Social News XYZ     

Very happy to work in a horror comedy like Raju Gari Gadi 2 for the first time: Nagarjuna

ఫస్ట్‌టైమ్‌ 'రాజుగారిగది2' వంటి హారర్‌ కామెడీ మూవీ చేయడం హ్యాపీగా వుంది
- కింగ్‌ నాగార్జున

Very happy to work in a horror comedy like Raju Gari Gadi 2 for the first time: Nagarjuna

'విక్రమ్‌' నుంచి 'ఓం నమో వేంకటేశాయ' వరకు లవ్‌, యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, భక్తి రస చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో కింగ్‌ నాగార్జున. తాజాగా ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజుగారిగది2' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కింగ్‌ నాగార్జున. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఆగస్ట్‌ 29 కింగ్‌ నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా కింగ్‌ నాగార్జునతో జరిపిన ఇంటర్వ్యూ.

 

'రాజుగారి గది2' ఎంతవరకు వచ్చింది?
- ప్యాచ్‌ వర్క్‌ మినహా కంప్లీట్‌ అయిపోయింది. రీకార్డింగ్‌ జరుగుతోంది. ఇది హారర్‌ కామెడీ థ్రిల్లర్‌. నా సైడ్‌ నుంచి కామెడీ తక్కువ. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, అశ్విన్‌ కామెడీ వుంటుంది. అది కూడా సిట్యుయేషనల్‌ కామెడీ.

ఫస్ట్‌ టైమ్‌ హార్రర్‌ జోనర్‌లో నటిస్తున్నారు. ఎలా అనిపించింది?
- హారర్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. హారర్‌ అంటే ఎక్సార్జిస్ట్‌లాంటి సినిమాల్లా కాకుండా కామెడీ వుంటూ లైటర్‌ వేన్‌లో హార్రర్‌ వుండే సినిమాలంటే ఇష్టం. లక్కీగా అలాంటి సినిమా వచ్చింది.

ఓంకార్‌తో వర్క్‌ ఎలా వుంది?
- ఓంకార్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. చిన్న చిన్న కరెక్షన్స్‌ వున్నా సరిచేసి తీస్తాడు. అతను అనుకున్నది పర్‌ఫెక్ట్‌గా తీస్తాడు. చాలా క్లియర్‌గా వుంటాడు. ఫుల్‌ స్క్రిప్ట్‌ ముందే రాసుకున్నారు. ఆర్టిస్టులకు చాలా ఈజీ అవుతుంది.

'రాజుగారిగది' చిత్రానికి 'రాజుగారిగది2' స్వీకెల్‌ అనుకోవచ్చా?
- రాజుగారిగది సినిమాకి, ఈ పార్ట్‌2కి సంబంధమే లేదు. ఆ టైటిల్‌ తీసుకోవడానికి కారణం బాగా పాపులర్‌ అయిన సినిమా. ఆ జోనర్‌ అందరికీ తెలిసింది. అందుకే ఆ టైటిల్‌ పెట్టడం జరిగింది.

ఇందులో మీ క్యారెక్టర్‌ ఎలా వుంటుంది?
- మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌ నాది. రియల్‌ లైఫ్‌లో అలాంటివారిని ఇద్దరు, ముగ్గుర్ని కలిసాను. వాళ్ళకి ఎక్స్‌ట్రా సెన్సరీ పవర్స్‌ వుంటాయి. మీ మనసులో వున్నది ఈజీగా కనిపెట్టేస్తారు. నిజంగా చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఒక పది ప్రశ్నలు అడిగి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేస్తారు. అదేమీ మ్యాజిక్‌ కాదు, అబ్జర్వేషన్‌ పవర్స్‌ చాలా ఎక్కువ. మిర్రర్‌ మెమరీ వుంటుంది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగింది వాళ్ళ మెమరీలో సేవ్‌ అయిపోతుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు కంప్యూటర్‌లోలా దాన్ని బయటికి తీస్తారు. ఒరిజినల్‌గా ఒక మెంటలిస్ట్‌ క్యారెక్టర్‌ని పట్టుకొని తీశారు.

'హలో' ఎలా వచ్చింది?
- నేను సినిమా చూడలేదు. చూడాలి. విక్రమ్‌ చాలా ప్లాన్డ్‌గా సినిమా చేస్తారు. క్రియేటివ్‌గా సినిమాని బాగా తీస్తారు. సినిమా చాలా బాగా వస్తోంది. టైటిల్‌ని కూడా అందరూ యాక్సెప్ట్‌ చేసారు.

'హలో' ఎందుకంత డిలే అవుతోంది?
- మెయిన్‌గా హీరోయిన్‌ సెలక్షన్‌లోనే బాగా లేట్‌ అయింది. పియదర్శన్‌గారి అమ్మాయిని స్క్రీన్‌ టెస్ట్‌ చేసిన తర్వాత 30, 40 మందిని చేశాం. చేస్తూనే వున్నాం. అందుకే లేట్‌ అయింది. ఫ్రెష్‌గా వుండాలి అనుకున్నాం. గీతాంజలిలో గిరిజలా, ఏమాయ చేసావెలో సమంతలా కొత్తగా వుండాలనుకున్నాం. చివరికి ప్రియదర్శన్‌గారి అమ్మాయి కళ్యాణినే సెలెక్ట్‌ చేశాం.

