'డిటెక్టివ్' సాధించిన ఘన విజయం ఇన్‌స్పిరేషన్‌తో త్వరలోనే 'డిటెక్టివ్-2' ప్రారంభిస్తాం
- మాస్ హీరో విశాల్
మాస్ హీరో విశాల్ కథానాయకుడుగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డిటెక్టివ్'. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 434 థియేటర్స్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో మార్నింగ్ షో నుంచే బిగ్గెస్ట్ హిట్ అనే టాక్ తెచ్చుకుంది. తమిళ్‌లో ఘనవిజయం సాధించినట్టుగానే తెలుగులో కూడా ట్రెమండస్ రెస్పాన్స్‌తో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది.
'డిటెక్టివ్' చిత్రం సాధించిన విజయం పట్ల మాస్ హీరో విశాల్ స్పందిస్తూ...
''నేను నటించిన 'డిటెక్టివ్' చిత్రం నవంబర్ 10న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విడుదలైంది. మంచి రెస్పాన్స్‌తోపాటు మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి కంటెంట్‌తో వున్న సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాం. అయితే కొన్ని సినిమాలు ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వొచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. 'డిటెక్టివ్' అనే సినిమా నా కెరీర్‌లోనే స్పెషల్ మూవీ. ఎందుకంటే డిటెక్టివ్ అనే మాట మనం విని వుంటాం. కానీ, అలాంటి వారిని సొసైటీలో చూసే అవకాశం చాలా తక్కువగా వస్తుంది. వాళ్ళు ఎప్పుడూ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వుంటారు తప్ప బయట కనిపించరు. అలాంటి క్యారెక్టరైజేషన్‌తో ఒక సినిమా వస్తే ఎలా వుంటుందని డైరెక్టర్ చెప్పినపుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. డైరెక్టర్ మిస్కిన్‌గారు ఒక డిఫరెంట్ జోనర్‌లో సినిమా చేద్దాం అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఒక యాక్టర్‌కి పెర్‌ఫార్మ్ చేసే అవకాశం ఎక్కువ వున్న క్యారెక్టర్ ఇది. మా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా ఈ సినిమా చేస్తే నిర్మాతగా కూడా నాకు మంచి పేరు వస్తుంది అన్న నమ్మకం కూడా కలిగింది. మేం ఏదైతే కోరుకున్నామో అది ఇప్పుడు ప్రేక్షకులు చేసి చూపించారు. మీ అందరూ థియేటర్స్‌కి వెళ్ళి సినిమా బాగుందని మౌత్ టాక్‌తో స్ప్రెడ్ చేశారు. ఒక సినిమాకి ఇలాంటి టాక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. యునానిమస్‌గా సినిమా సూపర్‌హిట్ అని చెప్పారు. హ్యాట్సాఫ్ టు ఆడియన్స్. ఒక మంచి సినిమా తీసినందుకు మా 'డిటెక్టివ్' టీమ్ ఎంతో గర్వంగా ఫీల్ అవుతోంది. తమిళ్‌లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా అంత పెద్ద హిట్ అవ్వడం మాకెంతో ధైర్యాన్నిచ్చింది. ఇంకా ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో, ఇంకా బెటర్ కంటెంట్‌తో మీ ముందుకు వస్తే మంచి సక్సెస్ చేస్తారన్న నమ్మకం మరింత పెరిగింది. మరో విషయం ఏమిటంటే నా కెరీర్‌లోనే మొదటిసారి పాటలు లేకుండా చేసిన సినిమా ఇదే. అయితే సినిమాలో పాటలు లేవని ఎవ్వరూ ఫీల్ అయ్యేలా సినిమా వుండదు. ఎందుకంటే ఇది గ్రిప్పింగ్ థ్రిల్లర్. 26 నిమిషాలు వుండే క్లైమాక్స్ ఎంత కష్టపడి చేశామో దానికి తగ్గట్టుగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
విజిల్స్, చప్పట్లతో క్లైమాక్స్‌ని చూస్తూ ఎంజాయ్ చేయడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఇంత మంచి సినిమా చేసిన మా డైరెక్టర్‌గారికి, మా టీమ్‌కి థాంక్స్ చెప్తున్నాను. అలాగే నిర్మాత హరిగారు మంచి రిలీజ్ చేశారు. ప్రతి ఊళ్ళో మంచి థియేటర్స్‌లో సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా నా కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్‌లా అనిపిస్తుంది. ఈ సినిమాలో రెండు విషయాలకు మంచి గుర్తింపు వచ్చింది. మామూలుగా నా సినిమాల్లో ఫైట్ సీక్వెన్సెస్ వుంటాయి. ఈ సినిమాలో మూడు యాక్షన్ సీక్వెన్స్‌లు వున్నాయి. మొదటిది ఒక గోడౌన్‌లో వుంటుంది, రెండోది చైనీస్ రెస్టారెంట్‌లో వియత్నాం ఫైటర్స్ పాల్గొన్నారు. మూడోది క్లైమాక్స్ ఫైట్. ఈ మూడు ఫైట్స్‌కి థియటర్‌లో వస్తోన్న రెస్పాన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వుంది. మామూలుగా ఒక డైలాగ్స్ చప్పట్లు కొడతారు, మంచి కామెడీ సీన్‌కి చప్పట్లు కొడతారు. ఒక ఫైట్‌కి చప్పట్లు కొట్టడం అనేది రేర్‌గా జరుగుతుంది. ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం.
అలాగే నెక్స్‌ట్ సీన్‌లో ఏం జరుగుతుందనేది తెలీకుండా స్క్రీన్‌ప్లే చేయడం అనేది హైలైట్ అని అందరూ అంటున్నారు. ఒక సినిమాకి బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగుంటాయి. కానీ, క్రిటికల్ రివ్యూ అంత బాగా రాదు. కొన్ని సినిమాలకు క్రిటికల్ రివ్యూ బాగుంటుంది, కలెక్షన్స్ తక్కువగా వుంటాయి. ఈ రెండూ కలిపి మా 'డిటెక్టివ్' చిత్రానికి రావడం చాలా గర్వంగా వుంది. వచ్చే సంక్రాంతికి కొత్త కంటెంట్‌తో 'అభిమన్యుడు' రాబోతోంది. ఆ సినిమాకి కూడా ఇదే ఆదరణ వుంటుందన్న నమ్మకం నాకు వుంది. అలాగే 'డిటెక్టివ్' పార్ట్ 2 వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది. మీ ఆదరణతో ఇండియన్ షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్ ఈ సిరీస్‌లో కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాకే కాదు భవిష్యత్తులో మంచి కంటెంట్‌తో వచ్చిన ప్రతి ఫిలిం మేకర్‌ని, ప్రతి నటుడ్ని మీరు ఆదరిస్తారన్న నమ్మకం వుంది'' అన్నారు.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.