ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్(గోపి) విడుదల చేసిన
"ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం" మోషన్ పోస్టర్ !!
'చంద్రకాంత్-రాధికా మెహరోత్రా'లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. 'థర్డ్ ఐ క్రియేషన్స్' పతాకంపై.. 'రఘురాం రొయ్యూరు'తో కలిసి.. గోవర్ధన్.జి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎమోషనల్ రొమాంటిక్ థ్రిల్లర్ "ప్రేమ ఎంత మధురం-ప్రియురాలు అంత కఠినం". అధికభాగం అమెరికాలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్(గోపి) విడుదల చేసి.. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం రషెస్ తాను చూశానని.. చాలా బాగుందని.. అమెరికా లో సెటిల్ అయిన గోవర్ధన్.. అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నవారిని హీరోహీరోయిన్స్ గా తీసుకుని రూపొందించిన ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అన్నారు.
సినిమాపై ఫ్యాషన్ తో అమెరికాలో ఉద్యోగం వదులుకొని.. రఘురాం సహకారంతో ఈ చిత్రాన్ని అమెరికాలోనే తెరకెక్కించానని.. కాస్తంత థ్రిల్లర్ ఎలిమెంట్ ను జోడించి ఓ బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన 'ప్రేమ ఎంత మధురం-ప్రియురాలు అంత కఠినం' అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని దర్శకనిర్మాత గోవర్ధన్.జి అన్నారు. ఒక మంచి టీమ్ ఎఫర్ట్ తో తీసిన ఈ చిత్రం తమందరికీ మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నామని నిర్మాత రఘురాం రొయ్యూరు అన్నారు. గోవర్ధన్ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి.. జీవం పోశారని.. తమ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారని..ఈ చిత్రం తమకు తప్పకుండా మంచి బ్రేక్ ఇస్తుందని హీరో హీరోయిన్లు చంద్రకాంత్-రాధికా మెహరోత్రా అన్నారు.
తనికెళ్ళ భరణి, తులసి, జెమిని సురేష్, పల్లవి డోర ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, ఆర్ట్: అభిలాష్ మక్కెన, ఎడిటర్: శ్రీనివాస్ తోట, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిద్ధార్ద్ సదాశివుని, మ్యూజిక్: జితిన్ రోషన్, సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి, నిర్మాతలు: రఘురామ్ రొయ్యూరు-గోవర్ధన్.జి, రచన-దర్శకత్వం: గోవర్ధన్.జి!!!
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.