Bunny Vasu produced V4movies’s ‘Next Nuvv’ to release for Vijayadasami

విజ‌య్‌ద‌శ‌మి సంద‌ర్బంగా బ‌న్నివాసు నిర్మిస్తున్న‌ వి4మూవీస్ "నెక్ట్స్ నువ్వే " విడుద‌ల‌

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి క‌థ‌కి స‌రిపోయె విధంగా నెక్ట్ నువ్వే అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.  హీలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వైభ‌వి, ర‌ష్మి లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రాన్నిఅన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌ల చేయ‌టానికి నిర్మాత బ‌న్నివాసు స‌న్నాహ‌లు చేస్తున్నారు. ఈరోజు ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ ని విడుదల చేస్తున్నారు.

కాన్స్‌ప్ట్ చిత్రాల‌తో వ‌రుస స‌క్స‌స్ లు సాధిస్తున్న బ‌న్నివాసు

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ గారి బ్లెస్సింగ్స్ తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు బ‌న్నివాసు. త‌న మెద‌టి చిత్రం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 100 ల‌వ్ అనే చిత్రాన్ని చ‌క్క‌టి కాన్స్‌ప్ట్ తో క్వాలిటి చిత్రంగా స‌క్స‌స్ ని సాధించారు. ఆ తరువాత సుప్రీమ్‌హీరో సాయిధ‌రమ్ తేజ్ హీరోగా పిల్లానువ్వులేనిజీవితం అనే మ‌రో క‌మ‌ర్షియ‌ల్ కాన్స్‌ప్ట్ చిత్రంతో స‌క్స‌స్ ని సాధించారు. మారుతి ద‌ర్శ‌కుడిగా అల్లు శిరీష్ హీరోగా కొత్త‌జంట అనే కాన్స్‌ప్ట్ తో ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. ఆ త‌రువాత వ‌చ్చిన నాని హీరోగా మారుతి ద‌ర్శ‌కుడిగా భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం సూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా రికార్డులు క్రియోట్ చేసింది. ఈ చిత్రం విజ‌యానికి ముఖ్య‌కార‌ణం కాన్సెప్ట్ కావ‌టం విశేషం. ఇలా మంచి క‌మ‌ర్షియ‌ల్ కాన్సెప్ట్స్ తో చిత్రాలు చేస్తూ విజ‌యాల్ని సాధించ‌డంలో ఎక్స‌ప‌ర్ట్ బ‌న్నివాసు.. ఇప్ప‌డు నెక్ట్స్ నువ్వే అనే హిలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ తో విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

ప్ర‌భాక‌ర్‌.పి, ఆదిసాయికుమార్‌ కాంబినేష‌న్

ఇప్ప‌టికే హీరోగా త‌న‌కంటూ మంచి ఇమేజ్ ని స‌క్స‌స్ ని సాధించిన ఆది సాయికుమార్ ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్‌.పి చెప్పిన కాన్సెప్ట్ న‌చ్చి ఏమాత్రం ఆలోచించ‌కుండా అంగీక‌రించారు. దానికి తోడు సౌత్ఇండియాలో అతిపెద్ద నిర్మాణ సంస్థ‌గా ప్రారంభ‌మైన వి4 మూవీస్ లో ఈ చిత్రాన్ని బ‌న్నివాసు నిర్మించ‌టం ఈ ప్రోజెక్ట్ కి ట్రెడ్ లో హ్యూజ్ క్రేజ్ వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్.పి కి బుల్లితెర‌పై ద‌ర్శ‌క‌త్వం పై గ‌ట్టి ప‌ట్టు వుండ‌టంతో స‌హ‌జం గా అత‌ను న‌టుడు కావ‌టంతో త‌న‌కి ఏం కావాలో న‌టించి మ‌రీ చెయించుకున్నాడు. ఈ చిత్రం ఆద్యంతం హిలేరియ‌స్ కామెడి థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు.

నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం1 గా తెర‌కెక్కిస్తున్న చిత్రానికి నెక్ట్స్ నువ్వే అనే టైటిల్ ని ఖ‌రారు చేశాము. ఈ చిత్రం తో ప్ర‌భాక‌ర్‌.పి ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నాడు. మంచి కాన్సెప్ట్ ఆడియ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చెయ్య‌టమే ల‌క్ష్యం గా చేశాము. ఆదిసాయికుమార్ పాత్ర చాలా బాగుంటుంది. ఆదిసాయికుమార్ కెరీర్ లో ఇది మంచి విజ‌యం గా నిలుస్తుంది. వైభ‌వి, ర‌ష్మి, అవ‌స‌రాల శ్రీనివాస్, బ్ర‌హ్మ‌జి, ర‌ఘు మంచి పాత్ర‌ల్ల క‌నిపిస్తారు. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. విజ‌య ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేయ‌టాన్ని ప్లాన్ చేస్తున్నాము.. అని అన్నారు

న‌టీన‌టులు.. ఆది సాయికుమార్‌, వైభ‌వి, రేష్మి, బ్ర‌హ్మ‌జి, అవ‌స‌రాల శ్రీనివాస్‌, హిమ‌జ‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, పృధ్వి, ఎల్‌.బి.శ్రీరామ్‌, ర‌ఘుబాబు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘు, బెన‌ర్జి, తాగుబోతు ర‌మేష్‌, ముమైత్ ఖాన్‌, ర‌జిత‌, స‌త్య‌కృష్ణ‌, దువ్వాసి మెహ‌న్‌, రామ్ జ‌గ‌న్‌, గెట‌ప్ శ్రీను, శ్రీచ‌ర‌ణ్‌, రాఘ‌వ‌, అనురాగ్‌, సుభాష్‌, మ‌న్న‌న కొటేశ్వ‌రావు, ల్యాబ్ శ‌ర‌త్‌, ర‌మాదేవి, అనిత‌, క‌ళ్యాణి, ర‌మ‌ణి, ఆర్‌జె రాజు, ప్రేం సాగ‌ర్‌, సందీప్‌, సంజ‌య్‌, శివ‌, విక్ర‌మ్‌,రోహిణి, షాన్‌, సాత్విక్‌, మాధ‌వి, ప్రియ‌, భాషా, షా, స‌త్య‌శ్రీ, సుకుమార్‌, మ‌హ‌తి, శ్రీధ‌ర్‌, దావూద్‌, మాస్ట‌ర్ లికిత్ త‌దిత‌రులు..

సాంకేతిక‌నిపుణులు.. క‌థ‌- డి.కె, మాట‌లు- శ్రీకాంత్ విస్సా,నిరుప‌మ్ ప‌రిటాల‌, పాట‌లు- కె కె సాగ‌ర్‌, ఫోటోగ్ర‌ఫి- కార్తిక్ ప‌ళ‌ని, ఎడిటింగ్‌- ఎస్‌.బి.ఉద్ద‌వ్‌, ఆర్ట్‌- శ్రీకాంత్‌, డాన్స్‌- విశ్వ‌రఘు, ఫైట్స్‌- శ్రీధ‌ర్‌, విజువ‌ల్ ఎఫెక్స్‌- పిక్స‌లాయిడ్‌, ప‌బ్లిసిటి డిజైన‌ర్‌- ధ‌నిఏలే, స్టిల్స్‌- పాలా వెంక‌టేష్‌, ఎఫ్‌.డి.సి- నాగేశ్వ‌రావు, పి.ఆర‌.ఓ- ఏలూరు శ్రీను, మేక‌ప్‌- ఐ.శ్రీనివాస‌రాజు, కాస్ట్యూమ్స్‌- షాజి, కాస్ట్యూమ్స్ డిజైన‌ర్స్‌- ఆండోల్ సి.కె (ఆది, వైభ‌వి), కీర్త‌న సునీల్(ర‌ష్మి), ప్రోడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌- కొచ్చ‌ర్ల స‌త్య‌శివ‌కుమార్‌, ప్రోడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌- ఎ.ఎస్‌.వి.ఎస్‌.ఎస్ సుభ్ర‌మ‌ణ్యం, అసిస్టెంట్స్- ప్ర‌వీణ్, ద‌త్తు, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్స్‌- సుబ్బు, ముర‌ళి, అసోసియోట్ డైర‌క్ట‌ర్స్‌- బి.ర‌వికిర‌ణ్‌, సుకుమార్‌, కొ-డైర‌క్ట‌ర్స్‌- పృధ్వివ‌ర్మ‌, ఎస్‌.శ్రీనివాస‌రావు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- స‌త్య గ‌మిడి,

ప్రోడ్యూస‌ర్- బన్నివాసు. స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం- ప్ర‌భాక‌ర్‌.పి

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%