Social News XYZ     

First song from Ganta Ravi’s Jaydev movie released

గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల 'జయదేవ్' ఫస్ట్ సాంగ్ విడుదల

First song from Ganta Ravi's Jaydev movie released

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌'. ఈ చిత్రం ఫస్ట్ సాంగ్ ఈరోజు ఉదయం 9 గంటలకు విడుదల చేసారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదల అవుతున్నాయి.
స్లొవేనియాలో 'జయదేవ్'

 

నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రం మొదటి పాటను ఈరోజు విడుదల చేసాము. మణిశర్మగారు చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. ఈరోజు నుంచి స్లొవేనియాలో షెడ్యూల్ జరుగుతోంది. ఈరోజు నుంచి మే 8 వరకు జరిగే షెడ్యూలుతో టోటల్‌గా షూటింగ్‌ పూర్తవుతుంది. మే చివరి వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ ఈచిత్రంలో వున్నాయి. ఇది ఒక సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ కథ. విధి నిర్వహణ కోసం తమ కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో 'జయదేవ్‌' క్యారెక్టర్‌ని డిజైన్‌ చెయ్యడం జరిగింది. ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే పది భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. కథతో లింక్‌ అయి వున్న ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాకి హైలైట్‌ అవుతాయి. అశోక్‌కుమార్‌గారి బేనర్‌లో 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేశాం. మళ్ళీ ఇదే బేనర్‌లో 'జయదేవ్‌' చిత్రంతో గంటా రవిని హీరోగా నా దర్శకత్వంలో ఇంట్రడ్యూస్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.

Facebook Comments
First song from Ganta Ravi's Jaydev movie released

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: