Vaishakham Will Showcase ‘Love’ In A New Dimension

RJ Cinemas Banner earlier produced love stories like Premalo Pavani Kalyan, Chantigadu, Lovely is coming with another new love story 'Vaishakham'. B.A. Raju is producing this film in the direction of Dynamic Lady Director Jaya.B with Hareesh and Avantika in lead roles. Film has completed its shooting part and is currently undergoing it's post production work. On the occasion of Valentine's Day on February 14th, Team shared details about the film.

Dynamic Lady Director Jaya.B says, " Vaishakham Will Showcase 'Love' in a new dimension. 'Vaishakha masam' is very special for us. This is a season of marriages. Lord Venkateswara married Padmavathi in this season only. 'Vaishakham' is a love story in a family backdrop. How a girl changes the life of a boy and how their love story leads to marriage comprises the story of 'Vaishakham'. Film runs with a very different screenplay."

Producer B.A. Raju says " Most of our films Premalo Pavani Kalyan, Chantigadu, Gundamma Gari Manavadu are village based love stories. Our previous film 'Lovely' is a urban based love story. We mostly made love stories in our banner and all of them are Succesfull. Now we are coming with 'Vaishakham' different love story with family backdrop. Shooting part is completed and post-production works are going on. We are getting very good business offers. Planning to release the film in April as summer special."

Hero Hareesh says, " It is very challenging to do a film like 'Vaishakham'. My character has different variations. I feel lucky to be a part of such a beautiful film. I am indebted to Jaya madam and B.A. Raju sir for giving me this opportunity. Lovers and family audience will definitely connect with this film."

Heroine Avantika, " My character is very different in this film. I enjoyed playing my character while shooting. Director Jaya madam made this film with utmost care with very good detailing. I am very happy and thrilled doing this film. Jaya madam has laid very good foundation for my career with 'Vaishakham'. Youth will definitely love this film."

Along with Hareesh, Avantika in lead roles 'Dialogue King' Sai Kumar will be seen in other important role.

Other cast includes Eeshwar Rao, Rama Prabha, Prudhvi, Kasi Viswanath, Krishna Bhagawan, Sri Lakshmi, Gundu Sudershan, Appa Rao, Seshu, Bhadram, Sompu, Phani, Madhavi, Jenny, Jabardasth Team Venky, Sreedhar, Ram Prasad, Prasad, Teja, Shashank, Lateesh, Keerthi Naidu, Latha Sangaraju, Lavanya, Monica , Chandini, Ishaani.

D.O.P : Vaalisetty Subbirami
Music : D.J Vasanth
Dance : V.J Sekhar
Art : Murali Kondeti
Stills : Sreenu
Co-Director : Amaraneni Naresh
Production Executive : Subba Rao
Line-Producer : B.Siva Kumar
Producer : B.A Raju
Written, Edited , Directed by : Jaya.B

ప్రేమలోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే 'వైశాఖం'

ప్రేమలో పావని కళ్యాణ్‌, చంటిగాడు, లవ్‌లీ వంటి లవ్‌స్టోరీస్‌ని అందించిన ఆర్‌.జె.సినిమాస్‌ బేనర్‌ నుంచి మరో ప్రేమకథా చిత్రం 'వైశాఖం' వస్తోంది. హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ పతాకంపై డైనమిక్‌ లేడీడైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా అందరికీ వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ 'వైశాఖం' చిత్ర విశేషాలను తెలియజేశారు.

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ - ''ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. వైశాఖ మాసానికి చాలా ప్రాముఖ్యత, ఎంతో పవిత్రత వుంది. అందుకే ఈ మాసంలోనే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్నది ఈ మాసంలోనే. 'వైశాఖం' చిత్రం ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ. ఒక అమ్మాయి వైశాఖంలా ఒక అబ్బాయి జీవితంలోకి ఎంటర్‌ అయి అతనిలో ఎలాంటి మార్పును తీసుకొచ్చింది, వీరి ప్రేమ ప్రయాణం వైశాఖంలో పెళ్ళి వరకు ఎలా వెళ్ళింది అనేది కథ. స్క్రీన్‌ప్లే చాలా డిఫరెంట్‌గా వుంటుంది'' అన్నారు.

నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''ప్రేమలో పావని కళ్యాణ్‌, చంటిగాడు, గుండమ్మగారి మనవడు ఇవన్నీ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే లవ్‌స్టోరీస్‌. లవ్‌లీ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన లవ్‌స్టోరీ. మా బేనర్‌లో లవ్‌ ఓరియంటెడ్‌ మూవీసే ఎక్కువగా తీశాము. అన్నీ మంచి సక్సెస్‌ అయ్యాయి. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన డిఫరెంట్‌ లవ్‌స్టోరీ 'వైశాఖం'. షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ ఫాస్ట్‌గా జరుగుతోంది. బిజినెస్‌పరంగా చాలా మంచి ఆఫర్స్‌ వున్నాయి. సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌లో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

హీరో హరీష్‌ మాట్లాడుతూ - ''వైశాఖం వంటి మంచి సినిమాలో చెయ్యడం నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా వుంది. ఈ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్‌ వుంటాయి. నన్ను చాలా అద్భుతంగా ప్రెజెంట్‌ చేశారు. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్‌ జయగారికి, నిర్మాత బి.ఎ.రాజుగారికి నా కృతజ్ఞతలు. లవర్స్‌ని బాగా ఎట్రాక్ట్‌ చేసే ఈ సినిమా ఫ్యామిలీస్‌ని కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది'' అన్నారు.

హీరోయిన్‌ అవంతిక మాట్లాడుతూ - ''ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. షూటింగ్‌ చేస్తున్నప్పుడే బాగా ఎంజాయ్‌ చేశాను. చాలా మైన్యూట్‌ డీటైల్స్‌ కూడా డైరెక్టర్‌ జయగారు ఎంతో కేర్‌ తీసుకొని తీసారు. ఈ సినిమా చేయడం థ్రిల్‌గా ఫీల్‌ అయ్యాను. నా ఫ్యూచర్‌కి జయగారి 'వైశాఖం' గట్టి ఫౌండేషన్‌ అవుతుంది. ఇది యూత్‌ని బాగా ఆకట్టుకునే మంచి లవ్‌స్టోరీ'' అన్నారు.

హరీష్‌, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, కృష్ణభగవాన్‌, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్‌, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్‌ టీమ్‌ వెంకీ, శ్రీధర్‌, రాంప్రసాద్‌, ప్రసాద్‌, తేజ, శశాంక్‌, లతీష్‌, కీర్తి నాయుడు, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

డి.ఓ.పి.: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్‌, డాన్స్‌: వి.జె.శేఖర్‌, ఆర్ట్‌: మురళి కొండేటి, స్టిల్స్‌: శ్రీను, కో-డైరెక్టర్‌: అమరనేని నరేష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బారావు, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.శివకుమార్‌, నిర్మాత: బి.ఎ.రాజు, రచన, ఎడిటింగ్‌, దర్శకత్వం: జయ బి.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.

%%footer%%