After the back –to-back successes of films like Run Raja Run, Malli Malli Idi Rani Roju, Express Raja and Shatamanam Bhavati, actor Sharwanand has another interesting project coming up, Radha. Presented by B.V.S.N. Prasad under the Sri Venkateswara Cine Chitra banner and directed by debutant Chandra Mohan, the film is going to be a complete entertainer and is produced by Bhogavalli Bapineedu. While the film is set to release on May 12, the film had a grand pre-release event in Vijayawada on May 6.
Sharwanand, Lavanya Tripathi, Dil Raju, Dr. Ramesh, Dr. Ram Mohan Rao, Vijayawada MP Kesineni Nani, Tanuku MLA Radha Krishna, Kranthi Madhav, Merlapaka Gandhi, Alankar Prasad and Sudarshan were the guests in attendance amongst several others.
The theatrical trailer was released by Kesineni Nani.
Speaking at the event, Kranthi Madhav said, “Sharwanand has been on a hit streak and I hope this film will just add on to that list. I hope this is going to be another new beginning for him. I give my best wishes to debut director Chandra Mohan, B.V.S.N. Prasad and Bapineedu.”
Merlapaka Gandhi shared, “The thing about Sharwanand is that any character he takes up, he does it with an air of genuinity. He can entertain the audience. And I wish Radha become a huge success. Sharwanand anna told me about how well Chandra Mohan has directed the film. I thank the director and producer for inviting me here.”
The film’s music director Radhan said, “I am very happy that I got to work with Sharwanand. Likewise with Lavnaya, Chandra Mohan, B.V.S.N. Prasad and Baapineedu and I want to thank all of them. This movie’s name is my mother’s name and that’s why I really like this film.”
Chandra Mohan, who is making his debut with Radha, shares, “This film explores the concept of what it would be like if Krishna was a police officer. Back then Krishna wielded his chakra, and this Krishna wields his lathi. To my family, to my guru Karunakaran, a huge thanks. To the producers B.V.S.N. Prasad and Baapineedu garu, a huge thanks for the support from the beginning. I am sure this film will entertain everyone.”
Tanuku MLA Radha Krishna shares, “The film has got a good title and it will surely be a hit. Chatrapati with Prabhas and Rajamouli, Attarintiki Daaredi with Pawan Kalyan were great hits from BVSN Prasad. And now, Radha is set to come to the screens. I wish this film will be a success.”
Dil Raju shares, “Radhan has scored great tunes. He had earlier given music for Yevade Subramanyam. And now he repeated that magic for Radha. Bapineedu, BVSN Prasad’s son, has taken on the wings of production full-fledgedly. Lavanya Tripathi looks very glamourous. I remember 12 years ago when Sharwanand had come to my office with his photos, I had taken his to Teja’s office. Despite no film background, from the last three years, he has been scoring back-to-back hits like Malli Malli Idi Rani Roju, Express Raja and Shatamana Bhavati amongst others. I think this film will mark his second hat-trick.”
Talking on the occasion, Kesineni Nani shares, “Vijaywada is like the birth place of Telugu cinema. Be it NTR or ANR, everyone has gone from here to rule the industry. Telugu cinema has reached the international level now. Without any kind of background, Sharwanad has been scoring several hits for over a decade now. And that is a proof of his hardwork and I want to congratulate him on all that he has achieved. All the best to the entire unit.”
BVSN Prasad shares, “Radha is set to release on May 12. As my son Bapineedu makes a full-fledged attempt at production, I hope the audience respond well. It was SS Rajamouli’s idea to make my son as a producer and finally, he has become one.”
Lavanya Tripathi said, “Radha has given me the chance to play a different role. Chandra Mohan directed the film very carefully. Sharwanand is one of the sweetest co-stars. I hope to work with him a lot more number of times. I want to thank the director and producers for choosing me to be a part of the film.”
Sharwanand said: “I was born in Vijayawada. Like Nani garu said, my grandfather Bommineni Subbarao garu started Siddhartha Educational Academy. And it’s a matter of pride that I am talking here today in the same college. Radha is a film which is a tribute to the police. Along with being entertaining, this commercial film has got a message within. This is a film which can be enjoyed with your whole family as it is a laugh riot for most part. Back in the time, Krishna was born to punish evil and save mankind. And in this movie, my character Krishna is born for a similar purpose. We all know how significant the police are in our day to day life as they make sure to solve every small issue. Without them, it would be tough for us to exist. That’s the point which made me want to be a part of this film. Prasad garu is a very cool producer and Baapineedu travelled with me right from the beginning and is presenting a very good film. Karthik’s cinematography is the backbone for our film. I think director Chandra Mohan will soon enter the big league of directors and has not just written a good story but has made the film entertainingly too. Thanks to everyone! I know as Radha releases on May 12, it will leave everyone in a happy states.”
