Mahanati is one of the highly anticipated films made on the life of greatest actress of all times in both Telugu and Tamil cinema from 1950s-60s Savitri. Heroine Keerthy Suresh is reprising the title character while Samantha is playing the key role in the direction of Nag Ashwin.
Malayalam super star Dulquer Salmaan who is roped to play crucial Shivaji Ganesan's role has joined Mahanati shooting today in Hyderabad. Director Nag Ashwin is shooting key sequences on Keerthy Suresh and Dulquer Salmaan.
“We are delighted to have Dulquer Salmaan joining the production schedule today in Hyderabad. He is playing an important and crucial character. Mahanati is being made as a tri lingual in Telugu, Tamil and Malayalam languages.
At the same time, Mahanati title and Keerthy Suresh first look released a few weeks back was received to amazing response from the audience. This film will be a celebration of the life of Savitri garu,” said producer Swapna Dutt.
Mahanati is jointly produced by Ashwini Dutt and Swapna Dutt on Vyjayanathi Movies and Swapna Cinema respectively.
గండిపేటలో "మహానటి" సెకండ్ షెడ్యూల్ !!
అలనాటి మేటినటి సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి" షూటింగ్ ప్రారంభమై ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న విషయం తెలిసిందే. "ఎవడే సుబ్రహ్మణ్యం" చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ "స్వప్న సినిమా" పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా మరొక స్టార్ హీరోయిన్ సమంత కథలో కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుస్తున్న ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్వప్న దత్ మాట్లాడుతూ.. "మలయాళ సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ "మహానటి"లో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది. నేటి నుంచి హైద్రాబాద్ లోని గండిపేటలో ప్రారంభమయిన తాజా షెడ్యూల్ లో దుల్కర్ పాల్గొన్నారు. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న "మహానటి" చిత్రం ఆవిడ అభిమానులకే కాక ప్రతి సినిమా అభిమానిని అలరించే విధంగా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదల చేసిన కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన లభించింది" అన్నారు.
ఈ లాంగ్ షెడ్యూల్ లో మరింతమంది కీలకపాత్రధారులు కూడా పాల్గొననున్నారు.
మిగతా పాత్రధారులు మరియు టెక్నీషియన్ల వివరాలు అతి త్వరలో వెల్లడిచేయనున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు!
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.