Social News XYZ     

‘Oye Ninne’ movie audio launched

`ఓయ్ నిన్నే` సినిమా తో
భరత్ మంచి హీరో గా ఎదగాలి
-'ఓయ్ నిన్నే ' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌ సభ లో అతిథుల ఆకాంక్ష 

'Oye Ninne' movie audio launched

ఎస్‌.వి.కె.సినిమా బేన‌ర్‌పై భ‌ర‌త్‌, సృష్టి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఓయ్‌..నిన్నే. వంశీకృష్ణ‌శ్రీనివాస్ నిర్మాత‌. స‌త్య చ‌ల్ల‌కోటి ద‌ర్శ‌కుడు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌, ఏపీ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి, అనిల్‌రావిపూడి, కోన‌వెంక‌ట్‌, చంద్ర‌సిద్ధార్థ్‌, కృష్ణ‌చైత‌న్య‌, భ‌ర‌త్‌, సృష్టి, శేఖ‌ర్‌చంద్ర‌, రామ‌జోగ‌య్య శాస్త్రి త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను కోన వెంక‌ట్ విడుద‌ల చేశారు. తొలి సీడీని అనిల్ రావిపూడి అందుకున్నారు.

మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ మాట్లాడుతూ - ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దాస‌రి స‌హా ఎందరో వేసిన దారి ఇప్పుడు ఎంతో బావుంది. తెలుగు చల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ త‌రుణంలో కొత్త న‌టీన‌టులు రావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఈరోజు హైద‌రాబాద్‌లో తెలుగు సినిమా అభివృద్ధికి ఎంత‌గానో తోడ్ప‌డుతుంది. బాహుబ‌లి, శ్రీమంతుడు నుండి ఈ మ‌ధ్య విడుద‌లైన ఫిదా వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో కొత్త కొత్త సినిమాలు ముందుకు వ‌స్తున్నాయి. అన్ని మంచి ఆద‌ర‌ణ‌ను పొందుతున్నాయి. అదే కోవ‌లో ఓయ్ నిన్నే సినిమా నిర్మాత వంశీకృష్ణ‌గారికి మంచి డ‌బ్బును, పేరును తెచ్చిపెట్టాలి అన్నారు.

గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి మాట్లాడుతూ - ఈ మ‌ధ్య ఐదు ఫైట్స్‌,ఆరు పాట‌ల‌కంటే కొత్త త‌ర‌హా క‌థ‌లున్న సినిమాల‌కే ఆద‌ర‌ణ పెరుగుతుంది. వంశీకృష్ణ‌గారు యువ హీరోహీరోయిన్ల‌తో మంచి సాంకేతిక నిపుణుల‌తో ఈ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. భ‌ర‌త్ మంచి హీరోగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాం అన్నారు.

