ఈ నెల 15 న `ఆయుష్మాన్ భవ` మూవీ కర్టన్ రైజర్ వేడుక!!
మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న `ఆయుష్మాన్ భవ` చిత్రం ఈనెల 15వ తేదిన పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్` వంటి బ్లాక్ బస్టర్స్ చిత్రాలకు దర్శకత్వం వహించిన త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. బాలీవుడ్ లో పలు హిట్ సినిమాలకు సంగీతం అందించిన మీట్ బ్రదర్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. `చెన్నై ఎక్స్ ప్రెస్`, `దిల్ వాలే` వంటి హిట్ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన డూడ్లీ ఈ సినిమాకు కెమెరా మేన్ గా వ్వవహరిస్తున్నారు. ఈ నెల 15న ప్రారంభం కానున్న సినిమా గురించి అదే రోజున చిత్ర యూనిట్ మాధాపూర్ ఎన్ కన్వెన్ హాల్ లో కర్టన్ రైజర్ వేడుకను నిర్వహిస్తుంది.
ఈ సందర్భంగా సి.టి.ఎఫ్ ప్రతినిధి చరణ్ తేజ్ మాట్లాడుతూ `` త్రినాధరావు నక్కిన, డూడ్లీ వంటి టాప్ టెక్నిషీయన్లతో సినిమా తెరకెక్కుతోంది. అలాగే సీనియర్ రైటర్స్ పరుచూరి ప్రదర్స్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే సమకూరుస్తున్నారు. ఇంత మంది పెద్ద వాళ్లతో పాటు, మారుతితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. 15వ తేదిన పూజాకార్యక్రమాలు అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు టైటిల్ లోగో లాంచ్, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ కర్టన్ రైజర్ వేడుక చేస్తున్నాం. ఇలా సినిమా ప్రారంభం తర్వాత కర్టైన్ రైజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం` అని అన్నారు.
అలాగే ఈ కర్టన్ రైజర్ వేడుకలో మీట్ బ్రదర్స్ సంగీతంతో అలరించనున్నారు. ప్రముఖ హీరోయిన్ల డ్యాన్సులతో వేదిక మరింత కళకళలాడనుంది. ఈ వేడుకకు పలువురు దర్శక, నిర్మాతలు హజరు కానున్నారు.
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.