Social News XYZ     

Hacked By Devil (HBD) movie teaser released

హ్యాక్‌డ్‌ బై డెవిల్‌ (హెచ్‌బిడి) టీజర్‌ విడుదల

Hacked By Devil (HBD) movie teaser released

లాగిన్‌ మీడియా పతాకంపై మేఘన, సంతోషి, సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్‌ దర్శకత్వంలో ఉదయ్‌భాస్కర్‌. వై నిర్మించిన హర్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీ 'హ్యాక్‌డ్‌ బై డెవిల్‌' (హెచ్‌బిడి). ఈ చిత్రం యొక్క టీజర్‌ని ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత సాయి వెంకట్‌, దర్శకుడు
కృష్ణకార్తీక్‌, మేఘన, సంతోషి, సల్మాన్‌, డిఓపి కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వినయ్‌గౌడ్‌ వై, నిర్మాత ఉదయ్‌భాస్కర్‌. వై తదితరులు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణకార్తీక్‌ మాట్లాడుతూ..సినిమాకి సంబంధించిన టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన నేను..ఫస్ట్‌టైమ్‌ డైరెక్షన్‌ చేశాను. ఈ చిత్రం యూత్‌ని డెఫనెట్‌గా ఆకట్టుకుంటుంది. ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో, చక్కటి సంగీతంతో ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. నన్ను, నా కథని నమ్మి..నిర్మాత ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు. నా ఈ తొలి ప్రయత్నానికి సహకరించిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను...అన్నారు.

చిత్ర నిర్మాత ఉదయ్‌భాస్కర్‌. వై మాట్లాడుతూ..మేము ఒక టీమ్‌లా ఏర్పడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ చిత్రం తర్వాత రెగ్యులర్‌గా సినిమాలు నిర్మిస్తాం. ప్రస్తుతం మా ఈ హ్యాక్‌డ్‌ బై డెవిల్‌ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. జనవరి 1న ఆడియోని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. మా ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని, అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము..అన్నారు.

మేఘన, సంతోషి, సల్మాన్‌, హిమజ, మానస, సురేష్‌, అజయ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్‌ యం.యం, డిఓపి: కన్నా కోటి, ఎడిటర్‌: కె.ఆర్‌. స్వామి, డైలాగ్స్‌: అభయ్‌ శ్రీజయ్‌, కో-డైరెక్టర్‌: రమేష్‌ పోలే, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: మల్లిక్‌. కె, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వినయ్‌ గౌడ్‌. వై, నిర్మాత: ఉదయ్‌భాస్కర్‌. వై, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కృష్ణకార్తీక్‌.

Facebook Comments

%d bloggers like this: