Lavanya With Lover Boys movie audio released

లావణ్య విత్ లవ్‌బాయ్స్ గీతావిష్కరణ

రాజ్యలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లావణ్య విత్ లవ్‌బాయ్స్. పావని, కిరణ్, యోధ, సాంబ ప్రధాన పాత్రల్లో నటించారు. నర్సింలు పటేల్‌చెట్టి, సి.రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. యశోకృష్ణ బాణీలను అందించిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. బిగ్‌సీడీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రమణాచారి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదలచేశారు. ఆడియోసీడీలను కె.రమణాచారి ఆవిష్కరించారు. తొలి ప్రతిని పరుచూరి గోపాలకృష్ణ స్వీకరించారు. ట్రైలర్‌ను రమణాచారి విడుదలచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదుర్తి సుబ్బారావు తేనే మనసులు సినిమాతో కొత్తవారిని పరిచయం చేయకపోతే కృష్ణ చిత్రసీమకు పరిచయమయ్యేవారు కాదు. దాసరి కొత్త నటులు వద్దనుకుంటే మోహన్‌బాబులాంటి ఎందరో ప్రతిభావంతులు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకపోయేవారు. తేజ, శేఖర్‌కమ్ములతో పాటు పలువురు దర్శకులు కొత్త తరాన్ని చిత్రసీమలోకి తీసుకువచ్చారు. ఆ ఒరవడిలో వడ్డేపల్లి కృష్ణ చక్కటి కథాంశంతో నూతన తారలతో చేసిన మంచి చిత్రమిది .. కథాబలమున్న యువతరంలో ఉత్తేజాన్ని రేకెత్తించే, వారిలో ప్రోత్సహాన్ని నింపే కథాంశాలు తప్పకుండా విజయాన్ని సాధిస్తాయి. లలిత గీతాలపై పరిశోధన చేసి డాక్టరేట్‌ను పొందిన వడ్డేపల్లి కృష్ణ సంకల్పం, ధైర్యమే ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి కారణమైంది. మంచి సినిమాలు తీసే దర్శకులు మరింత మంది చిత్రసీమలోకి రావాలి అని అన్నారు.

వడ్డేపల్లి కృష్ణ తపన, తాపత్రయం, ప్రతిభతో పాటు తనన తాను ఆవిష్కరించుకోవాలనే ఆలోచనతో చేసిన సినిమా ఇదని, పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

డ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రేమికుల్లో పులకింత ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టే చిత్రమిది. పావనితో పాటు నటీనటులంతా పోటీపడి నటించారు. వరూధినిని ఉహించుకుంటూ కలల లోకంలో విహరించే ముగ్గురు యువకులు లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ ముగ్గురిలో లావణ్య ఎవరిని పెళ్లిచేసుకుంటుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. పతాక ఘట్టాలు ఉత్కంఠను పంచుతాయి.

దర్శకుడిగా నా ద్వితీయ ప్రయత్నం ప్రతి ఒక్కరి హృదయాల్ని హత్తుకుంటుందనే నమ్మకముంది. మనసుకు వయసుతో సంబంధం ఉండదు. పాతికేళ్లు వెనక్కి వెళ్లి ఈ సినిమా చేశాను. పెళ్లిచూపులు తరహాలో ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముంది అని తెలిపారు. భక్తి, పేరడీ, డ్యూయెట్‌తో పాటు అన్ని తరహా గీతాలకు స్వరాలను సమకూర్చే అవకాశం దొరికిందని, సంగీత దర్శకుడిగా తనకు మంచి పేరును తెచ్చిపెట్టే చిత్రమిదని యశోకృష్ణ చెప్పారు.

మిత్రుడిలోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ నిర్మాత ఈ సినిమా తీయడానికి ముందుకు రావడం అభినందనీయమని, ఇలాంటి చిన్న నిర్మాతల్ని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మ్రరిన్ని మంచి చిత్రాలు వస్తాయని, వందలాది మందికి ఉపాధి దొరుకుతుందని నిర్మాత మల్కాపురం శివకుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం చైర్మన్ లక్ష్మణ్, అగ్రోస్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు కిషన్‌రావు, నిర్మాతలు, రాజ్యలక్ష్మి, నర్సింలు పటేల్‌చెట్టి, కిరణ్, సాంబ, ప్రేమలత, తోట.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%