' ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా వుంటుంది
- హీరో సప్తగిరి
ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన సప్తగిరి నటుడిగా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ కమెడియన్ రేంజ్‌కి చేరుకున్నారు. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'తో హీరోగా తెరంగేట్రం చేసి ఆ చిత్ర విజయంలో తనకంటూ సెపరేట్ మార్కెట్‌ని ఏర్పరుకున్నారు. మలి చిత్రంగా 'సప్తగిరి ఎల్.ఎల్.బి'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి. పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో ప్రముఖ హోమియోపతి వైద్యులు, అభిరుచి గల నిర్మాత డా. కె.రవికిరణ్ నిర్మిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్.ఎల్.బి.' హిందీలో సూపర్‌హిట్ అయిన 'జాలీ ఎల్.ఎల్.బి' చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు 'సప్తగిరి'తో ఇంటర్వ్యూ.
'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రం ఎలా వుంటుంది?
- ఒక కామన్‌మెన్‌ని రిప్రజెంట్ చేస్తూ మంచి సందేశాత్మకంగా 'సప్తగిరి ఎల్.ఎల్.బి' చిత్రం వుంటుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి సమానమైన హక్కు వుండాలి. ప్రతి ఒక్కరికీ న్యాయం దక్కాలి.. అని పోరాడే ఒక చిన్న లాయర్ కథ ఇది. నీతి నిజాయితీతో మనసుకి హత్తుకునేలా సినిమా వుంటుంది.
రీమేక్ చేయాలని ఎందుకన్పింపించింది?
- మంచి మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమా చెయ్యాలని నా కోరిక. హిందీలో సూపర్‌హిట్ అయిన 'జాలీ ఎల్.ఎల్.బి' కథలో మంచి స్ట్రాంగ్ కంటెంట్ వుంది. దానిని తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి చేసాం. ఈ ఐడియా మా టీమ్ అందరిది. నేను ఇప్పటివరకు 70 సినిమాల్లో కమెడియన్‌గా చేశాను. మళ్లీ అదే చేస్తే నాకు వేరియేషన్ వుండదు. అలాగే 7 ఇయర్స్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాను. నా థాట్స్‌కి తగ్గట్లు ఒక కెమెరామెన్‌ని రిప్రజెంట్ చేస్తూ సినిమా తియ్యాలి అని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ సినిమా లాయర్లందరికీ అంకితం చేశాం.
సినిమా చూసి ఎలా ఫీలయ్యారు?
- ఈ సినిమాలో లాస్ట్ 45 మినిట్స్ అరెస్టింగ్‌గా వుంటుంది. హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నాను. సినిమా చూసి ప్రతి ఒక్కరూ ఒక భావోద్వేగానికి ఉత్కంఠకి లోనవుతున్నారు. ఇది ఒక వెయిట్ వున్న సబ్జెక్ట్. సప్తగిరి అనేవాడు ఒక చిన్నోడు. సప్తగిరి కామెడీ చేస్తే ఎలా వుంటుందో చూశారు. ఇప్పుడు సెంటిమెంట్, ఎమోషన్ సీన్స్‌లో చేసేటప్పుడు నన్ను ఏక్సెప్ట్ చెయ్యాలి. అందుకే చిన్న కసరత్తులు చేసి చేశాను. పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా చెప్పాను. నా క్యారెక్టర్‌కి, నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు పరుచూరి బ్రదర్స్ ప్రత్యేకంగా డైలాగ్స్ రాశారు. నాకు మెచ్యూరిటీ ఎంత వుందో అది స్క్రీన్‌పై అందరూ చూస్తారు.
హీరోగా రైట్ స్టెప్ వేశానని భావిస్తున్నారా?
- కమెడియన్ 70 సినిమాలు చేశాను. ఇంకా లైఫ్‌లో వేరియేషన్ ఏముంది. ఏ సినిమా చూసినా సప్తగిరి అనేవాడు ఒకేలా కన్పిస్తున్నాడు. కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను. కొన్ని సక్సెస్ అయ్యాయి. కొన్ని ఫెయిల్ అయ్యాయి. బట్ నాకు వేరియేషన్ కన్పించలేదు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా కష్టపడ్డాను. నాకంటూ కొన్ని ఆలోచనలు వున్నాయి. నాకంటూ ఒక గోల్ వుంది. అనుకోకుండా కమెడియన్‌ని అయ్యాను. అనుకోకుండా హీరోనయ్యాను. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి సత్‌ప్రవర్తనతో నిజాయితీతో కూడిన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేయడం బాగా నచ్చింది. అలాగే నా ఫస్ట్ సినిమాతో సక్సెస్ అయ్యాను. ఈ సినిమాతో కూడా సక్సెస్ అవుతాను అని కాన్ఫిడెన్స్‌తో వున్నాను.
చరణ్ లక్కాకుల వర్కింగ్ ఎలా వుంది?
- ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ కో-డైరెక్టర్ చరణ్. ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే సినిమా అనుకున్న డేస్‌లో కంప్లీట్ అవ్వాలి. ఆల్‌రెడీ ఇది రీమేక్ కాబట్టి అవగాహన వున్న డైరెక్టర్ అయితే బాగుంటుంది అని ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాం. చరణ్ సురేష్ ప్రొడక్షన్స్‌లో, సూపర్‌గుడ్ ఫిలింస్‌లో, దిల్‌రాజుగారి బేనర్‌లో ఇలా చాలా సినిమాలు చేశారు. ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయన కో-డైరెక్టర్‌గా పని చేశారు. నేను అనుకున్న ఔట్‌పుట్ పర్‌ఫెక్ట్‌గా ఇచ్చారు. ఈ సినిమాతో ఆయన హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కొడ్తారు.
