Telugu Film Producers Council executive committee cancelled, Ad-hoc committee formed

'తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి' కార్యవర్గం రద్దు
అడ్ హక్ కమిటీ ఏర్పాటు

ఎన్నో సంవత్సరాలుగా TFPC (Telugu Film ProducersCouncil) సభ్యులు కోరుకుంటున్న విధంగా,TFPC (తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి) ప్రస్తుతకార్యవర్గం రద్దు కాబడింది. 19.11.2017న జరిగిన సర్వసభ్య సమావేశంలో (17thAnnual General Body Meeting) ఏకగ్రీవంగా ప్రస్తుత కార్యవర్గాన్ని తక్షణం రద్దు చేసి,వెంటనే ఒక Ad-hoc Committeeని ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించవల్సిందిగా తీర్మానించటమైనది.

అనేక సంవత్సరాలుగా ‘కోర్ట్’ కేసులు అడ్డంపెట్టుకుని ఎన్నికలుజరిపించకుండా, అనేక ఆరోపణలు వస్తున్నా సమాధానం చెప్పకుండా, కోర్ట్ ధిక్కారం అని తెలిసికూడా ఇష్టారాజ్యంగా ‘బై లాస్’ మారుస్తూ,  అనేకఅవకతవకలకు, లక్షల నిధుల దుర్వినియోగానికిఆస్కారం కల్పిస్తూ, చిన్న నిర్మాతల సమస్యలనుపట్టించుకోకుండా స్వార్ధంతో,తమ వ్యక్తిగత లాభం కోసం, TFPC ప్రెసిడెంట్ మరియు సెక్రటరీపని విధానానికి ఎంతో వ్యతిరేకత వచ్చినా పట్టించుకోకుండా, అహంకారంతో నిర్మాతల మండలినితమ సొంత సంస్థ లాగా నడిపారు. Movie Towersలో కొన్ని కోట్లు వెచ్చించటం, Associated Producers Of Telugu LLP ఎదుగుదల కోసం నిర్మాతలమండలిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చెయ్యటం,కొన్ని లక్షల ఖర్చుతో తమ సొంత ప్రయోజనాలకోసం TFPC Websiteని నడపటం, మండలి కార్యాలయంRooms లో ఆఫీస్ బేరర్స్ వచ్చి కూర్చోరాదనే నియంతృత్వనిభందనలు,కొన్ని నెలల పాటు Health insuranceని రెన్యూల్ చెయ్యకుండాసభ్యులను ఇబ్బంది పెట్టటం, మూవీ టవర్స్-2 కడతామని హడావిడి, కొన్ని సంవత్సరాలుగా Annualreport(ఆదాయ, జమా ఖర్చుల పరిశీలన)పంపటంలేదని ప్రశించినవారిపై చర్యలు తీసుకుంటామనిబెదిరించటం, తమ వ్యక్తిగత వ్యాపారానికి, పనులకు TFPCని వాడుకోవటం, ఇతర రాష్ట్రాలకన్నా పెరిగినQUBE,UFO రేట్లు తగ్గించే ప్రయత్నం చెయ్యకపోవటం, చిన్న నిర్మాతల ధియేటర్ల సమస్య పట్టించుకోకుండా ఒకరిద్దరి కోసం మాత్రమే పనిచెయ్యటం…వంటి అనేక పరిష్కారం కాని సమస్యలతో, ఎన్నడూ TFPCOfficeకి రాని, అందుబాటులో ఉండని ప్రెసిడెంట్ తో విసిగిపోయిన సభ్యులకు ఎన్నికలు రావటంఎంతో సంతోషదాయకం.

  • తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యులు.
Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%