Cops give thumbs up to ‘Khakee’

It's a proud moment for 'Khakee' team. About 1500 cops watched the special screenings of the film, held at RBVRR Telangana Police Academy and Prasad Labs in Hyderabad on Saturday and Sunday.

A.C.P.Sameer along with other inspectors and trainees, have immensely liked the film and gave unanimous thumbs to it. They said that police training scenes, investigation scenes and many other scenes in the film are very close to reality. They felt happy with the way cops are portrayed in the film and said that it's not a 'reel' story, but a 'real' one.

The film, which is a tribute to the Police, is based on real incidents that happened between 1995-2005. The way Tamil Nadu police had sacrificed their personal lives, faced many hardships and suffered losses to crack a sensational case and nabbed a group of ruthless bandits, who committed many murders in their state, has been portrayed very realistically in the film and cops have liked it.

SP Jangid, the cop who led who led 'Operation Bawaria' that inspired the film, has also watched the film recently and praised the director H Vinoth and Karthi for their brilliant work. Produced by Umesh Gupta and Subhash Gupta of Aditya Music Pvt.Ltd in Telugu, 'Khakee' has turned out to be a massive hit and the collections are steady even in the second week.

`ఖాకి`ని మెచ్చిన పోలీసులు

సినిమాల్లో ఎవ‌రి గురించి ఏం చూపిస్తే ఏం తంటా వ‌స్తుందోన‌ని సృజ‌న‌కారులు భ‌య‌ప‌డుతున్న రోజులివి. కానీ ఖాకి సినిమాకు ఇలాంటి ఇబ్బందులేవీ లేవు. పైగా ఆ సినిమాను చూసిన పోలీసులు అదే ప‌నిగా పొగుడుతున్నారు. త‌మ జీవితాల‌కు అద్దంప‌డుతున్న చిత్రం ఖాకి అని ముక్త‌కంఠంతో ప్ర‌శంసిస్తున్నారు. కార్తి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ఖాకి.

తెలుగులో ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా క‌లిసి అందించారు. ఈ సినిమాను శ‌నివారం, ఆదివారం ఆర్‌బివీఆర్ ఆర్ తెలంగాణ పోలీస్ అకాడ‌మీలోనూ (ఎ.సి.పి.సమీర్ ఆద్వర్యంలొ సబ్-ఇన్స్పెక్టర్స్, ట్రైనీస్ కు), హైద‌రాబాద్ లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లోనూ 1500 మంది పోలీసుల‌కు చూపించారు. ఖాకి సినిమా చూసిన ప్రతి ఒక్క పోలీస్ ఆఫిసర్ సినిమాని చాలా ప్రషంసించారు. ప్రస్తుతం ట్రైనింగ్ తీస్కుంటున్న వాల్లు ఖాకి సినిమా చూసి "ఖాకిలో చూయించిన ట్రైనింగ్ సీన్స్, ఇన్వెస్టిగెటింగ్ చేసె పద్దతి వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. ఈ సినిమా మమ్మల్ని ఎంతో ప్రెరెప్పించింది. ఇప్పటిదాక వచ్చిన పోలిస్ సినిమాలకు 'ఖాకీ ఎంతొ భిన్నంగ ఉంది" అన్నారు.

సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు త‌మ నిజ జీవితాల‌ను తెర‌పై చూసుకున్న‌ట్టుంద‌ని చెప్పారు. ఇందులో కార్తి పోలీస్ ఆఫీస‌ర్‌గా ప‌ర్ఫెక్ట్ గా క‌నిపించార‌నీ, ట్రైన్డ్ ఆఫీస‌ర్ లాగా అనిపించార‌నీ అన్నారు. హ‌వేలీ ముఠా దోచుకున్న తీరు, వారి గురించి పోలీసులు ఇన్వెస్టిగేష‌న్ చేసిన తీరు ఆస‌క్తిక‌రంగా అనిపించింద‌ని అన్నారు. 1995-2005 మ‌ధ్య జ‌రిగిన నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన సినిమా ఇది. అప్ప‌ట్లో త‌మిళ‌నాడు పోలీస్ జాంగిద్ ఆప‌రేష‌న్ బ‌వారియా పేరుతో చేసిన ఇన్వెస్టిగేష‌న్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించారు. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ బావుంద‌ని మెచ్చుకుంటున్నారు.సినిమా ఇప్ప‌టికే సూప‌ర్‌డూప‌ర్ హిట్ టాక్‌తో న‌డుస్తోంది. రెండో వారంలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్లు స్ట‌డీగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%