Director Krish on Gautamiputra Satakarni Success

How can I share or communicate my beaming emotions with you? Words fall short to describe the warmth of joy and endearing affection you showed on me. My silence speaks volumes without ever saying a word. I feel the pride of winning a Nation and sense the instinct of embracing whole Telugu land at once.

I always had vast confidence on the interests and judgement of Telugu cinema loving audience and their empathising with good films. You gave birth to a new Krish in me by deeply respecting my first historical presentation of the story of an unsung Telugu warrior emperor Gautamiputra Satakarni.

My phone is continuously ringing with countless calls and congratulatory messages. My ears are reverberating with re-sounding sword fights on the screen and resonating claps from audience off the screen. Your slogans of Saho Satakarni in front of cinema theatres have showered millions blessings for me.

No rest, no interval, every technician and artist associated on this landmark film Satakarni are drenched in pleasure and pride. From January 12th, not for a minute their mobiles have gone idle.
Big thanks to the unequalled support and encouragement given by Press Media, Electronic Media, Social Media and all other media forms.

All I got to do is just bow my head before legendary Basavarama Tarakaputra Balakrishna for coalescing his 99 movies invaluable experience to inaugurate himself as one and only Gautamiputra Satakarni in the 100th. This victory belongs to him.
My last one word for all my Telugu audience, I discern it as a root responsibility to recount every second of my life with you.

Yours,
Anjanaputra Krish (From America)

ఆనందభాష్పాన్ని ఎలా పంచుకోవాలి..? ఒక దేశాన్ని గెలిచిన గర్వం... తెలుగు నేలంతా నన్ను కౌగలించుకున్నంత ఉద్వేగం.. మౌనం మాత్రమే చెప్పగల భావాన్ని ఎలా వ్యక్తం చెయ్యాలో తెలియటం లేదు.. చాలా మందికి తెలియని చరిత్రని చూపిస్తే కొత్తగా వుంటుందనుకున్నాను, కానీ ఆ చరిత్రే నన్ను కొత్తగా చూపిస్తుందని నేననుకోలేదు..

నాకైతే, నా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద, కళ్ళనిండా మనసు నింపుకుని సినిమా చూసే తీరుమీద, తీర్పు మీద నాకున్న నమ్మకం ఋజువయింది. అసంఖ్యాకమైన అభినందనలు ఇంకా వినిపిస్తూనే వున్నాయి. తెర మీద కరవాల ధ్వనులు, తెర ముందు కారతాళధ్వనులు, థియేటర్ల ముందు సాహో గౌతమిపుత్ర శాతకర్ణి అంటూ నినదిస్తున్న ప్రతిధ్వనులు వినిపిస్తూనే ఉన్నాయ్. ఫోన్లో అభినందనలు వింటుంటే మరెన్నో అభినందనలు బీప్ శబ్దాలు చేస్తూ ఎదురుచూస్తున్నాయి..

విశ్రాంతి లేదు, విరామం లేదు ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరి ఫోను 12వ తేదీ నుండి మోగుతూనే వుంది, మాట్లాడుతూనే వుంది.. వాళ్ళ కళ్లలో కదులుతున్న సంతోష తరంగాలు గొంతులలో వినిపిస్తున్నాయి, మనసుకి కనిపిస్తున్నాయి.. ప్రతి చోటా, ప్రతి నోటా ప్రశంసల వర్షం కురుస్తూనే వుంది.. ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అన్న తేడా లేకుండా ప్రతి మాధ్యమం ప్రోత్సహిస్తూనే వుంది. ఏం చెప్పాలి..

ఎలా స్పందించాలి? ఇది తొంభై తొమ్మిది చిత్రాల నాటానుభవాన్ని తన వందవ చిత్రంలో ఆవిష్కరించిన ఒక మహానటుడి నటవిశ్వరూపం.. ఈ విజయం ఆయన అందించిన ప్రోత్సహాఫలం..

మన తెలుగు ప్రేక్షకులందరికి ఒక్కమాట చెప్పాలనుకుంటున్నాను..

నా జీవితంలో ప్రతినిమిషాన్ని మీకు చెప్పాల్సిన ఓ కృతజ్ఞతగా భావిస్తాను..

మీ, అంజనాపుత్ర క్రిష్. (అమెరికా నుంచి...)

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.