Pittagoda censored with ‘U’ certificate, Worldwide Release on December 24th.

'పిట్టగోడ' చిత్రానికి క్లీన్‌ 'యు' - డిసెంబర్‌ 24 విడుదల

విశ్వదేవ్‌ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'పిట్టగోడ'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. మంచి కథ, కథనాలతో క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మంచి ఫీల్‌ వుందని, మ్యూజికల్‌గా కూడా చాలా బాగుందని సెన్సార్‌ సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 24న విడుదల చేస్తున్నారు.

విశ్వదేవ్‌ రాచకొండ హీరోగా, పునర్నవి భూపాలం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో ఉయ్యాలా జంపాలా రాజు, జబర్దస్త్‌ రాజు, శివ ఆర్‌.ఎస్‌., శ్రీకాంత్‌ ఆర్‌.ఎన్‌. ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి సంగీతం: 'ప్రాణం' కమలాకర్‌, నిర్మాతలు: దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి., దర్శకత్వం: అనుదీప్‌ కె.వి.

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%