Gopichand Starrer “Oxygen” Releasing in May

The much awaited Gopi Chand starrer Oxygen which has been in the making for 1 year is all set for release. Shoot of the film was completed in January. The team has announced that there is 90 minutes of CG work in the film which has been in the making for the past 10 months and it's sure to be a visual treat for the viewers. The film is expected to set a new benchmark for mainstream cinema goers.The music is scored by Yuvan Shankar Raja who would score Background music in US. The Producer and director are planning a grand audio launch event at the end of this month. A.M. Rathnam is very excited and very much confident about the result of the film and he said that they are planning a worldwide release in May.

The film boasts of a Mega star cast which includes two top heroines Rashi Khanna, Anu Emmanuel and also Jagapathi babu, Kick shyaam, Ali, Chandramohan, Nagineedu, Brammaji, Abhumanyu Singh, Amith, Prabhakar, Shiyaji Shinde, Ashish Vidhyarthi, Vennela Kishore, Thagubothu Ramesh, Sithara, and so on. Film of this big a scale is bound to have expectations but the makers are seeming to be very confident about the film. The technical crew of the film includes some of the biggest names in our country - action choreographers peter Hein & stunt silva ; dance choreoegrapher Brinda, DOP includes Chota k naidu & Vetri. Director Jothi Krishna has revealed that the action sequences of the film have come out extraordinarily and the wait for this magnum opus project is finally over.

మే నెలలో విడుదలకానున్న గోపీచంద్ "ఆక్సిజన్"

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్" షూటింగ్ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటోంది. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. త్వరలో ఆడియో విడుదలకానున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. "పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకొన్నాయి. గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా "ఆక్సిజన్". ముంబై, గోవా, సిక్కిం, చెన్నై లాంటి ప్రదేశాల్లో నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీపడకుండా "ఆక్సిజన్" చిత్రాన్ని రూపొందించాం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన "ఆక్సిజన్" ఆడియో మన తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇక జ్యోతికృష్ణ టేకింగ్ స్టాండర్డ్స్ విషయం సినిమా రిలీజయ్యాక ప్రేక్షకులకు అర్ధమవుతుంది. త్వరలోనే ఆడియోను విడుదల చేసి.. మేలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం" అన్నారు.

జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, మ్యూజిక్" యువన్ శంకర్ రాజా, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ!

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%