February 28 is Repetitive Strain Injuries Awareness Day: Comedian Dr. Bhadram

ఫిబ్రవరి 28న ఇంటర్నేషనల్ రిపిటేటివ్ స్ట్రేన్ ఇన్ జ్యూరీ ఎవైర్నెస్ డే – హాస్య నటుడు, డా:భద్రం

‘జ్యోతి లక్ష్మీ’, ‘భలే భలే మగాడివోయ్’, ‘శతమానం భవతి’ వంటి చిత్రాలతో కమీడియన్ గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు హాస్య నటుడు భద్రం. నటుడిగా సినిమాల్లో రాణిస్తూనే వృతి రిత్య వైద్యునిగా కూడా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇక ‘ఎర్గోనమిక్స్’(Ergonomics) స్పెషలిస్ట్ గా వైద్య రంగంలో సేవలందిస్తోన్న భద్రం, ‘రిపిటేటివ్ స్ట్రేన్ ఇన్ జ్యూరీ’ అనే డిసాడర్ ని రూపుమాపే వైద్యునిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇప్పటికే ‘రిపిటేటివ్ స్ట్రేన్ ఇన్ జ్యూరీ’ పై జరిగిన పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో భద్రం పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 28 ఇంటర్నేషనల్ రిపిటేటివ్ స్ట్రేన్ ఇన్ జ్యూరీ ఎవైర్నెస్ డే సందర్భంగా ఆర్ ఎస్ ఐ గురించి వివరించారు భద్రం. ఈ డిసాడర్ ఎక్కువుగా కంప్యూటర్ ముందు గంటలు తరబడి పని చేసే సాఫ్ట్ వేర్, తదితర ఉద్యోగుల్లో కనిపిస్తోందని, ఈ లోపానికి గురైన వాళ్లకి చేతులు, నడుం, మేడ భాగాల్లో భరించలేని కండరాలు నొప్పి ఉంటుందని భద్రం తెలిపారు. వైద్యుడు సూచించిన మందులుతో పాటు కంప్యూటర్ తో ముందు కుర్చోనే విధానం, పని చేసే వేలల్లో మధ్యలో బ్రేక్ తీసుకోవడం వంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రిపిటేటివ్ స్ట్రేన్ ఇన్ జ్యూరీ నుంచి ఉపశమనం పొందవచ్చని భద్రం అన్నారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share
More

This website uses cookies.