కోన‌వెంక‌ట్ మాట్లాడుతూ - మంచి సినిమా తీయ‌డానికి మంచి క‌థ‌, దానికి త‌గ్గ న‌టీన‌టులు అవ‌స‌ర‌మ‌ని న‌మ్మే నిర్మాత‌ల్లో వంశీకృష్ణ‌గారు ఒక‌రు. సినిమా బావుంటే తుఫానులు, నోట్ మార్పిడిలు, జిఎస్‌టిలు ఏవీ ఆప‌లేవు. అలాంటి మంచి కాన్సెప్ట్ ఇందులో నాకు క‌న‌ప‌డుతుంది. స‌త్య మంచి వ్య‌క్తి. మంచి ర‌చ‌యిత‌. ట్రైల‌ర్‌, పాట‌లు చూస్తుంటే సినిమా ఎంత బాగా త‌ను తెర‌కెక్కించాడో తెలుస్తుంది. త‌న‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను. సాయిశ్రీరామ్ నాకు ఇష్ట‌మైన కెమెరామెన్. మంచి ప్ర‌య‌త్నంలా అనిపిస్తుంది. శేఖ‌ర్‌చంద్ర మంచి టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. కొత్త హీరో హీరోయిన్స్ అయినా చ‌క్క‌గా న‌టించారు. మంచి కాన్సెప్ట్ సినిమాలో క‌న‌ప‌డుతుంది. కొత్త సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ - మా బ్యాన‌ర్‌లో నేను చేసిన సినిమాల్లో సోలో నాకు బాగా న‌చ్చింది. ఓయ్ నిన్నే సినిమా సోలో కంటే బావుంటుంద‌నిపిస్తుంది. కొత్త‌వారితో చేసిన ఈ ప్ర‌య‌త్నం. నేను సెట్స్ ద‌గ్గ‌ర‌కి వెళ్ల‌క‌పోయినా, ద‌ర్శ‌కుడు స‌త్య సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. త‌ను భ‌విష్య‌త్ పెద్ద డైరెక్ట‌ర్‌గా ఎద‌గాలి. సాయిశ్రీరామ్ ప‌నిత‌నం ఎంటో విజువ‌ల్స్ చూస్తే తెలుస్తుంది. రామ‌జోగ‌య్య‌గారికి థాంక్స్‌. శేఖ‌ర్ చంద్ర‌గారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. నా నెక్స్‌ట్ మూవీకి కూడా ఆయ‌నే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. క‌థ ప‌రంగా చాలా మంచి క‌థ‌. క‌చ్చితంగా సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంద‌ని ధైర్యంగా చెప్ప‌గ‌ల‌ను అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు స‌త్య చ‌ల్ల‌కోటి మాట్లాడుతూ - మా అమ్మ‌నాన్న‌ల‌కు థాంక్స్‌. వంశీకృష్ణ‌గారు నాపై న‌మ్మ‌కంతో అవ‌కాశం ఇచ్చారు. నాకు అన్ని బ‌య‌ట లోకేష‌న్స్ కావాల‌ని అడ‌గ్గానే ఆయ‌న ఏం మాత్రం కాద‌న‌కుండా చేయించారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత‌. క‌థ న‌చ్చింది. ఏం కావాలంటే అది చేద్దామ‌ని ఎంతో ప్రోత్సాహం అందించారు. సాయిశ్రీరామ్‌గారు ఎంతో స‌హ‌కారం అందించారు. మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. శేఖ‌ర్ చంద్ర‌గారు సినిమాను ఓన్ చేసుకుని మంచి మ్యూజిక్ ఇచ్చారు. ట్యూన్‌కు త‌గ్గ‌ట్లు సాహిత్యం అందించారు. మార్తాండ్ కె.వెంక‌టేష్‌గారు స‌హా అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. భ‌ర‌త్, సృష్టి కొత్త‌వాళ్లైనా ఓన్ చేసుకుని న‌టించారు. నా గురువుగారు పరుశురాం, చందుమొండేటి, సుధీర్‌వ‌ర్మ, కృష్ణ‌చైత‌న్య స‌హా అంద‌రూ ఎంతో గైడెన్స్ ఇచ్చారు. అలాగే స్నేహితులు నాకు స‌హ‌కారం అందించారు అన్నారు.

హీరో భ‌ర‌త్ మాట్లాడుతూ - మంచి సినిమాలో భాగం కావ‌డం ఆనందంగా ఉంది. క‌థ విన్న‌ప్పుడూ బావా మ‌ర‌ద‌లు క‌థే క‌దా అనుకున్నాను. కానీ ద‌ర్శ‌కుడు స‌త్య చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సినిమాలో పాత్ర కోసం చాలా స‌న్న‌బ‌డ్డాను. సాయిశ్రీరామ్ గారు, శేఖ‌ర్ చంద్ర‌గారు, మార్తాండ్ గారు, రామ‌జోగ‌య్య‌శాస్త్రిగారు ఇలా అంద‌రూ స‌హ‌కారంతో మంచి సినిమా చేశామ‌ని న‌మ్ముతున్నాం. అంద‌రికీ న‌చ్చుతుంది అన్నారు.

