Kajal Aggarwal, among the most loved actresses in South of India is celebrating her birthday on June 19 with a film that is very special to her.
I play the role of Radha in my upcoming film titled "Nene Raju nene mantri" and this is indeed a very special film for several reasons. First and foremost, I've teamed up with my mentor Teja sir for the second time after 10 years of my debut film Lakshmi Kalyanam. It's been a pleasure working with him as he encourages me to unlearn the nuances I've picked up over the span of my film career and to look at my character and this film with a fresh perspective.
Secondly, Exchange of ideas, opinions and challenges make you think out of the box and I've felt this was possible because of the comfort level I share with Rana. Working with friends is always fun and this has been a fabulous few months!! Lastly, this is my 50th film, and I couldn't have asked for a more appropriate birthday gift 🙂
Nene Raju Nene Mantri, with an excellent cast lineup that includes hugely popular Rana Daggubati in the lead alongside Aushutosh Rana, Navadeep, and Catherine Tresa is expected to be simultaneously released in Tamil and Malayalam.
Directed by Teja, the film is produced by Suresh Daggubati, CH Bharath Chowdhary and V Kiran Reddy under Suresh Productions and Blue Planet Entertainments.
కథానాయికగా నేను నటిస్తున్న 50వ చిత్రం "నేనే రాజు నేనే మంత్రి"
పుట్టినరోజు కానుకగా నాకు ఇంతకుమించిన బహుమతి ఏముంటుంది!
-కాజల్ అగర్వాల్
అందం-అభినయం సమపాళ్లలో కలిగిన కథానాయకి కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఘనత కాజల్ సొంతం. కాజల్ కథానాయికగా పరిచయమై పదేళ్ళు పూర్తయ్యాయి. సరిగ్గా పదేళ్ళ తర్వాత తనను వెండితెరకు పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో మరోమారు నటిస్తోంది కాజల్. రాణా కథానాయకుడిగా తేజ తెరకెక్కిస్తున్న పోలిటికల్ థ్రిల్లర్ "నేనే రాజు నేనే మంత్రి". కథానాయికగా కాజల్ నటిస్తున్న 50వ సినిమా ఇది. జూన్ 19న చిత్ర కథానాయకి కాజల్ పుట్టినరోజు సందర్భంగా "నేనే రాజు నేనే మంత్రి" సినిమా తనకు ఎందుకంత ప్రత్యేకమైన చిత్రమో కాజల్ తెలిపారు.
"నేనే రాజు నేనే మంత్రి" చిత్రంలో నేను రాధ అనే పాత్ర పోషిస్తున్నాను. నన్ను :లక్ష్మీ కళ్యాణం"తో కథానాయికగా పరిచయం చేసిన తేజగారి దర్శకత్వంలో దాదాపు పదేళ్ళ తర్వాత నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. నేను ఇప్పటివరకూ పోషించని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. అలాగే.. రాణాతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ప్రతి సన్నివేశం గురించి మాట్లాడుకొని పెర్ఫార్మ్ చేసేవాళ్లం. అన్నిటికంటే ముఖ్యంగా.. "నేనే రాజు నేనే మంత్రి" నా 50వ చిత్రం కావడం అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం. నా పుట్టినరోజుకు ఇంతకు మించిన బహుమతి మరొకటి ఉండదు అంటూ "నేనే రాజు నేనే మంత్రి" సినిమా గురించి కాజల్ తన అనుభవాలను పంచుకొన్నారు.
రానా, కాజల్, అశితోష్ రాణా, కేథరిన్ థెరిస్సా, నవదీప్, పోసాని, జెపీ, రఘు కారుమంచి, బిత్తిరి సత్తి, ప్రభాస్ శీను, శివాజీ రాజా, జోష్ రవి, నవీన్ నేలి, ఫన్ బకెట్ మహేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
సంస్థ: సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్,
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: నారాయణ రెడ్డి
పరుచూరి బ్రదర్స్-లక్ష్మీ భూపాల్-సురేంద్ర కృష్ణ-శంకర్-రవివర్మ
నిర్మాతలు: సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
ఎగ్జిక్యూటీవ్ నిర్మాతలు: అభిరామ్ దగ్గుబాటి, వివేక్ కూచిబొట్ల
సమర్పణ: డి. రామానాయుడు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తేజ
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.