'హలో' అనే టైటిల్‌ని చాలా డిఫరెంట్‌గా లాంచ్‌ చేశారు. ఆ థాట్‌ ఎలా వచ్చింది?
- ఎన్‌.టి.రామారావుగారితో స్టార్ట్‌ చేయించి నాన్నగారితో కంప్లీట్‌ చేసి 'హలో' టైటిల్‌ లాంచ్‌ చేయించాలనుకున్నాం. పెద్దాయన లేరు కాబట్టి తారక్‌ని అడిగాం. తారక్‌, అఖిల్‌ మంచి ఫ్రెండ్స్‌. అందుకే ఎన్టీఆర్‌తో స్టార్ట్‌ చేశాం.

'హలో' అనే టైటిల్‌ సినిమాకి యాప్ట్‌ అవుతుందా?
- ఈ టైటిల్‌ సినిమాకి చాలా అవసరం. తను ప్రేమించిన అమ్మాయి దగ్గర నుంచి ఒక హలో కోసం వెయిట్‌ చేస్తుంటాడు. ఇది నేను ఇచ్చిన టైటిల్‌. ఆరు నెలల నుంచి యూనిట్‌ అంతా ఏం టైటిల్‌ పెట్టాలని ఆలోచిస్తున్నారు. మీడియాలో కూడా ఎన్నో టైటిల్స్‌ వచ్చాయి. నాకు ఏదైనా టైటిల్‌ మైండ్‌లో వచ్చిందంటే వెంటనే రిజిస్టర్‌ చేయించేస్తాను. 'హలో' టైటిల్‌ ఎవరో ఒకరు రిజిస్టర్‌ చేయించేసి వుంటారనుకున్నాను. కానీ, ఒక్కరు కూడా చేయలేదు.

నాగచైతన్యతో 'రారండోయ్‌', అఖిల్‌తో 'హలో' చేయడం ప్రెజర్‌గా ఫీల్‌ అయ్యారా?
- ప్రేమ వుంటుంది కాబట్టి ప్రెజర్‌ కూడా వుంటుంది. అఖిల్‌ చేస్తున్న సినిమా కొంచెం కాంప్లికేటెడ్‌. బడ్జెట్‌ ఎక్కువవుతోంది. ఖర్చనేది తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే సబ్జెక్ట్‌ అలాంటిది.

మీరు చేసిన సినిమాల్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేసే ఆలోచన వుందా?
- బాహబలి గురించి పక్కన పెడితే అన్నీ వర్కవుట్‌ అవ్వవు. ఇంతకుముందు నా సినిమాలు కూడా వేరే భాషల్లో రిలీజ్‌ అయ్యాయి. కానీ, రిజల్ట్‌ అంత బాగా రాలేదు. ఇక్కడ చేసిన తర్వాత వేరే భాషల గురించి ఆలోచిద్దామనుకుంటున్నాను.

'బంగార్రాజు' ప్రోగ్రెస్‌ ఏమిటి?
- ఆ క్యారెక్టర్‌కి ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. నాకు కూడా ఆ క్యారెక్టర్‌ చెయ్యాలని వుంది. కళ్యాణ్‌కృష్ణ ఒక లైన్‌ చెప్పాడు. అంతగా నచ్చలేదు. మళ్ళీ ప్రిపేర్‌ అయి మంచి కథ చెప్తే తప్పకుండా చేస్తాను. అయితే అది 'సోగ్గాడే చిన్నినాయనా'కు సీక్వెల్‌ మాత్రం కాదు.

'మహాభారతం'లో చేస్తున్నారని తెలిసింది?
- ఆ సినిమాలో నటించమని నన్ను అడిగిన మాట వాస్తవమే కానీ ఆ సినిమా చేస్తానా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేను. అందులో కర్ణుడి పాత్ర చెయ్యమని అడిగారు. ఆ సినిమా 2018లో స్టార్ట్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

చైతన్య, సమంతల పెళ్ళి ఎలా చెయ్యబోతున్నారు?
- అక్టోబర్‌ 6న పెళ్ళి. అందరికీ తెలిసిందే. ఒకేరోజు క్రిస్టియన్‌, హిందూ సంప్రదాయాల్లో పెళ్ళి చేస్తున్నాం. పెళ్ళి సింపుల్‌గా చెయ్యాలని వాళ్ళే అనుకున్నారు. ఆ తర్వాత రిసెప్షన్‌ గ్రాండ్‌గా చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం.

అభిమానులకు మీ బర్త్‌డే సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు?
- అభిమానులు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతకంటే నేనేం చెప్పగలను. నాన్నగారి నుంచి ఇప్పటివరకు అన్ని సందర్భాల్లోనూ మాకు సపోర్ట్‌గా వున్నారు. వాళ్ళు మాపై చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఎప్పుడూ మర్చిపోను. అభిమానులే మాకు పెద్ద వరం అంటూ ఇంటర్వ్యూ ముగించారు కింగ్‌ నాగార్జున.

Facebook Comments
Very happy to work in a horror comedy like Raju Gari Gadi 2 for the first time: Nagarjuna

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.