Social News XYZ     

Director, Actor Kasi Viswanath felicitated for completing 100 films

మా 'వైశాఖం'తో నటుడిగా 100 చిత్రాలు పూర్తి చేసుకున్న కాశీ విశ్వనాథ్‌గారు 1000 చిత్రాలు పూర్తి చెయ్యాలని కోరుకుంటున్నాను
- దర్శకుల సంఘం సత్కారసభలో డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.

Director, Actor Kasi Viswanath felicitated for completing 100 films

'నువ్వులేక నేనులేను' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయి తొలి చిత్రంతోనే సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వై.కాశీవిశ్వనాథ్‌ అల్లరి రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'నచ్చావులే' చిత్రంతో ఆర్టిస్ట్‌గా టర్న్‌ అయి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించారు. చిన్న, పెద్ద, అనే తేడా లేకుండా కమిట్‌మెంట్‌, సిన్సియారిటీతో అందరి దర్శకులతో వర్క్‌ చేస్తూ మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎస్టాబ్లిష్‌ అయ్యారు. తాజాగా డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి దర్శకత్వంలో రూపొందుతున్న 'వైశాఖం' చిత్రంతో నటుడిగా వంద చిత్రాలను పూర్తి చేసుకున్నారు. కేవలం 6 సంవత్సరాల్లో నటుడిగా వంద చిత్రాలను పూర్తి చేసిన వై.కాశీవిశ్వనాథ్‌ను తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం మార్చి 1న హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్‌లో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌, డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, ప్రముఖ దర్శకులు వి.ఎన్‌.ఆదిత్య, అల్లరి రవిబాబు, శ్రీవాస్‌, రాంప్రసాద్‌, 'కేరాఫ్‌ గోదావరి' చిత్ర యూనిట్‌ రాజా రామ్మోహన్‌, నిర్మాతలు తూము రామారావు, బొమ్మన సుబ్బారావు, రాజేష్‌ రాంబాల పాల్గొన్నారు. అనంతరం దర్శకుల సంఘం తరపున వీరశంకర్‌ శాలువా, ఫ్లవర్‌ బొకేలతో వై.కాశీ విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించారు. వేదికపై వున్న దర్శకులందర్నీ ఫ్లవర్‌ బొకేలు ఇచ్చి థాంక్స్‌ తెలియజేశారు కాశీవిశ్వనాథ్‌.

 

దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌ మాట్లాడుతూ - ''మా దర్శకుల సంఘంలో ఎంతో యాక్టివ్‌గా వుండి సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ మంచి స్నేహితుడిగా వున్న కాశీవిశ్వనాథ్‌ ఆర్టిస్ట్‌గా మారి ఆరు సంవత్సరాల్లో వంద చిత్రాలను పూర్తి చేయడం ఒక రికార్డ్‌గా భావిస్తున్నాను. కమిట్‌మెంట్‌, సిన్సియారిటీ, డెడికేషన్‌తో మంచి పాత్రలను పోషిస్తూ 'వైశాఖం'తో వంద చిత్రాలను పూర్తి చేసిన కాశీవిశ్వనాథ్‌ మా దర్శకులందరికీ గర్వకారణం. ఇలాగే ఇంకా మంచి సినిమాలు చేసి నటుడిగా మరింత పేరు తెచ్చుకోవాలి'' అన్నారు.