`రాధ` ప్రీ రిలీజ్ ఫంక్షన్
రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్‌డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం రాధ
. ఈ సినిమాను మే 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ సిద్ధార్థ్ కాలేజ్ లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
ఈ కార్యక్రమంలోశర్వానంద్, లావణ్య త్రిపాఠి, డా.రమేష్, డా.రామ్మోహన్‌రావు, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, క్రాంతిమాధవ్, మేర్లపాక గాంధీ, మ్యూజిక్ డైరెక్టర్ రధన్, డైరెక్టర్ చంద్రమోహన్, కేశినేని నాని, దిల్‌రాజు, బివిఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు, అలంకార్ ప్రసాద్, సుద్శరన్ తదితరులు పాల్గొన్నారు.
థియేట్రికల్ ట్రైలర్‌ను కేశినేని నాని విడుదల
క్రాంతి మాధవ్ మాట్లాడుతూ - వరుస విజయాలు సాధిస్తున్న శర్వానంద్‌కు ఈ చిత్రం ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. మరో కొత్త బిగినింగ్ కావాలని కోరుతున్నాను. డెబ్యూ డైరెక్టర్ చంద్రమోహన్‌గారికి, బివిఎస్ఎన్‌ప్రసాద్, బాపినీడుకి అభినందనలు
అన్నారు.
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ - శర్వానంద్ ఏ క్యారెక్టర్ చేసినా జెన్యూన్‌గా చేస్తాడు. ఎంటర్‌టైనింగ్‌గా ఆడియెన్స్‌ను మెప్పిస్తారు. ఈ రాధ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. చంద్రమోహన్ సినిమాను డైరెక్ట్ చేసిన విధానం గురించి నాకు శర్వానంద్ అన్న చెప్పారు. దర్శక నిర్మాతలకు థాంక్స్
అన్నారు.
రధన్ మాట్లాడుతూ - శర్వానంద్‌తో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. అలాగే లావణ్య, డైరెక్టర్ చంద్రమోహన్‌గారు, నిర్మాత బివిఎస్ఎన్‌కు, బాపినీడుకి థాంక్స్. ఈ సినిమా పేరే మా అమ్మగారి పేరు. అందువల్ల నాకు ఈ సినిమా అంటే ఇష్టం
అన్నారు.
చంద్రమోహన్ మాట్లాడుతూ - ఒక కృష్ణుడు పోలీస్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తాం. అప్పట్లో కృష్ణుడు చక్రం తిప్పితే, ఈ కృష్ణుడు లాఠీ తిప్పుతాడు. నా కుటుంబానికి, నా గురువు కరుణాకరణ్‌గారికి ధన్యవాదాలు. నిర్మాతలు బివిఎస్ఎన్, బాపినీడు ప్రారంభం నుండి ఎంతగానో సపోర్ట్ చేశారు. తప్పకుండా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా ఉంటుంది
అన్నారు.
తణుకు ఎమ్మెల్యే మాట్లాడుతూ - మంచి టైటిల్, శర్వానంద్‌కు తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. ప్రభాస్ , రాజమౌళితో ఛత్రపతి, పవన్‌కళ్యాణ్‌తో అత్తారింటికి దారేది చిత్రాలను నిర్మించిన ఎస్‌విసిసి నిర్మాణ సంస్థలో ఇప్పుడు రాధ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రాధ మూవీ రాధకృష్ణ లీలలతో, ఎంటర్‌టైనింగ్‌తో అందరినీ అలరిస్తుందని కోరుకంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్
అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``రధన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఎవడే సుబ్రమణ్యం చిత్రాలకు సంగీతం అందించాడు. ఇప్పుడు రాధ చిత్రానికి కూడా మంచి మ్యూజిక్ అందించాడు. బివిఎస్ఎన్‌ప్రసాద్‌గారి తనయుడు బాపినీడు పూర్తి నిర్మాతగా బాధ్యతలు తీసుకుని సినిమాను నిర్మించాడు. లావణ్య త్రిపాఠి గ్లామర్‌గా కనపడుతుంది. ఇక శర్వానంద్ గురించి చెప్పాలంటే, 12 ఏళ్ళ క్రితం అవకాశం కోసం నా ఆఫీసుకు పోటోలతో వస్తే నేనే తేజగారి ఆఫీసుకి తీసుకెళ్ళాను. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా గత మూడేళ్ళ నుండి మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి సినిమాలతో వరుస హిట్‌లు అందుకున్నాడు. రాధతో ఐదవ హిట్ కొట్టి ఇదే ఏడాది సెకండ్ హ్యాట్రిక్ అందుకోవాలని కోరుకుంటున్నాను.
