పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సోషియో ఫాంటసీ "రాయల హారం"
కౌశిక్ బాబు-వరుణ్ సందేశ్ హీరోలుగా.. వితికా షేరు, షీనా (బిందాస్ ఫేమ్) హీరోయిన్లుగా శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కర్రి బాలాజీ దర్శకత్వంలో జి.ఎల్.బి శ్రీనివాస్-నూకల లక్ష్మణ సంతోష్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రాయల హారం".
ఎం.ఏ. చౌదరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటోంది. విజువల్ ఎఫెక్ట్స్ కు అధిక ప్రాధాన్యమిస్తూ.. వినోదాన్ని మేళవించిన సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా కౌశిక్ బాబు పోషించిన పాత్ర అద్భుతంగా ఉంటుందని దర్శకుడు కర్రి బాలాజీ అన్నారు.
శ్రీకృష్ణదేవరాయుల కాలంనాటి ఓ హారం ప్రధానాంశంగా తెరకెక్కుతున్న "రాయల హారం" ఓ చక్కని సోషియో ఫాంటసీ చిత్రమని.. ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుందని, త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి.. ఆడియో రిలీజ్ ఎప్పుడనేది ప్రకటిస్తామని తెలిపారు నిర్మాతలు.
ముక్తార్ ఖాన్, ధనరాజ్, ఫిష్ వెంకట్, చక్రవర్తి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కర్ణ, సంగీతం: శ్రీవత్స-మీనాక్షీ-నాగరాజు-ప్రణవ్, రచన: శారద విజయబాబు, సమర్పణ: ఎం.ఏ.చౌదరి, నిర్మాతలు: జి.ఎల్.బి.శ్రీనివాస్-నూకల లక్ష్మణ సంతోష్ కుమార్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కర్రి బాలాజీ !!
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.