Niranjan, the newest release from the Garuda Vega family is a technology savvy guy played by Adith of “Katha and Tungabadra” fame. This poster is pretty self-explanatory. His character holds the key to the main plot of Garuda Vega, says the director without revealing much. Adith’s character travels with Rajasekhar’s through out the film and they have an amazing chemistry going. together they bring out the action-comedy-adventure genre to life. Its going to be an entertaining ride. It has been quite a while since a fun-adventure film was made and Garuda Vega is here to fill that gap. Producers are very confident that this film will be a great relief to the audience from the run-of-the-mill films coming out these days.
Apart from the main star cast RajaSekhar, Pooja Kumar, Adith, Shraddha Das, and Kishore, the film is power packed with a special song from Sunny leone and supporting actors like Avasarala Srinivas, Ali, Nassar, Posani, Prudvi, Shayeji Shinde, Ravi Verma, Charan Deep.
నిరంజన్ పాత్రలో అదిత్...
యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం” . ఈ సినిమా యూనిట్ సినిమాలో కీలకపాత్ర నిరజన్ గురించిన వివరాలను వెల్లడించింది. నిరంజన్ అనే సాంకేతిక నిపుణుడి పాత్రలో కథ, తుంగభద్ర చిత్రాల హీరో అదిత్ నటిస్తున్నాడు. యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌ను కూడా సినీ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఈ సందర్భంగా ..
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ - నిరంజన్ పాత్రలో అదిత్ చక్కగా నటించాడు. తన పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. రాజశేఖర్ పాత్రతో పాటు ఈ అదిత్ పాత్ర సినిమా అంతటా రన్ అవుతుంది. ఈ ఇద్దరి నటుల మధ్య సన్నివేశాలను చూస్తే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందనిపించింది. నటులిద్దరూ తమ నటనతో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రాణం పోశారు. సినిమాలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే చిత్రమిది
అన్నారు.
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పూజా కుమార్ గృహిణి పాత్రలో నటిస్తుంది. జార్జ్ అనే కరుగుగట్టిన విలన్ పాత్రలో కిషోర్ సహా నాజర్, పోసాని కృష్ణమురళి, అలీ, పృథ్వీ, షాయాజీ షిండే, అవసరాల శ్రీనివాస్, శత్రు, సంజయ్ స్వరూప్, రవివర్మ, ఆదర్శ్, చరణ్ దీప్, రవి రాజ్ తది తరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ః టిల్లి బిల్లి రాము, మేకప్ః ప్రశాంత్, ప్రొడక్షన్ మేనేజర్స్ః శ్రీనివాసరావు పలాటి, సాయి శివన్ జంపన, లైన్ ప్రొడ్యూసర్ః మురళి శ్రీనివాస్, కాస్ట్యూమ్స్ డిజైనర్ః బాబీ అంగార, సౌండ్ డిజైన్ః విష్ణు, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజన్ః సి.వి.రావ్(అన్నపూర్ణ స్టూడియోస్), స్టంట్స్ః సతీష్, నుంగ్, డేవిడ్ కుబువా, కొరియోగ్రాఫర్ః విష్ణుదేవా, ఎడిటర్ః ధర్మేంద్ర కాకరాల, రచనః ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రామిరెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః శ్రీచరణ్ పాకాల, సమర్పణః శివాని శివాత్మిక ఫిలింస్, నిర్మాణంః జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, సినిమాటోగ్రఫీః అంజి, సురేష్ రగుతు, శ్యామ్ ప్రసాద్, గికా, బాకుర్, సంగీతంః భీమ్స్ సిసిరోలియో, శ్రీచరణ్ పాకాల, ప్రొడ్యూసర్ః ఎం.కోటేశ్వర్ రాజు, కథ, కథనం, దర్శకత్వంః ప్రవీణ్ సత్తారు.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.