మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా దర్శకుడు ఆడియో వేడుక
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా ఈ నెల 15న జరుగనున్న ఈ చిత్ర పాటల వేడుకకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ చేతుల మీదుగా ఈ పాటలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆయన చేతుల మీదుగా మా పాటలు విడుదలకానుండటం మాకెంతో ఆనందంగా వుంది అని తెలిపారు.
అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.