Dr. Brahmanandam was felicitated in the USA at Tasveer South Asian Film Festival Seattle

అమెరికాలో బ్ర‌హ్మానందంని ఘ‌నంగా స‌న్మానించిన సౌత్ ఏసియన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్..!

అమెరికా లోని సియాటెల్ నగరం లో తస్వీర్ 12 వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిధిగా  ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత ,  గిన్నిస్ బుక్ లో స్ధానం సంపాదించుకున్న డాక్టర్ బ్రహ్మానందం హాజ‌ర‌య్యారు. ఇదే వేదిక పై అక్టోబర్ 7 న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందం ని ఘనంగా సన్మానించింది .

ఎన్నోవైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో న‌వ్వించిన హాస్య బ్ర‌హ్మా బ్ర‌హ్మానందం విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం ముదావహం . నాట్స్ సియోటెల్, యూనివ‌ర్శిటీ ఆఫ్ వాసింగ్ ట‌న్, అక్క‌డ ఉన్న తెలుగు వాళ్లు ఎంత‌గానో స‌హ‌క‌రించి ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసారు.

నిన్ను కోరి చిత్రం తర్వాత ఆచారి అమెరికా యాత్ర చిత్రానికి అమెరికా లో లైన్ ప్రొడక్షన్ చేస్తున్న పీపుల్ మీడియా సంస్థ అధినేత శ్రీ టీ జీ విశ్వ ప్రసాద్ మీడియా కు ఈ వార్త తెలియ జేస్తూ తమ హర్షాన్ని ప్రకటించారు. తెలుగు వాడి పెదవులపై చెరగని చిర్నవ్వు మన బ్రహ్మానందం గారని , ఆయ‌న ఎన్నో మ‌రెన్నో అంతర్జాతీయ పురస్కారాలకు అందుకోవాలని ఆశిస్తున్న‌ట్టు తెలియ‌చేసారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%