'డిటెక్టివ్'గా వస్తున్న మాస్ హీరో విశాల్
మాస్ హీరో విశాల్ కథానాయకుడుగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డిటెక్టివ్'. తమిళ్‌లో 'తుప్పరివాలన్'గా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ - ''తమిళ్‌లో 'తుప్పరివాలన్' పేరుతో రూపొందిన ఈ చిత్రం ఈవారం విడుదలై మొదటి వారంలోనే 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తోంది. విశాల్ కెరీర్‌లోనే మొదటివారం హయ్యస్ట్ కలెక్షన్ సాధించిన చిత్రంగా 'తుప్పరివాలన్' రికార్డు సృష్టించింది. 'డిటెక్టీవ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసాము. ఈ చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
మాస్ హీరో విశాల్, అను ఇమ్మానుయేల్, ఆండ్రియా, ప్రసన్న, కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్ విజయ్, అభిషేక్ శంకర్, జయప్రకాష్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్ కొరెల్లి, సినిమాటోగ్రఫీ: కార్తీక్ వెంకట్రామన్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.