కేశినేని నాని మాట్లాడుతూ - విజయవాడ తెలుగు సినిమాకు పుట్టినిల్లు. ఎన్టీఆర్‌గారైనా, ఏఎన్నార్ అయినా ఎవరైనా ఇక్కడి నుండి వెళ్ళి ఇండస్ట్రీలో రాణించినవారే. ఇప్పుడు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా పదేళ్ళుగా వరుస విజయాలు సాధిస్తున్న హీరో శర్వానంద్ ఎంతటి హార్డ్ వర్క్ చేసేవాడో దిల్‌రాజుగారు చెప్పారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేని కుటుంబం నుండి వచ్చి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్‌కు ఈ సందర్భంగా కంగ్రాట్స్ చెబుతున్నాను. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, బాపినీడు సహా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్
అన్నారు.
బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ - మే 12న రాధ సినిమా ప్రేక్షకుల ముందకు రానుంది. మా అబ్బాయి బాపినీడు నిర్మాతగా పూర్తి స్థాయిలో చేసిన సినిమా తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను
అన్నారు.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ - రాధ సినిమాలో డిఫరెంట్ రోల్ చేశాను. చంద్రమోహన్‌గారు చాలా జాగ్రత్తగా సినిమాను డైరెక్ట్ చేశారు. శర్వానంద్ స్వీటెస్ట్ హీరో. తనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. మంచి సినిమాను ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్
అన్నారు.
శర్వానంద్ మాట్లాడుతూ - నేను పుట్టింది విజయవాడలోనే. నానిగారు చెప్పిననట్టు మా తాతగారు బొమ్మినేని సుబ్బారావుగారు సిద్ధార్థ్ ఎడ్యుకేషన్ అకాడమీలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అదే కాలేజ్‌లో నేను మాట్లాడటం ఆనందంగా ఉంది. పోలీసులకు ట్రిబ్యూట్ మూవీయే రాధ. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూ, కృష్ణుడిలా ఉంటూ మెసేజ్ అంటూ, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేసే చిత్రమవుతుంది. ఫ్యామిలీలందరూ కూర్చొని నవ్వుకునే సినిమా ఇది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి అప్పుడు కృష్ణుడు పుట్టాడు. ఇప్పుడు పోలీసోడు పుట్టాడు. పోలీసు వ్యవస్థ ఎంత గొప్పదో తెలుసు. మనం ఏ ఆపదలో వున్న మనల్ని కాపాడేది పోలీసులే. వారు లేకుంటే మనం లేం. మనల్ని రక్షిస్తున్నారు. ఆ పాయింట్ నచ్చే సినిమా చేయడానికి అంగీకరించాను. ప్రసాద్‌గారు చాలా కూల్ ప్రొడ్యూసర్. చాలా మంచి హిట్ సినిమా ఇవ్వబోతున్నారు. బాపినీడు కథ నుండి నాతో ట్రావెల్ అవుతున్నాడు. చాలా మంచి సినిమా ఇస్తున్నాడు. రధన్ మంచి మ్యూజిక్‌తో చంపేస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ సినిమాకు బ్యాక్‌బోన్‌లా మంచి అవుట్‌పుట్ ఇచ్చాడు. డైరెక్టర్ చంద్రమోహన్ బిగ్ లీగ్ డైరెక్టర్ లిస్టులో ఉంటాడు. చాలా ఎంటర్‌టైనింగ్‌గా సినిమా కథను రాయడమే కాకుండా చక్కగా తీశాడు. మే 12న విడుదలవుతున్నరాధ సినిమా ఎంటర్‌టైనింగ్ మూవీగా అందరికీ నచ్చుతుంది. అందరికీ థాంక్స్
అన్నారు.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.