పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మెగాస్టార్ 151వ చిత్రం
బుధవారం ఉదయం కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది.
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ తోపాటు, మోషన్ పోస్టర్ విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, అల్లు అరవింద్, పరుచూరి బ్రదర్స్, డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తదితరులతో పాటు, చిత్ర నిర్మాత రాంచరణ్, దర్శకులు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.