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''నచ్చావులే' సినిమా చేసాను. నాకు చాలా చాలా నచ్చింది. అంతకన్నా కాశీవిశ్వనాథ్‌గారి నటన బాగా నచ్చింది. ముఖ్యంగా రవిబాబు కాశీగారితో ఒక టిపికల్‌ క్యారెక్టర్‌ని ఎలా చేయించగలిగారు అని ఆశ్చర్యం వేసింది. నేను తీసిన 'లవ్‌లీ'లో కాశీగారిది చిన్న క్యారెక్టర్‌ అయినా చాలా కీ రోల్‌. రాజేంద్రప్రసాద్‌గారికి ధీటుగా వుండే రోల్‌ అది. చాలా అద్భుతంగా చేశారు. ఆ సినిమా మంచి సక్సెస్‌ అయ్యింది. ఆ తర్వాత మేం కలిసినప్పుడల్లా జయ ఏంటి? చిన్న రోల్‌ ఇచ్చావు. నెక్స్‌ట్‌ పెద్ద రోల్‌ ఇవ్వాలి అని అడిగేవారు. డెఫినెట్‌గా సార్‌. మళ్ళీ మంచి సినిమా చేద్దాం అన్నాను. 'వైశాఖం' వెరీ లక్కీ ఫిల్మ్‌ ఫర్‌ మి. అలాగే కాశీ విశ్వనాథ్‌గారికి కూడా. లెంగ్తీ రోల్‌ కాకపోయినా 'వైశాఖం'లో చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేశారు. క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి చాలా బాగా యాక్ట్‌ చేశారు. వెరీ నేచురల్‌ ఆర్టిస్ట్‌. మనం ఏం చెప్పినా సరే ఆయన అనుకున్నది చాలా నేచురల్‌గా చేస్తారు. ఆయనతో చేసిన డైరెక్టర్స్‌ అందరూ లక్కీ అనుకుంటున్నాను. 'నచ్చావులే' నుండి 'వైశాఖం' వరకు ఎంత స్పీడ్‌గా 100 సినిమాలు పూర్తి చేశారో అంతే వేగంతో 1000 సినిమాలు పూర్తి చెయ్యాలని ఆశిస్తున్నాను. '' అన్నారు.

ప్రముఖ దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య మాట్లాడుతూ - ''కాశీగారితో ఎప్పట్నుంచో పరిచయం వుంది. నా సినిమాల్లో కూడా ఆయన యాక్ట్‌ చేశారు. ప్రతి డైరెక్టర్‌కి అప్‌ అండ్‌ డౌన్స్‌ వుంటాయి. కానీ కాశీగారు డైరెక్టర్‌గా సక్సెస్‌ అయి, ఆర్టిస్ట్‌గా వంద సినిమాలు పూర్తి చేయడం చాలా గొప్ప విషయం. ఇలాగే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చెయ్యాలి'' అన్నారు.

దర్శకుడు రాంప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఒక ప్రక్క ఆర్టిస్ట్‌గా బిజీగా వుండి కూడా దర్శకుల సంఘంలో ఎంతో యాక్టివ్‌గా పార్టిసిపేట్‌ చేస్తూ సర్వీస్‌ చేస్తున్నారు కాశీగారు. అప్పట్నుంచీ మా జర్నీ కొనసాగుతుంది. తనకంటూ ప్రత్యేక ఒరవడిని ఏర్పరచ్చుకుని మంచి సినిమాలు చేస్తున్నారు. అనతికాలంలోనే వంద చిత్రాలను పూర్తి చేయడం మా అందరికీ చాలా సంతోషంగా వుంది'' అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''జనరల్‌గా డాక్టర్‌ అవుతామని యాక్టర్‌ అయినవాళ్లు వుంటారు. కాశీగారు డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్‌ అయ్యారు. నేను యాక్టర్‌గా ఇండస్ట్రీకి వచ్చాను. వేషాలు ఎవ్వరూ ఇవ్వక తప్పని పరిస్థితుల్లో ప్రొడ్యూసర్‌ని అయ్యాను. కాశీగారు ఆర్టిస్ట్‌గా 100 సినిమాలను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడం గొప్ప అచీవ్‌మెంట్‌. మంచి సినిమాలు, పెద్ద సినిమాలు చేయడమే ఆయన సక్సెస్‌కి కారణం. ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించి దర్శకుడిగా కూడా మరిన్నిమంచి సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

