Jr NTR’s ‘Jai Lava Kusa’ passed with U/A certificate

Chennai, Sep 13 (IANS) Actor Jr NTR's upcoming Telugu action-drama "Jai Lava Kusa" has been cleared by the Central Board of Film Certification (CBFC) with a U/A certificate and without cuts. The film is slated for worldwide release on September 21.

In a statement, the makers announced that the film has been cleared with a U/A certificate.

The film, directed by Bobby, features Jr NTR in a triple role.

For one of his roles, Jr NTR will be seen wearing prosthetics. His look has been handled by Hollywood make-up artist Vance Hartwell, popular for his work in films such as "The Lord of the Rings" trilogy and "Shutter Island".

Raashi Khanna and Nivetha Thomas are playing the leading ladies.

Popular Bollywood actor Ronit Roy plays the antagonist. The project marks his Telugu debut.

Produced by Kalyanram, the film has music by Devi Sri Prasad.

ఎన్టీఆర్ "జై లవ కుశ" చిత్రానికి U / A

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ' . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U / A సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఖరారు చేసింది.

ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా భారీ స్థాయి లో "జై లవ కుశ" చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ కు విశేషమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. కేవలం 38 గంటల లో కోటి కి పైగా వ్యూస్ ను "జై లవ కుశ" ట్రైలర్ సంపాదించుకుంది.

"యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం తో పాటు, అన్నదమ్ముల మధ్య నడిచే ఒక బలమైన కథ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సెన్సార్ కార్యక్రమం పూర్తి అయ్యింది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 21 న ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నాం" అని నిర్మాత కళ్యాణ్ రామ్ అన్నారు.

కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్)

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%