Ageless diva Nayanthara is major attraction in all films she works for. The starlet who created name for her by doing female centric films of late will enthrall Telugu spectators once again with a heroine oriented film titled “Vasuki” which is dubbed version of Malayalam sensational movie “Puthiya Niyamam.” SR Mohan is bankrolling the project under Sreeram Cinema Banner. Currently, post-production works are happening. Producers are planning to release first look posters, trailer and then movie.
Producer SR Mohan said, “Vasuki will become best film in Nayanthara’s career. Each and every woman will connect to Nayan’s character. At present dubbing and other post-production works are happening for the film which was a huge hit in Malayalam. We are soon going to launch first look and trailer in presence of prominent faces. We will wrap up all the works soon to release the movie in May. Gopi Sunder’s music is going to be highlight of the film.”
Cinematography is by Roby Varghese Raj and Music is by Gopi Sunder. AK Sajan is director and SR Mohan is producer, while Sreeram Cinema is production banner of the film.
'వాసుకి'గా వస్తున్న నయనతార
నయనతార ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి తనే పెద్ద ప్లస్. ఇటీవల నాయికాప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ కొత్త ఒరవడి సృష్టించుకున్న ఈ అందాల తార మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఈ సినిమా టైటిల్ 'వాసుకి'. 'పుదియ నియమం' అనే మలయాళ చిత్రానికి అనువాదమిది. శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేసి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నారు.
చిత్రనిర్మాత ఎస్.ఆర్. మోహన్ మాట్లాడుతూ -''ఈ సినిమా నయన్ కెరీర్‌కే ది బెస్ట్‌గా నిలుస్తుంది. ప్రతి మహిళా ఈ చిత్రంలో నయనతార పాత్రకు కనెక్ట్ అవుతారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సంబంధించి.. ప్రస్తుతం తెలుగులో అనువాదం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్‌లను ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేయనున్నాం. అన్ని పనులు పూర్తి చేసి మేలో సినిమాని రిలీజ్ చేస్తాం. గోపిసుందర్ సంగీతం సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది'' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రఓబి వర్గీస్ రాజ్, సంగీతం: గోపి సుందర్, బ్యానర్: శ్రీరామ్ సినిమా, నిర్మాత: ఎస్.ఆర్.మోహన్, దర్శకత్వం: ఎస్.కె.షాజన్.
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.