As we all know cancer deaths are increasing every year globally. This is due to lack of awareness of cancer. Thus, senior actress Gouthami has established Life Again Foundation and is regularly conducting campaigns to bring awareness in public over cancer. She indeed has succeeded in bringing stars like Natasimha Balakrishna and natural actor Jayasudha to take part in the drive.
Today (November 12) Winners Walk event has been conducted in Hyderabad’s necklace road. More than 800 cancer survivors participated in the event and they also endorsed the issue. Cancer survivors stunts in Royal Enfield Bikes, Banjala Ladies dances, celebrities stimulating promotions have brought magnificence to Hyderabad city.
Senior actress Gouthami, natural actor Jayasudha, deputy speaker Padma Devendar Reddy, senior hero Naresh, Life Again foundation co-founder Hyma Reddy, director-producer Tammareddy Bharadwaja, hero Sardar Patel, Maa
president Shivaji Raja, heroine Manali Rathod, producer and Santosham magazine chief Suresh Kondeti and several ‘Maa’ association members have participated in the event. The walk has begun at Jala Vihar from 6:30 am and ended at the People's Plaza by 8: 30. Tollywood item girl Mumait Khan was a special attraction in the Celebrity Walk Event.
800 మంది క్యాన్సర్ విజేతలతో నెక్లెస్‌రోడ్‌లో సెలబ్రిటీ విన్నర్ వాక్
ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేలాది ప్రాణాల్ని బలిగొంటున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్‌పై సరైన అవాగాహన లేకపోవడం ఈ మరణాలకు కారణం. అందుకే లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ ప్రారంభించి సీనియర్ కథానాయిక గౌతమి క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ విస్త్రత ప్రచారం సాగిస్తున్న సంగతి విదితమే. నటసింహా బాలకృష్ణ, సహజనటి జయసుధ సహా పలువురు సినిమా సెలబ్రిటీల్ని కలుపుకుని ఈ ప్రచారం నిర్వహించడంలో సక్సెసయ్యారు. నేడు (నవంబర్ 12న) హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో విన్నర్ వాక్ నిర్వహించారు. క్యాన్సర్ ను జయించిన 800 మంది ఈ వాక్ లో పాల్గొనడమే గాకుండా విస్త్రతంగా ప్రచారం చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై క్యాన్సర్ విన్నర్స్ విన్యాసాలు... బంజారా మహిళల నృత్యాలు.. సెలబ్రిటీల హుషారైన ప్రచారార్భాటం వెరసి హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌కి ప్రత్యేక కళ వచ్చిందనే చెప్పాలి. సేమ్ టైమ్ కేన్సర్‌పై అవేర్‌నెస్ పెంచే లక్ష్యం నెరవేరింది.
సీనియర్ నటి గౌతమి, సహజనటి జయసుధ, డిప్యూటి స్పీకర్ పద్మ దెవెందెర్ రెడ్డి, సీనియర్ హీరో నరేష్, లైఫ్ ఎగైన్ ఫౌండెషన్ కో ఫౌండర్ హైమా రెడ్డి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, హీరో సర్ధార్ పటేల్, మా
అధ్యక్షుడు శివాజీ రాజా, హీరోయిన్ మనాలీ రాధోడ్, నిర్మాత, సంతోషం అధినేత సురేష్ కొండేటి, మా అసొసియేషన్ సభ్యులంతా ఈ వాక్‌లో పాల్గొన్నారు. ఉదయం 6:30 కు జలవిహార్ వద్ద ప్రారంభమై 8:30కు పీపుల్ ప్లాజా వద్ద వాక్ ముగించారు. ఇక నెక్లెస్‌రోడ్ సెలబ్రిటీ వాక్‌లో టాలీవుడ్ ఐటెమ్ భామ ముమైత్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.