Mega hero Sai Dharam Tej’s commercial entertainer Winner has completed its censor formalities and the movie has been awarded UA certificate without any single cuts by censor sleuths who lauded makers for making an entertaining film. Winner has now completed all the hurdles and the movie will be released on the auspicious day of Maha Sivarathri- February 24th.
Rakul Preet Singh is female lead opposite Sai Dharam Tej in Winner directed by Gopichand Malineni and produced jointly by Nallamalupu Bujji, Tagore Madhu on Sri Lakshmi Narasimha Productions & Leo Productions banner. Jagapati Babu essayed a crucial role in the film that has music composed by S. Thaman. Popular anchor Anasuya Bharadwaj will be seen sizzling in a special song which was sung by another popular anchor Suma.
Winner has many surprising elements. The film is expected to take SDT’s stardom to next level.
విన్నర్ సెన్సార్ పూర్తి... ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎలాంటి కట్స్ లేకుండా యు బై ఏ సర్టిఫికెట్ పొందడం విశేషం. ఇప్పటికే చిత్ర ట్రైలర్ కు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు సైతం చిత్ర యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తడం మరో విశేషం.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... మేమంతా ఊహించినట్టుగానే ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ పూర్తయింది. యు బై ఏ సర్టిఫికెట్ పొందిన విన్నర్ కు సెన్సార్ సభ్యుల నుంచి మంచి స్పందన లభించింది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. అని అన్నారు.
సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, ముకేష్ రుషి, ఆలీ, వెన్నెల కిశోర్ తదితరులుఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: తమన్, ఆర్ట్: ప్రకాష్, కథ: వెలిగొండ శ్రీనివాస్,మాటలు: అబ్బూరి రవి, నృత్యాలు: రాజు సుందరం, శేఖర్, ఫైట్స్: స్టన్ శివ, రవివర్మ, ఎడిటర్: గౌతమ్ రాజు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం:గోపీచంద్ మలినేని.
Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.
This website uses cookies.