డ్యాన్స్‌లు బాగా చేసినట్లున్నారు?
- నాకు డ్యాన్స్‌లు చెయ్యాలని బాగా కసి వుంది. సాంగ్స్ వినగానే నాలో ఒక మూమెంట్ వచ్చేది. దానికోసం ఎంతో రిహార్సల్ చేసి చాలా కష్టపడి డ్యాన్స్‌లు చేశాను.
లాయర్ క్యారెక్టర్ చేశారు కదా? ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా?
- చాలా మంది లాయర్స్‌ని కలిశాను. సెక్షన్స్ గురించి తెలుసుకున్నాను. అవన్నీ కరెక్ట్‌గా చెప్పగలిగాను.
మీ టైటిల్స్ అన్నీ 'సప్తగిరి'తో స్టార్ట్ అవుతున్నాయి?
- నా ఫస్ట్ సినిమాకి 'కాటమరాయుడు' టైటిల్ పెట్టాం. అది పవర్‌స్టార్‌గారు అడగడంతో ఇచ్చేశాం. మా అసిస్టెంట్ డైరెక్టర్ సలహా మేరకు ఆ చిత్రానికి 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' అని పెట్టడం జరిగింది. ఈ సినిమాకి కూడా అదే సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ 'సప్తగిరి ఎల్.ఎల్.బి' అని పెట్టాం.
నెక్స్‌ట్ సినిమాకి కూడా ఇదే కంటిన్యూ చేస్తారా?
- చాలామంది డైరెక్టర్స్ సప్తగిరి సన్నిలియోన్, సప్తగిరి దెయ్యం పట్టింది, సప్తగిరి బంగాళాఖాతం.. అంటూ రకరకాల టైటిల్స్ చెప్తున్నారు. సెంటిమెంట్‌గా బావుంది కాబట్టి ముందుకు నడుస్తున్నాను.
హీరోయిన్ క్యారెక్టర్ ఎలా వుంటుంది?
- విలేజ్ టీజర్ క్యారెక్టర్‌లో కశిష్ వోరా బ్యూటిఫుల్‌గా నటించింది.
నిర్మాత రవికిరణ్ మేకింగ్ ఎలా వుంది?
- మా కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ సినిమా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' సూపర్‌హిట్ అయ్యింది. నిర్మాతగా ఆయన చాలా హ్యాపీ. మేము పెట్టిన దానికి హండ్రెడ్ పర్సెంట్ శాటిస్‌ఫై అయ్యాం. ఈ సినిమాని కాంప్రమైజ్ అవకుండా చాలా గ్రాండియర్‌గా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో మా బావగా చిన్నా స్పెషల్ క్యారెక్టర్‌లో ఆయన నటించడం చాలా హ్యాపీగా వుంది.
బుల్గానిన్ మ్యూజిక్ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది?
- మేమిద్దరం స్టార్టింగ్ స్టేజ్‌లో చాలా కష్టపడి పైకొచ్చాం. ఈ సినిమాకి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ చేశాడు. స్పెషల్‌గా రీరికార్డింగ్ అదరగొట్టాడు. బుల్ వంద సినిమాలకి మ్యూజిక్ చేసే సత్తా వున్న మ్యూజిక్ డైరెక్టర్ వాడు. పెద్ద హీరోల స్థాయికి తగ్గట్లు మ్యూజిక్ చేశాడు. ఈ సినిమాతో తను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు.
సాయికుమార్‌గారి క్యారెక్టర్ ఎలా వుంటుంది?
- హిందీలో బొమన్ ఇరాని చేసిన క్యారెక్టర్‌ని సాయికుమార్‌గారు అత్యద్భుతంగా చేశారు. సాయికుమార్, శివప్రసాద్‌గారు, నేను ముగ్గురం హీరోలుగా నటించడం జరిగింది. చాలా గొప్పగా చేశారు ఇద్దరూ. సౌరవ్ శుక్లా చేసిన క్యారెక్టర్, ఎం.పి. శివప్రసాద్‌గారు చేశారు. ఆ క్యారెక్టర్‌ని నేషనల్ అవార్డు కూడా వచ్చింది. శివప్రసాద్‌గారు ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. ఆయనతో పాటు ప్రతి ఒక్కరూ ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. తప్పకుండా పెద్ద సక్సెస్ సాధిస్తాం అనే నమ్మకం వుంది.
సేఫ్ జోన్‌లో వెళ్తున్నట్లున్నారు?
- హండ్రెడ్ పర్సెంట్ అది నమ్ముతాను. నేను మిడిల్ క్లాస్ నుండి వచ్చాను కాబట్టి వారి కష్టాలు అన్నీ తెల్సు. నచ్చిన కథని అందరికీ రీచ్ అయ్యేలా చూసుకుంటాను. ఒక కామన్‌మెన్ అనేవాడు కొంతమంది పేద ప్రజలకి ఎలాంటి హెల్ప్ చేశాడు అన్నది కథ. ఇది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది.
నెక్స్‌ట్ మూవీస్ ఏంటి?
- ఎక్కువగా రీమేక్‌లే వస్తున్నాయి. సినిమా బాగుంటే చేస్తాను. నేను బాగుండటమే కాదు నా నిర్మాత, డైరెక్టర్ అందరూ బాగుండాలి. అలా సేఫ్‌జోన్‌లో వుండేలా సినిమాలు చేస్తాను.
ఫైనల్‌గా ఆడియన్స్‌కి ఏం చెపుతారు?
- 'సప్తగిరి ఎల్.ఎల్.బి' అనే సినిమా నిజాయితీతో కూడిన ఒక లాయర్ స్టోరి. అందరి మనసులు గెలుచుకునేలా వుంటుంది.
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.