దర్శకుడు శ్రీవాస్‌ మాట్లాడుతూ - ''కాశీ విశ్వనాథ్‌గారు మా మేనత్తగారబ్బాయి. నేను ఇండస్ట్రీకి రావడానికి ఆయనే ముఖ్య కారణం. ఇంట్లో ఎప్పుడూ సినిమాల గురించి డిస్కస్‌ చేసేవారు. అలాగే మా నాన్నగారు థియేటర్‌ కట్టడం వల్ల మా ఇంట్లో ఎక్కువ సినిమా వాతావరణం కన్పించేది. ఆయన ఇన్‌స్పిరేషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. సక్సెస్‌ఫుల్‌గా నా కెరీర్‌ ముందుకు వెళ్తుంది అంటే దానికి మెయిన్‌ కారణం కాశీగారే. ఆర్టిస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఆయన కెరీర్‌ ముందుకు సాగుతున్నందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా వుంది. ఇలాగే మంచి సినిమాలు చేస్తూ ఇంకా పెద్ద ఆర్టిస్ట్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

శతచిత్ర నటుడు వై.కాశీవిశ్వనాథ్‌ మాట్లాడుతూ - ''తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం చేస్తున్న ఈ చిరు సత్కారాన్ని ఘన సన్మానంగా భావిస్తున్నాను. ఒక డైరెక్టర్‌గా వుండి ఆర్టిస్ట్‌గా 100 సినిమాలు పూర్తి చేసుకున్నందుకు, నాకు సహకరించిన దర్శకులు, నిర్మాతలు, రచయితలకు అందరికీ నా కృతజ్ఞతలు. ఎవరైనా 100 సినిమాలు చేయాలంటే చాలా కలిసి రావాలి. టాలెంట్‌ వుండటం, గొప్పగా చేయడం ముఖ్యం కాదు. మెయిన్‌గా అదృష్టం వుండాలి. సక్సెస్‌లు వుండాలి. రైటర్స్‌, డైరెక్టర్స్‌ మైండ్‌లో క్రియేటివిటీ వుండాలి. మనల్ని యాక్సెప్ట్‌ చేసి మంచి పాత్రలు క్రియేట్‌ చెయ్యాలి. 'నచ్చావులే'లో మంచి పాత్ర ఇచ్చిన రవిబాబుకి నా థాంక్స్‌. నేను రెండు సినిమాలు డైరెక్ట్‌ చేసిన తర్వాత ఒక స్టోన్‌లా వున్న నన్ను నటుడిగా ఒక శిల్పిలా చెక్కారు రవిబాబు. అందరూ యాక్సెప్ట్‌ చేసేలా నా పాత్రని తీర్చిదిద్దిన రవిబాబుకి నా జన్మంతా రుణపడి వుంటాను. 'పెద్దింటి అల్లుడు' చిత్రం అప్పుడు రవిబాబు పరిచయం. అప్పట్నుంచీ మా పరిచయం కొనసాగుతుంది. తెలుగు దర్శకుల సంఘం నుండి వచ్చిన ప్రతి డైరెక్టర్‌కి నా వంతు కోపరేషన్‌ అందించి వారందరి డైరెక్షన్‌లో నటించే అదృష్టం కలిగింది. ప్రతి డైరెక్టర్‌ని శాటిస్‌ఫై చెయ్యగలిగాను. 100 సినిమాలను పూర్తి చేయడానికి అదే మెయిన్‌ కారణం. నాకు ఇంత హ్యాపీనెస్‌ క్రియేట్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలు. నా ఫస్ట్‌ సినిమా డైరెక్టర్‌ రవిబాబు, 100వ సినిమా డైరెక్టర్‌ జయగారి సమక్షంలో ఈ సన్మానం జరగడం నాకు చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.

Facebook Comments
Director, Actor Kasi Viswanath felicitated for completing 100 films

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

%d bloggers like this: