At the foothills of Tirumala and with the blessings of Lord Balaji, the big event of Nandamuri Balakrishna’s historical 100th film Gautamiputhra Satakarni audio function will be held at Sri Pandit Jawaharlal Nehru Municipal High School Grounds, Tirupathi on December 26th. GPSK is the most happening film and this function is most awaited event for Telugu people in all parts of the world.
After the breathtaking GPSK trailer took Youtube by storm breaking all time records with highest number of views ever for a Telugu film, makers are organizing this audio function prestigiously with Central Minister Venkaiah Naidu and Andhra Pradesh Chief Minister Chandrababu Naidu as special guests.
“The uniquely orchestrated trailer launch in Kotilingala, Karimnagar district and in 100 theaters simultaneously in Telugu states is declared biggest success. We are happy to have crossed the expectations of audience with the trailer. Inspired by this success, we are resuming the courage forward to big occasion of Gautamiputra Satakarni audio launch to be organized on December 26th at Pandit Jawaharlal Nehru Municipal High School Grounds in Tirupathi.
Along with Central Minister Venkaiah Naidu and Andhra Pradesh Chief Minister Chandrababu Naidu as chief guests, entire casting of the film Balakrishna, Shriya Saran, Hema Malini and other technicians will join the program. We request the same support from media, audience, fans and police in making this function one more memorable event in the journey of GPSK,” producers said.
The historical movie presented by Bibo Srinivas and produced on First Frame Entertainment banner by Y Rajeev Reddy, Jagarlamudi Saibabu on a mammoth budget will remain as greatest films in Telugu cinema history.
డిసెంబర్ 26న తిరుపతిలో గ్రాండ్ లెవల్లో గౌతమిపుత్ర శాతకర్ణి
ఆడియో విడుదల
కలియుగ దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వరుడి పాదాల చెంతనున్న తిరుపతిలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఆవిష్కరణ కానుంది. ఈ వేడుక తిరుపతిలోని శ్రీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రు మున్సిపల్ హై స్కూల్‌లో డిసెంబర్ 26న గ్రాండ్‌గా జరగనుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి
.
రీసెంట్‌గా విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. మరే తెలుగు సినిమా ట్రైలర్స్‌కు లేని విధంగా యూ ట్యూబ్ చానెల్‌లో హయ్యస్ట్ వ్యూస్‌తో గౌతమిపుత్ర శాతకర్ణి ఓ సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ స్పందనతో చిత్రయూనిట్ ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా...
వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - కరీంనగర్ జిల్లా కోటిలింగాల సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్స్‌లో విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ స్పందనతో సినిమా కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. ఈ సినిమా ఆడియో వేడుకను డిసెంబర్ 26న తిరుపతిలోని శ్రీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం. ఈ వేడుకకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, డైరెక్టర్ క్రిష్, శ్రియా శరన్ సహా టోటల్ టీం ఈ వేడుకలో పాల్గొంటారు
అన్నారు`` అన్నారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, కబీర్ బేడి తదితరలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతంః చిరంతన్ భట్, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.