Social News XYZ     

“Aakatayi” Fame Ashish Raj New Movie Announcement Soon !!

మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న "ఆకతాయి"

"Aakatayi" Fame Ashish Raj New Movie Announcement Soon !!

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన "ఆకతాయి" చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన యువ కథానాయకుడు ఆశిష్ రాజ్.. మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. "ఆకతాయి" చిత్ర నిర్మాతలైన కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ లు మరో మారు సంయుక్తంగా ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు.

 

ఇకపోతే.. మార్చి 10న విడుదలైన "ఆకతాయి"కి సరైన థియేటర్లు దొరకని కారణంగా కొన్ని ఏరియాల్లో విడుదల కాలేదు, అందుకోసం "ఆకతాయి" చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో మరోమారు విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ మాట్లాడుతూ.. "యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన మా "ఆకతాయి"ని ఆదరించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. ఆ సినిమాకి లభించిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొనే మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నాం. ఆగస్ట్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాపులర్ హీరోయిన్ ఆశిష్ రాజ్ సరసన నటించనుంది. ఓ యువ ప్రతిభాశాలిని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయనున్నాం. ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అన్నారు!

Facebook Comments
"Aakatayi" Fame Ashish Raj New Movie Announcement Soon !!

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.