It is known that Dr.Ravi Kirane of Sai Celluloid Cinematic Creations Pvt Ltd who has delivered Super Hit "Sapthagiri Express" with Comedy King Sapthagiri is coming again with Saptagiri as Hero for another film "Saptagiri LLB". Film is getting ready to release worldwide on December 7th. Bulganin composed the Music for this film. First song in the album, "Chittoor ke Chandurude Chinde veste.." Written by Kandikonda, Sung by Shankar Mahadevan, Choreographed by Avinash, is released by Sensational Director V.V.Vinayak.
On this occasion V.V.Vinayak says, " Producer Ravi Kirane Garu is a very busy Doctor. Not only for money, He is also doing a lot of charity work for poor people through his Homeo Clinic. He is a very good hearted person. Out of the passion about films, he produced 'Saptagiri Express'. It became very good success. Again he is coming with 'Saptagiri LLB'. I wish this film will be become a bigger hit and will be a profitable venture for Ravi Kirane Garu. Saptagiri is my favourite comedian. I watched the first song in this film.It is very good. Sapthagiri is Superb with his Dances. I watched 'Jolly LLB' in Hindi. I liked it a lot. It has a very good story. I left it as I was unsure about who will fit the lead character. This film has strong content dealing with honesty just like 'Tagore'. Saptagiri is lucky to do a film with such good content. I know this film Director Charan from my Madras days. He is very intelligent. He is waiting for a good break. I am very happy that he got this film in right time. Definitely this film will give much needed break for Charan. Bulganin's Music is very good. I Watched the Trailer and I am impressed. I am confident that this film will become a Super Hit. All the best to entire team."
Comedian King Saptagiri, " Vinayak Garu immediately agreed to launch the first song upon our request. He gave life to many in industry. He launched the first song of our film and blessed us with his kind words. I feel lucky and happy for his kind gesture. Thanks to Vinayak Garu."
Director Charan Lakkakula, " I know Vinayak Garu from a long time. Whenever I met him, he always encouraged me by giving moral support. He always asks me to become a Director. I feel proud that Vinayak Garu released first song of our film. Our Producer Ravi Kirane Garu made this film with rich production values without any compromise. Our Hero Saptagiri gave his support throughout the film. I thank him for his support."
Producer Dr Ravi Kirane, " 'Saptagiri LLB' is second film we made in our banner. I am very happy and feel lucky that such a good hearted person who always encourages small film producers, Vinayak Garu launched first song of our film. Our banner will produce message oriented films. Saptagiri is too good with his Dances in this film. Bulganin composed very good songs. Film came out very well. We are releasing the film worldwide on December 7th."
Music Director Bulganin, " I am very happy that a big director like Vinayak launched the first song of our film. This is my second film in Ravi Kirane gari banner. He supported me a lot and extracted very good songs from me. All songs are excellent. Everyone who heard the songs are praising the audio. Our Hero Saptagiri, Director Charan gave me sommuch freedom so that I can provide very good music."
Along with Comedy King Saptagiri, Kashish Vohra will be seen as the female lead.
Dialogues : Paruchuri Brothers
Music : Vijay Bulganin
Co-Director : Rajasekhar Reddy Pulicherla
Photography : Saarangam S.R
Editing : Goutham Raju
Art : Arjun
Lyrics : Chandra Bose, Kandikonda
Production Executive : Bhikshapati Tummala
Producer : Dr. Ravi Kirane
Direction : Charan Lakkakula
'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రంలో సప్తగిరి డాన్సులు ఇరగదీశాడు
- ఫస్ట్ సాంగ్ రిలీజ్ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్
కామెడీ కింగ్ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. బుల్గానిన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోలోని 'చిత్తూరికే చందురూడే చిందే వేస్తే..' అంటూ సాగే మొదటి పాటకి కందికొండ సాహిత్యం అందించగా, శంకర్ మహదేవన్ ఆలపించారు. అవినాష్ నృత్య దర్శకత్వం వహించారు. ఈ పాటను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ''నిర్మాత రవికిరణ్‌గారు చాలా బిజీగా వుండే డాక్టర్. కేవలం డబ్బు కోసం కాకుండా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తున్న హోమియో డాక్టర్. అలాంటి మంచి మనిషి సినిమాల మీద ప్యాషన్‌తో 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి సక్సెస్ అయ్యింది. మళ్లీ 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయి నిర్మాత రవికిరణ్‌గారికి మంచి లాభాలు రావాలి. సప్తగిరి నాకు చాలా ఇష్టమైన కమెడియన్. ఫస్ట్ సాంగ్ చూశాను. చాలా బాగుంది. డాన్సులు ఇరగదీశాడు. హిందీలో 'జాలీ ఎల్‌ఎల్‌బి' చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. చాలా మంచి కథ. ఈ సినిమా ఎవరితో తియ్యాలో అర్థం కాక వదిలేసాను. 'ఠాగూర్'లో ఎంత నిజాయితీగా, ఎంత స్ట్రాంగ్‌గా కంటెంట్ వుంటుందో ఈ చిత్రంలో కూడా అంతే స్ట్రాంగ్ కంటెంట్ వుంటుంది. ఇంత మంచి కథ సప్తగిరికి దొరకడం అతని అదృష్టం. ఈ సినిమా డైరెక్టర్ చరణ్ మద్రాసు నుంచి బాగా పరిచయం. చాలా తెలివైన వాడు. ఎప్పట్నుంచో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. సరైన టైమ్‌లో చరణ్‌కి ఈ సినిమా రావడం చాలా ఆనందంగా వుంది. డెఫినెట్‌గా ఈ సినిమా చరణ్‌కి మంచి బ్రేక్ అవుతుంది. బుల్గానిన్ మ్యూజిక్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాను. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అన్నారు.
కామెడీ కింగ్ సప్తగిరి మాట్లాడుతూ ''ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని లాంచ్ చేయడానికి వినాయక్‌గారిని అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన. మంచి మనసుతో మా టీమ్‌ని బ్లెస్ చేసి మా చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని లాంచ్ చేయడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు'' అన్నారు.
దర్శకుడు చరణ్ లక్కాకుల మాట్లాడుతూ ''ఎప్పటి నుంచో వినాయక్‌గారితో పరిచయం వుంది. ఆయన్ని ఎప్పుడు కలిసినా నువ్వు ఇంకెన్నాళ్లు కోడైరెక్టర్‌గా చేస్తావు త్వరగా డైరెక్షన్ చెయ్యి అని ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసేవారు. అలాంటి వినాయక్‌గారు మా చిత్రంలోని ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. మా నిర్మాత రవికిరణ్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా నిర్మించారు. అలాగే మా హీరో సప్తగిరి ఫస్ట్ నుండి ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు నా థాంక్స్'' అన్నారు.
చిత్ర నిర్మాత డా.రవికిరణ్ మాట్లాడుతూ ''మా బేనర్‌లో నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి'. మంచి మనసున్న వ్యక్తి, చిన్న సినిమా నిర్మాతలు పైకి రావాలని కోరుకునే వినాయక్‌గారు మా చిత్రంలోని మొదటి పాటని ఆవిష్కరించడం మా అదృష్టం. ఇక నుంచి మా బేనర్‌లో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తాయి. ఈ చిత్రంలో సప్తగిరి డాన్సులు అద్భుతంగా చేశాడు. బుల్గానిన్ మంచి సాంగ్స్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
సంగీత దర్శకుడు బుల్గానిన్ మాట్లాడుతూ ''వినాయక్‌గారిలాంటి పెద్ద డైరెక్టర్ మా సినిమా తొలి పాటని లాంచ్ చేయడం చాలా హ్యాపీగా వుంది. రవికిరణ్‌గారి బేనర్‌లో ఇది నా సెకండ్ మూవీ. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి మంచి సాంగ్స్ రాబ్టుకున్నారు. పాటలన్నీ ఎక్స్‌లెంట్‌గా వచ్చాయి. విన్నవారంతా సాంగ్స్ చాలా బాగున్నాయని మెచ్చుకుంటున్నారు. మా హీరో సప్తగిరి, డైరెక్టర్ చరణ్‌గారు నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి మంచి ఆడియో చేయడానికి సహకరించారు'' అన్నారు.
కామెడీ కింగ్ సప్తగిరి సరసన కశిష్ వోరా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: విజయ్ బుల్గానిన్, కో-డైరెక్టర్: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్.ఆర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: అర్జున్, పాటలు: చంద్రబోస్, కందికొండ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్, దర్శకత్వం: చరణ్ లక్కాకుల.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.