యువదర్శకుల సృజనాత్మతకు దర్పణం `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్`
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ నుంచి అభిరుచిగల చిత్రాలు వరుసగా వస్తున్న సంగతి విదితమే. ఆ కోవలోనే తమిళ బ్లాక్‌బస్టర్ `ధురువంగల్ పదినారు` (డి-16) తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్` పేరుతో అనువాదం పూర్తి చేసుకుని మార్చి 10న రిలీజైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ముందుకు సాగుతోంది 16. రెహ్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ధృవ సినిమాలో అరవింద్ స్వామి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ హేమచంద్ర ఈ చిత్రంలో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పడం హైలైట్. ఫస్ట్‌లుక్ సహా ట్రైలర్లకు చక్కని స్పందన వచ్చింది.
నిర్మాత చదలవా పద్మావతి మాట్లాడుతూ - ' తమిళంలో సంచలన వసూళ్లు సాధించిన `ధరువంగల్ పదినారు` చిత్రాన్ని తెలుగులో `16-ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్` పేరుతో అనువదించాం. రెండు తెలుగు రాష్టాల ప్రేక్షకులను విషేషంగా ఆకట్టు కుంటుందన్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు ప్రేక్షకులనుండి అనూహ్యమైన స్పందన వస్తోంది. రొటీన్ సినిమాల మాదిరిగా కాకుండా ప్రేక్షకులను ఆలోచింపచేసి తర్కించుకొనే విధంగా చేసి చివరకు ఆశ్చర్యపడేవిధంగాతీసిన ఈ సినిమా యువ దర్శకుల సృజనాత్మకతకు దర్పణం. 16-ఎవ్వెరి డీటెయిల్ కౌంట్స్ సినిమా ప్రతీ యువకుడి చిత్రం. అంతేగాక ప్రతివాళ్ళూ కుటుంబసమేతంగాచూడవలసిన సినిమా ఇది. హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠభరితంగా తెరకెక్కిన థ్రిల్లర్ ఇదేనని ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్, అరవిందస్వామి, మంచు మనోజ్ వంటి ప్రముఖులు ప్రశంసించడంతో ఈ సినిమాను ఇండస్ట్రీలో సైతం ఎలాంటి ప్రభావితం చేసిందో అర్థమౌతోంది. తమిళులు బ్రహ్మరథం పట్టినట్టే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగులో అన్నివార్గాల ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిది`అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా:సుజిత్ సరంగ్, సంగీతం: జాకేష్ బిజోయ్.
About VDC
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.