చంద్ర‌సిద్ధార్థ్‌ మాట్లాడుతూ - ఇండ‌స్ట్రీ ఎప్పుడూ కొత్త వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేస్తుంటుంది. ఈ సినిమాతో  కొత్త టీమ్ ప‌రిచ‌యం అవుతుంది. అంద‌రికీ అభినంద‌న‌లు. రేపు ప్ర‌తి ఒక్క‌రూ `ఓయ్ నిన్నే` సినిమాకు వెళ్దామా అనేంత‌లా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ - నేను స‌త్య‌, సుధీర్ వ‌ర్మ, చందుమొండేటి అందరం అసోసియేట్ డైరెక్ట‌ర్స్‌గా ప‌నిచేశాం. త‌ను మంచి ర‌చ‌యిత. రౌడీ ఫెలో సినిమాలో నాకెంతో హెల్ప్ చేశాడు. నిర్మాత వంశీకృష్ణ‌గారితో సోలో సినిమా నుండి మంచి ప‌రిచ‌యం ఉంది. శేఖ‌ర్ చంద్ర సంగీతం బావుంది అన్నారు.

డైరెక్ట‌ర్ మ‌హేష్ మాట్లాడుతూ - శేఖ‌ర్ చంద్ర సంగీతం అంటే నాకు ఎంతో ఇష్టం. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.
శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ - సినిమాలో నేను భాగం కావ‌డం ఆనందంగా ఉంది. రామ‌జోగ‌య్య శాస్త్రిగారు ఓ పాట పాడ‌టం ఇందులో స్పెష‌ల్‌. ఫ్రెష్ ల‌వ్ స్టోరీ. చాలా గ్యాప్ త‌ర్వాత నేను చేసిన ల‌వ్ స్టోరి ఇది. ఈ సినిమాలో నేను కూడా ఓ పాట పాడాను అన్నారు.

రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ - నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మంచి వ్యాపార‌వేత్తనే కాదు, మంచి నిర్మాత కూడా. అచి తూచి మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాల‌నే నిర్మిస్తున్నారు. రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ జ‌మానాలో ద‌ర్శ‌కుకుడిగా ప‌రిచ‌యం అవుతున్న స‌త్య మంచి సినిమాను తెర‌కెక్కించారు. సినిమాలో క్లైమాక్స్ చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. మంచి భ‌విష్య‌త్ ఉన్న ద‌ర్శ‌కుడు. శేఖ‌ర్ చంద్ర మ‌రోసారి త‌న‌దైన శైలిలో అద్భుత‌మైన మ్యూజిక్ అందిచారు. భ‌ర‌త్‌, సృష్టి స‌హా న‌టీన‌టుల‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ - వంశీకృష్ణ‌గారితో మంచి అనుబంధం ఉంది. ఈ బేన‌ర్‌లోనే నేను ప‌టాస్ చేయాల్సింది కానీ కుద‌ర‌లేదు. ఎన్టీఆర్ట్స్ లో చేశాను. సినిమాను అల్రెడి చూశాను. ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. సాయిశ్రీరాం విజువ‌ల్స్ బావున్నాయి. భ‌ర‌త్, సృష్టి బాగా యాక్ట్ చేశారు. శేఖ‌ర్ చంద్ర మంచి ఆల్బ‌మ్ ఇచ్చారు. స‌త్య‌కు సినిమా పెద్ద హిట్ సాధించాలి. ఎంటైర్ టీంకు అభినంద‌న‌లు అన్నారు.

భరత్, సృష్టి, తనికెళ్ళభరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, తాగుబోతు రమేష్, తులసి, ప్రగతి, ధన్‌రాజ్ తదితరులు నటస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటింగ్: మార్తండ్.కె.వెంకటేష్, ఫైట్స్: వెంకట్, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, దర్శకత్వం: సత్య చల్లకోటి.

Facebook Comments
'Oye Ninne' movie audio launched

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.