`శేఖరం గారి అబ్బాయ్` 20 న విడుదల
అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం శేఖరంగారి అబ్బాయ్
. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు. అక్టోబర్ 20న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రోమోస్ కు ట్రెమండస్ రెస్పాన్స్ సోషల్ మిడియాలొ వస్తోంది.
ఈ సందర్బంగా
దర్శకురాలు, కథానాయిక అక్షత మాట్లాడుతూ... శేఖరం గారి అబ్బాయి మ్యూజికల్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా అన్నీ వర్గాల వారిని ఆకట్టుకునెలా రూపొందించాం. విన్ను నటన ఈ సినిమాకు ఓ హైలెట్.ఈ సినిమాతో పరిచయం అవుతున్న కొత్తవారికి, స్ట్రగ్లింగ్ ఆర్టిస్టులు అందరికీ మంచి జరగాలి`` అన్నారు.
హీరో విన్ను మాట్లాడుతూ.. యూత్ కు నచ్చె, ప్యామిలీ ఆడియెన్స్ మెచ్చె చిత్రమిది. పాటలకు , ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్, ఆశీస్సులు ఉత్సాహాన్నిచ్చాయి. పెద్ద విజయం అందుకుంటామన్నారు .
నిర్మాతలు మాట్లాడుతూ .. కుటుంబ సభ్యులందరికి నచ్చెలా క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. హీరోగా విన్ను కు మంచి గుర్తింపు వస్తుంది. అక్టొబర్ 20న సినిమాను విడుదల చెస్తున్నామన్నారు
కాశీ విశ్వనాధ్, సూర్య, అనురూప్ ,డి.ఎం.కె తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి ఎలెందర్, కెమెరా: రాఘవ, కూర్పు: నందమూరి హరి.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.