Spider-Man: Homecoming to have a huge Worldwide release on July 7th

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక స్క్రీన్స్ లో జూలై 7న "స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్" విడుదల

The stars and filmmakers of "SPIDER-MAN: HOMECOMING", actors Tom Holland, Zendaya and director Jon Watts appear in Barcelona on the occasion of the CineEurope event on Sunday 18th June 2017.

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కి హీరో అంటే స్పైడ‌ర్‌మెన్ మాత్ర‌మే గుర్తుంటాడు. మెరుపు వేగంతో దూసుకుపోతూ, చాలా సింపుల్ గా పవర్ ఫుల్ విలన్స్ ఆట కట్టించే ఈ సూపర్ హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. స్పైడర్ మ్యాన్ సిరీస్ నుంచి సినిమా వచ్చిన ప్రతిసారీ వరల్డ్ మూవీ లవర్స్ గ్రూప్ లో ఓ పండగ వాతవరణం నెలకొటోంది. ఇండియాలో కూడా స్పైడీకి కోట్లకొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాలీ భాషల్లో స్పైడర్ మ్యాన్ సినిమాలు అనువాదం అయ్యి ఘ‌న‌విజ‌యాలు సాధిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇటీవలే స్పైడర్ మ్యాన్ సిరీస్ లో మరో కొత్త సినిమా తెరకెక్కింది. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా స్పైడీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన స్పైడర్ మ్యాన్ ఇంగ్లీష్ ట్రైలర్ కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మార్వెల్ కామిక్స్, కొలంబియా పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ వారు డిస్ట్రీబ్యూట్ చేస్తున్నారు.

జూలై 7న ఈ సినిమా ని తెలుగు రాష్ట్రాల్లో డైరెక్టు తెలుగు సినిమాలానే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సోనీ సంస్థ ప్రతినిథులు ప్రకటించారు. అలానే ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ చేసే విన్యాసాలుతో పాటు ఐరన్ మ్యాన్ చేసే యాక్షన్ స్టంట్లు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని సోనీ వారు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్ పాత్రలో కొత్త హీరో థామస్ స్టాన్లే హాలాండ్ నటిస్తున్నాడు, ప్రతినాయకునిగా అకాడమీ అవార్డ్ విన్నర్, బర్డ్ మ్యాన్ ఫేమ్ మిచెల్ కీటన్ నటిస్తున్నాడు, అలానే ఈ సినిమాకి సరికొత్త క్రేజ్ తీసుకొచ్చిన ఐరన్ మ్యాన్ పాత్రలో రాబర్డ్ డౌనీ జూనీయర్ నటిస్తున్నట్లుగా సోనీ సభ్యులు తెలిపారు. ఈసారి సోని వారు ప్రమెష‌న్ ని కూడా స‌రికోత్త పంథాలో ప్లాన్ చేస్తున్నారు. కొంత‌మంది స్పైడీల్ని ట్రైన్ చేసి అన్ని దేశాల‌కి ప్రమెష‌న్ నిమిత్తం పంపిస్తున్నారు. అంతేకాదు వారితో ర‌క‌ర‌కాల స్పైడీ విన్యాసాలు చేయిస్తారు.ఈ సారి తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలా అన్ని హంగుల‌తో జులై 7న ప్రేక్ష‌కుల ముందుకు అత్య‌దిక దియోట‌ర్స్ లో వ‌స్తుంది.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%